![Paytm Mall Offers iPhone XS iPhone XR Other iPhone - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/9/iPhone_X_.jpeg.webp?itok=wS1k5Wj5)
సాక్షి, ముంబై : ఖరీదైన ఐఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి అవకాశం. డిజిటల్ దిగ్గజం పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. తన వెబ్‌సైట్‌లో ఐఫోన్లపై ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఈ నుంచి ఎక్స్‌ఎస్ మ్యాక్స్ దాకా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఆర్ తదితర ఫోన్లపై గరిష్టంగా రూ.15వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తోంది. దీంతోపాటు కొన్ని మోడల్స్‌పై ప్రోమోకోడ్ ఆఫర్ కూడా ఉంది.
ఐ ఫోన్స్ ఎక్స్ మాక్స్ : 256 జీబీ స్టోరేజి వేరియంట్‌ను రూ. 1,14,156 లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐ ఫోన్ ఎక్స్‌ఆర్ 64 జీబీ మోడల్‌ను రూ. 53,687లకే అందుబాటులో ఉంది.
ఐఫోన్ ఎక్స్ : 64జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియింట్ ధరలు వరుసగా రూ. 89,999 రూ. 75,489గా ఉన్నాయి. దీంతోపాటు ఎకోడాట్ స్మార్ట్ స్పీకర్ కూడా ఉచితం..
ఐఫోన్ 8 : 64జీబీ స్టోరేజ్ వేరియింట్ రూ. 59,990. 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 70,799
ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియింట్ ధర రూ. 68వేలు.
ఐఫోన్ 7 : 32 జీబీ వేరియంట్ ధర రూ. 39,530. 128జీబీ స్టోరేజి మోడల్ ధర రూ. 52,999.
ఐఫోన్ 7 ప్లస్ : 32జీబీ 128జీబీ , 256 జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ. 49,899, రూ. 61,999, రూ. 64,990లు.
Comments
Please login to add a commentAdd a comment