groceries market
-
వాట్సాప్ ద్వారా సరుకులు ఆర్డర్..అందుబాటులో జియో మార్ట్ సేవలు
హైదరాబాద్: వాట్సాప్ ద్వారా కూడా సరుకులు ఆర్డర్ చేసే వెసులుబాటును రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీనితో సమయంపరమైన పరిమితులేమీ లేకుండా హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని కస్టమర్లు తమ వీలును బట్టి ఆర్డర్ చేయొచ్చని సంస్థ తెలిపింది. కనీసం రూ. 250 కొనుగోళ్లపై కచ్చితమైన 30 శాతం తగ్గింపును, గరిష్టంగా రూ. 120 వరకూ అందుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌లో కొనుగోళ్లు చేసేందుకు +91 7977079770కి సందేశం పంపించవచ్చని వివరించింది. -
వచ్చేస్తోంది.. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్..
గ్రాసరీస్ హోం డెలివరీ సర్వీస్‌లపై బడా కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే స్టార్టప్‌లు ఈ రంగంలో దూసుకుపోతుండగా మార్కెట్ బిగ్ ప్లేయర్స్ సైతం రంగంలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా జియో సంస్థ సైతం సన్నహకాలు జోరుగా సాగిస్తోంది. గ్రోసరీస్ డెలివరీ సర్వీసులను జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో మార్కెట్లోకి తెచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నవీ ముంబైలో ఈ సేవలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున గ్రాసరీస్ డెలివరీ చేయాలని డిసైడ్ అయ్యింది. జెప్టో, బ్లింకిట్ వంటి స్టార్టప్ సంస్థలు పది నిమిషాల్లో గ్రోసరీస్ డెలివరీ లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే రిలయన్స్ సంస్థ ఇటువంటి టార్గెట్స్లను పెట్టుకోలేదు. 90 నిమిషాల్లో డెలివరీకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్ మార్క్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఫ్రీ హోం డెలివరీకి కనీసం రూ.199 బిల్ చేయాల్సి ఉంటుంది. చదవండి: కొత్త బిజినెస్‌లోకి యాపిల్, గూగుల్ ఫ్యూచర్ ఏంటో! -
కిరాణ సరుకుల అమ్మకాలపై భారీ దెబ్బ!
కరోనా కేసుల విజృంభణ భారత్‌లో మొదలైంది. థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. ఆంక్షలు, కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి చర్యలు మొదలయ్యాయి. ఈ తరుణంలో నిత్యావసరాల అమ్మకాలపై భారీ దెబ్బ పడుతోంది. వ్యాక్సినేషన్ ఉధృతంగా కొనసాగడం, మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న జోష్.. ప్రొడక్టివిటీ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. దీంతో నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం అద్భుతంగా జరగొచ్చని భావించారు. అక్టోబర్ నుంచి పెరిగిన కిరాణ వస్తువుల అమ్మకాలు.. డిసెంబర్ మధ్యకల్లా తారాస్థాయికి చేరింది. దీనికి తోడు పెళ్లి, పండుగ సీజనులు వస్తుండడంతో కలిసొస్తుందని వ్యాపారులు అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఒమిక్రాన్ వేరియెంట్, కరోనా కేసుల పెరుగుదల దేశవ్యాప్తంగా నిత్యావసరాల అమ్మకాలను దెబ్బ కొడుతున్నాయి. నో సప్లయ్ నిత్యావసర దుకాణాల అమ్మకాల జోరుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కొవిడ్ ఆంక్షలతో హోల్ సేల్ నుంచి కిందిస్థాయి దుకాణాలకు, చిన్నచిన్న మార్ట్‌లకు సరుకులు చేరడం లేదు. మరోవైపు కఠిన ఆంక్షలతో వాహనాల రాక ఆలస్యమవుతోంది. హోల్‌సేల్ షాపుల నుంచి చిన్న చిన్న కిరాణ కొట్టుల దాకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ల నుంచి కిందిస్థాయి మార్కెట్లకు డిమాండ్‌కు తగ్గ సప్లయ్ ఉండడం లేదు. ఇంకోవైపు దుకాణాల ముందు జనాలు.. క్యూలు కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో అధిక ధరలకు అమ్మకాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల. అయితే హోల్‌సేల్ రవాణాకు అనుమతులు లభించడం, ఆంక్షలపై స్వల్ఫ ఊరట ద్వారా ఈ సమస్య గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. ఫ్రెష్ సరుకు రవాణాకి అంతరాయం ఏర్పడడంతో చాలాచోట్ల కొన్ని ఉత్పత్తుల మీద అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ఎక్స్పెయిర్ అయిన ప్రొడక్టులను అలాగే అమ్మేస్తున్నారు. హోల్‌సేల్, చిన్ని చిన్న దుకాణాల్లో అయితే అవేం చూడకుండా కొనేస్తున్నారు వినియోగదారులు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని, ఎక్స్‌పెయిరీ వగైరా వివరాల్ని ఒకసారి చెక్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ మినహాయింపు అయితే మెట్రో సిటీ, సిటీ, అర్బన్, టౌన్లలో ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. ఈ-కామర్స్, ఆన్లైన్ గ్రాసరీ యాప్‌ల ద్వారా డోర్ డెలివరీలు నడుస్తున్నాయి. పనిలో పనిగా డెలివరీ ఛార్జీలపై అదనపు బాదుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చనే అంచనా వేస్తున్నారు. సంబంధిత వార్త: షాపుల ముందు తగ్గుతున్న ‘క్యూ’లు.. జోరందుకున్న ఆన్లైన్ ఆర్డర్లు -
పేటీఎం మాల్ సరికొత్త వ్యూహం..
బెంగుళూరు: కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్ధికి కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా భారత ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ పీటీఎం మాల్ త్వరలో గ్రోసరీ మార్కెట్(సూపర్ మార్కెట్)రంగంలో ప్రవేశించనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రామాణికమైన స్థానిక వ్యాపారులతో (కిరాణా దుకాణాల) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పేటీఎం మాల్లో గ్రోసరీ మార్కెట్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్ తదితర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆన్లైన్ టూ ఆప్లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ మాల్ సేవలందించనుంది. కాగా వస్తువుల పంపిణీకి లాజిస్టిక్స్ వ్యాపారులను(గిడ్డంగులు, ప్యాకేజింగ్) సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఫార్మా రంగానికి చెందిన మందుల పంపిణీలో సంక్లిష్టత కారణంగా ఈ రంగంలో ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం పేటీఎమ్ మాల్ స్థానిక కిరాణా, మధ్యస్థాయి దుకాణాదారుల సమన్వయంతో వినియోగదారులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ వృద్ధి చెందేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. పేటీఎం సంస్థ లాక్డౌన్ కారణంగా కేంద్ర కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చింది. త్వరలో ప్రారంభించబోయే పేటీఎం మాల్గ్రోసరీ మార్కెట్)ను పరుగులు పెట్టించేందుకు 10,000 కిరాణా స్టోర్స్, చిన్న మధ్య స్థాయి దుకాణాదారులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, గ్రోసరీ మార్కెట్లో వృద్ధి చెందేందుకు గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ తదితర ఆన్లైన్ సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం సంస్థ పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావం వల్ల గ్రోసరీ మార్కెట్ వైపు ఈకామర్స్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇదే బాటలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ గ్రోసరీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (చదవండి: వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్) -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు జియో మార్ట్ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనం రేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఇక రిటైల్ ఇ-కామర్స్ సంస్థలకు షాక్ ఇవ్వనుంది. ముఖ్యంగా దేశంలో రీటైల్ వ్యాపార దిగ్గజాలు అమెజాన్ , వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థల వ్యాపారాన్ని దెబ్బకొట్టనుంది. ఈ ఏడాది జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే కళ్యాణ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ (దేశ్ కీ నయీ దుకాన్) ఇక దేశవ్యాప్తంగా తన సేవలను ప్రారంభించనుంది. జియో ప్లాట్‌ఫాం, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ మధ్య కొత్త భాగస్వామ్యం ఫలితంగా, వినియోగదారులు తమ వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్‌తో సమీప కిరాణా దుకాణాల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులతో ఇళ్లకు ఉత్పత్తులు, సేవలను పొందవచ్చని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆఐఎల్ ఫేస్బుక్ మధ్య తాజాగా కుదిరిన రూ.43,574 కోట్ల అతి పెద్ద ఎఫ్‌డీఐ ఒప్పందంతో 2021 నాటికి రిలయన్స్ ను రుణ రహిత సంస్థగా రూపొందించాలన్న లక్ష్యంలో కీలక అడుగు పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. స్థానిక,చిన్నకిరాణా దుకాణాలు ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. వాట్సాప్ సేవలకు ప్రభుత్వ అనుమతి అనంతరం వాట్సాప్‌లో జియోమార్ట్ ద్వారా సరుకులను ఆర్డర్ చేసిన వినియోగదారులకు సమీపంలో ఉన్న వర్తకులే ఇళ్ల వద్దకు డెలివరీ చేస్తారు. చెల్లింపులు ఆన్లైన్లో పూర్తి చేయడంతో పాటు, పంపిణీ కూడా వేగవంతమవుంది. ఇందుకు గాను వాట్సాప్ ఇప్పటికే బీటా దశలో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ సేవలను త్వరలో భారత్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.(వాట్సాప్ యూజర్లకు శుభవార్త) దేశంలో ఇంకా విస్తృతంగా కార్యకలాపాలు ప్రారంభించకపోయినప్పటికీ ఇప్పటికే అనేక చిన్న వ్యాపారులు, కిరాణా షాపులను జియోమార్ట్ తన ప్లాట్‌ఫాంలో చేర్చుకుంది. అలాగే జియోఫోన్లలో ఇప్పటికే వాట్సాప్ ఇన్స్టెంట్ మెసేజ్ ఫీచర్ లాంచ్ చేసింది. 480 మిలియన్లకు పైగా వినియోగదారులతో చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద డిజిటల్ మార్కెట్ ను సొంతం చేసుకున్న వాట్సాప్ ప్రధానంగా గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుందని స్వయంగా ముకేశ్ అంబానీ బుధవారం నాటి సందేశంలో పేర్కొనడం గమనార్హం. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ నిత్యావసర సేవల పంపిణీ సేవలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీలో రిలయన్స్ జియోమార్ట్ ప్రవేశం ఈ కామర్స్ వ్యాపారంలో పెద్ద సంచలనమే కానుంది. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) -
సరుకులమ్ముతాం.. సరుకులూ!
పుస్తకాలతో మొదలుపెట్టి.. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వరకు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్న ఈ-బిజినెస్ సైట్ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త వ్యాపారంలోకి దిగుతోంది. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్లైన్లో అమ్మేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, జాప్ నౌ లాంటి కొన్ని సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రవేశంతో వీటికి గట్టిపోటీ ఎదురవడం ఖాయమనే అంటున్నారు. తమ సంస్థకు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానం, గోడౌన్లు, బ్రాండు అన్నీ ఉన్నాయని.. ఇప్పుడు ఈ వ్యాపారంలో అడుగుపెట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని సంస్థ ప్రతినిధి ఒకరు అన్నారు. మరోవైపు అమెజాన్ పోర్టల్ ఇప్పటికే కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, డ్రింకులను ఇప్పటికే గత సంవత్సరం అక్టోబర్ నెలనుంచి సైట్లో అమ్మకానికి పెట్టింది. స్నాప్‌డీల్ కూడా ఈ రంగంలో ఉంది. వాళ్లు గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్‌తో ఒప్పందానికి వచ్చారు. ఆర్డర్ చేసిన మర్నాడు వినియోగదారుడి ఇంటికి సరుకులు వచ్చేస్తాయి. త్వరలోనే ఆన్లైన్ మార్కెట్లో నిత్యావసర సరుకుల మార్కెట్ చాలా భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.