వివో సరికొత్త సేల్‌, స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు | Vivo Knockout Carnival Offers Discounts and Cashbacks on Select Smartphones | Sakshi
Sakshi News home page

వివో సరికొత్త సేల్‌, స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

Published Wed, May 16 2018 7:37 PM | Last Updated on Wed, May 16 2018 7:38 PM

Vivo Knockout Carnival Offers Discounts and Cashbacks on Select Smartphones - Sakshi

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వివో సరికొత్త సేల్‌కు తెరలేపింది. వివో నాకౌట్‌ కార్నివల్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. మే 16(నేటి) నుంచి మే 18 వరకు ఎక్స్‌క్లూజివ్‌గా వివో అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేయనుంది. ఈ మూడు రోజులు వివో వీ5 ప్లస్‌, వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ రూ.14,990కు, రూ.12,990కు విక్రయిస్తోంది.

వివో ఆఫర్‌ చేసే ఈ స్పెషల్‌ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లకు మెరుగైన షాపింగ్‌ అనుభవాన్ని అందించనున్నాయని వివో ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కెన్నీ జెంగ్‌ తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కస్టమర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు వివో పేర్కొంది. రూ.1000 వరకు లక్కీ డ్రా కూపన్లను వివో ఈ కార్నివల్‌లో ఆఫర్‌ చేస్తోంది. రూ.500 విలువైన బుక్‌మైషో కపుల్‌ మూవీ ఓచర్లు అందిస్తోంది. అన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌పైనా 12 నెలల పాటు ‘నో కాస్ట్‌ ఈఎంఐ’ ఆఫర్‌ను వివో అందుబాటులోకి తెచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement