ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పద్ధతిలో 101 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పోస్టుల భర్తీకి అనుమ తిస్తూ పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలానికి అభ్యర్థులను ఈ ఉద్యోగాల్లో నియమి స్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టును పొడిగిస్తారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, వికలాంగులకు 3% రిజర్వేషన్ అమలు చేస్తారు.
ఈ కమిటీలో పశుసంవర్థకశాఖ డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, పీవీఎన్‌ఆర్ వెటర్న రీ వర్సిటీ డీన్‌లు ఉన్న రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ పోస్టులను భర్తీచేయ నుంది. ఈ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ రీ (బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్) డిగ్రీ ఉన్న వారు అర్హులు. వారికి రూ. 35 వేలు వేతనంగా నిర్ధారించారు. నియామకాలు పొందిన వారిని ఎటువంటి షరతులు లేకుండా 30 రోజుల నోటీసుతో ఎప్పుడైనా తొలగించే అవకాశముంది.