కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు.
అనంతపురం: కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు. అనంతరంపురంలోని వర్సిటీ సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు.