పేటీఎంలో ఐఫోన్ ఎస్‌ఈ ధర తగ్గింది!
పేటీఎంలో ఐఫోన్ ఎస్‌ఈ ధర తగ్గింది!
Published Sat, Aug 5 2017 5:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM
ప్రస్తుతం భారత్‌లో దొరుకుతున్న ఆపిల్ స్మార్ట్‌ఫోన్లలో అత్యంత సరసమైన ఫోన్ ఏదైనా ఉందా? అంటే అది ఐఫోన్ ఎస్‌ఈనే. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ మోడల్‌ను ప్రస్తుతం పేటీఎం ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లో రూ.22,990కే విక్రయిస్తోంది. అంతేకాక అదనంగా 3000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పేటీఎం ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎస్‌ఈ ధర ఫైనల్‌గా రూ.19,990కి దిగొచ్చింది. అసలు పేటీఎం మాల్‌లో ఐఫోన్ ఎస్‌ఈ ధర 27,200 రూపాయలు.
ఈ ప్రొడక్ట్‌ను కార్ట్‌లో యాడ్ చేసుకున్న అనంతరం ప్రోమో కాడ్‌ను ఆధారితంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. ప్రోమో కోడ్‌ను వాడుకుని, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందే కస్టమర్లకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉండదట. ఆశ్చర్యకరంగా ఈ హ్యాండ్‌సెట్‌పై 9000 రూపాయల బైబ్యాక్ గ్యారెంటీని కూడా పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ ఎస్‌తో పాటు ఐఫోన్ 5ఎస్ నుంచి ఐఫోన్ 7 ప్లస్ వరకున్న పలు ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్, ఫ్లాష్ ఆఫర్లను పేటీఎం మాల్ ప్రకటించింది.
ఐఫోన్ ఎస్‌ఈ ఫీచర్లు...
4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే
ఆపిల్ ఏ9 ఎస్‌ఓసీ
12ఎంపీ రియర్ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Advertisement
Advertisement