
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్‌వచ్చిందంటే చాలు ఆన్‌లైన్ రీటైలర్ల ఆఫర్లు, డిస్కౌంట్ సేల్‌కు తెరలేస్తుంది. ఆన్‌లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను ప్రకటించగా, ఈ కోవలో అమెజాన్ చేరింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022 సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోప కరణాలు, ఇతర ఉత్పత్తులతో సహా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయ డీల్స్ పొందవచ్చు. మొబైల్స్, ఉపకరణాలపై 40 శాతం దాకా తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను అందించనుంది.
అమెజాన్ వెబ్‌సైట్ ప్రకారం, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపునివ్వనుంది. అలాగే గృహోపకరణాలపై 75 శాతం వరకు, రోజువారీ నిత్యావసరాలపై 65శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. అయితే ఈ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ధృవీకరించనప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తో పాటు సెప్టెంబర్ 23నుండి స్టార్ట్ అవుతుందని రు భావిస్తున్నారు. వినియోగదారులకు డిస్కౌంట్‌ను ఇచ్చేందుకు ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెజాన్ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులు 10శాతం తక్షణ తగ్గింపును అందించనుంది.