Amazon Prime Day Sale 2022 India: Date, Deals, Special Offers And Other Details - Sakshi
Sakshi News home page

Amazon Prime Day Sale 2022: కొనుగోలు దారులకు బంపరాఫర్‌, స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌!

Published Thu, Jul 7 2022 12:26 PM | Last Updated on Thu, Jul 7 2022 1:10 PM

Amazon India Announces Prime Day Sale - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. రెండు రోజుల పాటు నిర్వహించే సేల్‌లో పలు ప్రొడక్ట్‌లను భారీ డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. 

జులై23, జులై 24న అమెజాన్‌ నిర్వహించే ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, అప్లయన్సెస్‌, ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ, గ్రాసరీస్‌, అమెజాన్‌ డివైజెస్‌, హోం అండ్‌ కిచెన్‌, ఫర్మీచర్‌తో పాటు ప్రతి రోజు ఇంట్లో వినియోగించే నిత్యవసర వస్తువులపై భారీ ఆఫర్లు వర్తిస్తాయని చెప్పింది. 

అమెజాన్‌ నిర్వహించే ఈ సేల్‌లో సుమారు 400కి పైగా బ్రాండ్‌ అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రైమ్‌ డైరెక్టర్‌ అక్షయ్‌ సాహి తెలిపారు. జులై 23 12.00 ఏఎం నుంచి జులై 24 అర్ధరాత్రి 11.59గంటల వరకు సేల్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో 400జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు చెందిన 30వేలకు పైగా ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచుతున్నట్లు అక్షయ్‌ సాహి చెప్పారు. అమెజాన్‌ ఈకో, ఫైర్‌ టీవీ, కిండెల్స్‌ డివైజ్‌తో పాటు స్మార్ట్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ డిస్‌ప్లే, ఫైర్‌ టీవీ వంటి ప్రొడక్ట్‌లపై 55శాతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement