బెంగుళూరు: కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్ధికి కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా భారత ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ పీటీఎం మాల్ త్వరలో గ్రోసరీ మార్కెట్(సూపర్ మార్కెట్)రంగంలో ప్రవేశించనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రామాణికమైన స్థానిక వ్యాపారులతో (కిరాణా దుకాణాల) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పేటీఎం మాల్‌లో గ్రోసరీ మార్కెట్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్ తదితర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆన్‌లైన్ టూ ఆప్‌లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ మాల్ సేవలందించనుంది.
కాగా వస్తువుల పంపిణీకి లాజిస్టిక్స్ వ్యాపారులను(గిడ్డంగులు, ప్యాకేజింగ్) సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఫార్మా రంగానికి చెందిన మందుల పంపిణీలో సంక్లిష్టత కారణంగా ఈ రంగంలో ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం పేటీఎమ్ మాల్ స్థానిక కిరాణా, మధ్యస్థాయి దుకాణాదారుల సమన్వయంతో వినియోగదారులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ వృద్ధి చెందేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. పేటీఎం సంస్థ లాక్‌డౌన్ కారణంగా కేంద్ర కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చింది.
త్వరలో ప్రారంభించబోయే పేటీఎం మాల్‌గ్రోసరీ మార్కెట్)ను పరుగులు పెట్టించేందుకు 10,000 కిరాణా స్టోర్స్, చిన్న మధ్య స్థాయి దుకాణాదారులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, గ్రోసరీ మార్కెట్‌లో వృద్ధి చెందేందుకు గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ తదితర ఆన్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం సంస్థ పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ ప్రభావం వల్ల గ్రోసరీ మార్కెట్ వైపు ఈకామర్స్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇదే బాటలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ గ్రోసరీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (చదవండి: వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్)
Comments
Please login to add a commentAdd a comment