పేటీఎం మాల్‌ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌’ సేల్‌ | Paytm Mall Announces 'Freedom Cashback' Sale | Sakshi
Sakshi News home page

పేటీఎం మాల్‌ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌’ సేల్‌

Published Thu, Aug 9 2018 1:07 PM | Last Updated on Thu, Aug 9 2018 1:07 PM

Paytm Mall Announces 'Freedom Cashback' Sale - Sakshi

పేటీఎం మాల్‌ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌’ సేల్‌

ఈ-కామర్స్‌ కంపెనీలన్నీ వరుసబెట్టి స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్‌ నేటి నుంచి తన ‘ఫ్రీడం సేల్‌’ను ప్రారంభించగా.. ఫ్లిప్‌కార్ట్‌ ‘ది బిగ్‌ ఫ్రీడం సేల్‌'ను రేపటి నుంచి నిర్వహించబోతుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌కు పోటీగా.. పేటీఎం మాల్‌ కూడా ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌’ సేల్‌ను ప్రకటించింది. పేటీఎం మాల్‌ సేల్‌ నిన్నటి(ఆగస్టు 8) నుంచే ఈ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఎవరైతే కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరియైన సమయమని తెలుస్తోంది. పేటీఎం మాల్‌ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన డెల్‌ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్‌ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. 

ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎంక్యూడీ42హెచ్‌ఎన్‌/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంది. అంతేకాక, ఆపిల్‌, హెచ్‌పీ, ఏసర్‌ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఆఫర్లు మాత్రమే కాక, మిడ్‌నైట్‌ సూపర్‌ డీల్స్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్‌ ఆఫర్‌ చేస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్‌ సేల్స్‌, అద్భుతమైన డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా పేమెంట్లు జరుపుతారో, వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement