ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు | iPhone 6 sells for Rs 21,700, iPhone 7 for Rs 39,500 as iPhones get big discounts before iPhone 8 launch | Sakshi
Sakshi News home page

ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Published Fri, Sep 1 2017 11:28 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్‌12న ఆపిల్‌ మెగా ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఐఫోన్‌ 8 ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ కాబోతుంది. ఐఫోన్‌ 8తో పాటు ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్ల రాక సందర్భంగా పాత ఐఫోన్లపై పేటీఎం మాల్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 6 తో పాటు మిగతా మోడల్స్‌పై పేటీఎం మాల్‌ ఈ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. ముందస్తు ఎన్నడూ చూడని ధరలో ఐఫోన్‌7 విక్రయానికి వచ్చింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాల వ్యవధిలోనే అందుబాటులో ఉండనున్నాయని పేటీఎం మాల్‌ చెప్పింది. 
 
ఐఫోన్‌ 7 ఆఫర్‌...
ఆపిల్‌ గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్‌ 7ను అతి తక్కువగా డిస్కౌంట్‌ ధరలో రూ.39,479కే విక్రయించుతోంది. దాంతో పాటు 65,200 రూపాయల ధర కలిగిన ఐఫోన్‌ 7 128జీబీ వేరియంట్‌పై కూడా 8 శాతం డిస్కౌంట్‌, రూ.12వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ ప్రకటించింది. ఇక ఐఫోన్‌ 7 32జీబీ రోజ్‌ గోల్డ్‌ వేరియంట్‌ను కూడా 13 శాతం డిస్కౌంట్‌, 9,100 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో 39,599 రూపాయలకే పేటీఎం మాల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్‌ అసలు ధర రూ.56,200. 
 
ఐఫోన్‌ 7 256జీబీ రోజ్‌ గోల్డ్‌ వేరియంట్‌పై కూడా పేటీఎం మాల్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఫోన్‌ అసలు ధర 80వేల రూపాయలుంటే, దీనిపై 24 శాతం డిస్కౌంట్‌, 10,500 క్యాష్‌బ్యాక్‌తో 60,898 రూపాయలకే అందిస్తోంది. ఐఫోన్‌ 7 256జీబీ బ్లాక్‌ వేరియంట్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో రూ.62,099కు అందుబాటులో ఉంది. 
 
ఐఫోన్‌ 6 ఆఫర్‌....
ఐఫోన్‌ 6ను 21,685 రూపాయలకు పేటీఎం మాల్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ ధర 27,685 రూపాయలకు అందుబాటులో ఉండగా.. దీనిపై 6000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.21,685కు దిగొచ్చింది. 
 
ఐఫోన్‌ 7 ప్లస్‌...
ఐఫోన్‌ 7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్‌ 7 ప్లస్‌ 32జీబీ-గోల్డ్‌ వేరియంట్‌ అసలు ధర 72వేల రూపాయలుండగా.. డిస్కౌంట్‌ అనంతరం 51,399 రూపాయలకే ఈ ఫోన్‌ విక్రయానికి వచ్చింది. ఇదే వేరియంట్‌ సిల్వర్‌ కలర్‌ ఫోన్‌ కూడా 51,370 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్‌ 7 ప్లస్‌ 128జీబీ(గోల్డ్‌) వేరియంట్‌ను పేటీఎం మాల్‌ 57,599 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ మోడల్‌ అసలు ధర 82వేల రూపాయలు. 
 
ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌...
ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కూడా డిస్కౌంట్‌ ధరలో 37,299 రూపాయలకు పేటీఎం మాల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ అసలు ధర 72వేల రూపాయలు. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 16జీబీ(గోల్డ్‌) వేరియంట్‌ కూడా 38,299 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్‌ అసలు ధర కూడా 72వేల రూపాయలు. ఇలా ఐఫోన్‌ వేరియంట్లపై పేటీఎం మాల్‌ డిస్కౌంట్‌ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement