సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను రూపే, భీమ్ యాప్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు లభించనున్నాయి. జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పైలట్ ప్రాజ్జెక్టుగా ముందుగా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు ప్రయోగాత్మంగా, స్వచ్ఛందంగా ప్రారంభించనున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సాధించిన ఆదాయం, నష్టం లాంటి అంశాలను అంచనా వేయనున్నామని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహాకాలపై బీహార్ డిప్యూటీముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం ప్రతిపాదనలకౌన్సిల్ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే 20శాతం దాకా క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెల్లించనున్నామని వెల్లడించారు. మొత్తం జీస్‌ఎటీపై గరిష్టంగా వంద రూపాయలు వరకు పొందవచ్చని గోయల్ చెప్పారు. కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29తేదీల్లో గోవాలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment