న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్, పేటీఎమ్ మాల్‌లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ–టైలర్ ఈబే కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్‌లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్, సీఈఓ డెవిన్ వెన్ చెప్పారు. భారత ఈ కామర్స్ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈబే పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment