'కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి సమగ్ర చర్యలు' | nda govt committed to labour welfare, says bandaru dattatreya | Sakshi
Sakshi News home page

'కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి సమగ్ర చర్యలు'

Published Fri, Nov 21 2014 3:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

బండారు దత్తాత్రేయ(ఫైల్)

బండారు దత్తాత్రేయ(ఫైల్)

హైదరాబాద్: కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి కేంద్రం సమగ్ర చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మోడల్ ఐటీఐ కాలేజీలు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్, బోయిగూడ, రామగుండం, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు.

కార్మికుల భద్రత, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని హామీయిచ్చారు. నాచారంలో డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. శ్రమసువిధ పథకంలో భాగంగా కార్మికులకు యూనిట్ గుర్తింపు కార్డులు ఇస్తామని దత్తాత్రేయ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement