big discounts
-
టీటీకే ప్రెస్టీజ్ సూపర్ సేవర్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ కిచెన్ ఉపకరణాల బ్రాండ్ టీటీకే ప్రెస్టీజ్ ‘సూపర్ సేవర్ ఆఫర్ 2022–2023’ ను పరిచయం చేసింది. స్టవ్‌లు, బర్నర్లు, కుక్‌టాప్, గ్రైండర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి గది ఉపకరణాలు, వంట సామగ్రిలను నమ్మశక్యం కాని గొప్ప తగ్గింపుతో అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఏడాది, సంక్రాంతి సంబరాలను మరింత రెట్టింపు చేసుకునేందుకు అద్భుతమైన డీల్స్, భారీ తగ్గింపు, ఉచిత బహుమతులెన్నో ప్రకటించింది. వంటను సులభంగా, తర్వితగతిన చేసే విన్నూత ఉత్పత్తులను అందించే లక్ష్యంగా ప్రతి ఏడాదిలాగే ఈసారి సూపర్ సేవర్ ఆఫర్లు ప్రకటించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
వన్‌ప్లస్ 10 ప్రొ పై భారీ తగ్గింపు, ఎక్కడ?
సాక్షి,ముంబై: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ 10ప్రో భారీ డిస్కౌంట్ ధరకకు లభిస్తోంది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ద్వారా వన్‌ప్లస్ 10ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్న కస్టమర్లు అదనంగా రూ. 5,000 తగ్గింపును కూడా పొందవచ్చు. చదవండి: మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే.. వన్ప్లస్కుసంబంధించి ఏడాది లాంచ్ చేసిన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో. ఇది ప్రస్తుతం రూ.66,999 నుంచి రూ.61,999కి లిస్ట్ అయింది. ఎస్బీఐ ఆఫర్ద్వారా రూ.56,999 సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 22,000 వరకు ఉంటుంది. అలాగే షరతుల మేరకు కనీసం 4,000 తగ్గింపు లభిస్తుంది. అంటే సుమారు 52 వేలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తొమ్మిది రోజుల్లో ముగుస్తుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్, ది వైర్లెస్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాంటివి ప్రధాన ఫీచర్లు. (TVS Jupiter Classic Edition: టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే) వన్‌ప్లస్ 10 ప్రో ఫీచర్లు 6.70 అంగుళాల (1440x3216) డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 32ఎంపీ సెల్ఫీ కెమెరా 8జీబీ,12 జీబీ ర్యామ్ 128, 256, 512, జీబీ మొమరీవేరియంట్స్ 5000mAhబ్యాటరీ కెపాసిటీ -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
అమెజాన్ ప్రైమ్ డే సేల్ : బిగ్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను లాంచ్ చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ప్రత్యకంగా అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ జులై 16 మధ్యాహ్నం నుండి జులై 18 అర్థరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 200లకు పైగా కొత్త ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. వన్‌ప్లస్, బాష్ ఇంటల్, హెచ్‌పీ, తదితర ఉత్పత్తులను డిస్కౌంట్ ధరల్లో ఆఫర్ చేయనుంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఇకో స్పీకర్లుతదితరాలపై వేలకొద్దీ ఆఫర్లను సిద్ధం చేసింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఇతర యాక్ససరీస్ 40శాతం దాకా డిస్కౌంట్.. స్మార్టఫోన్ విభాగంలో శాంసంగ్, షావోమి, మోటో, హానర్, రియలల్మీ , హువాయ్, ఆపిల్, నోకియా, టెనోర్, ఎల్జీ వివో బ్రాండ్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ద్వారా 3వేల దాకా క్యాష్ బ్యాక్ కూడా లభ్యం. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ పే వినియోగదారులకు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇంకా, ప్రైమ్ డే సమయంలో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌ను ప్రత్యేకంగా ప్రారంభించనుంది. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, గుజరాతీ, రాజస్థానీ, బెంగాలీ సహా మరో రెండు కొత్త భాషలు అస్సామీ & ఒడియ లాంటి భారతీయ భాషలలో ప్రత్యేకంగా ప్లే జాబితాలు ప్రారంభించనుంది. అయితే ప్రతి ఏడాదిలా 24 గంటలు సేల్ కాకుండా ఈ సారి 36 గంటలు పాటు ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహించడం విశేషం. 'అల్ట్రా-ఫాస్ట్ 2-గంటల డెలివరీ' కూడా అని అమెజాన్ ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. భారీ ఆఫర్లు
దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సమ్మర్లో మెగా సేల్స్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను అలరించేందుకు మే 13 నుంచి 16 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ల్యాప్టాపులు, కెమెరా, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 80 శాతం డిస్కౌంట్ అందించడం ద్వారా జోరుగా అమ్మకాలు జరపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సెలెక్టెడ్ మొబైల్ ఫోన్లను అతి తక్కువగా ధరకే అందించనుంది. దీని ద్వారా బిగ్ షాపింగ్ డేస్ సేల్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే మొబైల్ అమ్మకాలను ఆరు రెట్లు పెంచుకోవాలని ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది. అమ్మకాలు పెంచుకోవడం కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఆఫర్ ప్రకటించనుంది. క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్ఐ, బైబ్యాక్ గ్యారంటీ, కొన్ని వస్తువులపై ఎక్స్స్టెండెడ్ వారంటీ కూడా అందించనుంది. అంతేకాకుండా 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందేందుకు వీలుగా కస్టమర్లకు గేమ్స్ నిర్వహించనుంది. గేమ్‌లో గెలిస్తే కేవలం ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్, మొబైల్ గెలుచుకునే అవకాశం కల్పించనుంది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల కోసం సరికొత్త మొబైల్ బ్రాండ్లను బిగ్ షాపింగ్ డేస్‌లో భాగంగా లాంచ్ చేయనుంది. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మెగా సమ్మర్ సేల్స్
కోల్కత్తా : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు ఈ సమ్మర్లో మెగా సేల్స్‌తో మన ముందుకు రాబోతున్నాయి. వచ్చే నెలలో మెగా సమ్మర్ సేల్స్‌ను ఇవి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఇవి అలరించబోతున్నాయని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, అప్పీరెల్, హోమ్ డెకర్, రోజువారీ వస్తువులపై ఈ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ డిస్కౌంట్లో అప్పీరెల్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై 70 శాతం నుంచి 80 శాతం వరకు, స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ఫాస్ట్-మూవింగ్ కేటగిరీ వస్తువులపై అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఆన్లైన్ విక్రయాల్లో ఇవి 60 శాతానికి పైగా ఉన్నాయి. క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో అదనపు ప్రయోజనాలను కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అందించనున్నాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి వచ్చే నెలలో ఈ సేల్ నిర్వహించనున్నట్టు ధృవీకరించారు. కానీ తేదీలను బహిర్గతం చేయడానికి నిరాకరించారు.‘ఇది చాలా పెద్ద సేల్. తమ బిగ్ బిలియన్ డేస్ సేల్కు చిన్న వెర్షన్. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్ చేశాం. టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర కేటగిరి ఉత్పత్తులు మాకు బిగ్ లైనప్. బ్యాంకులు కూడా ఈ సేల్‌లో ఆఫర్లను ప్రకటించనున్నాయి’ అని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ కూడా మే నెలలో ఒకే తేదీల్లో ఈ సేల్స్‌ను నిర్వహించనున్నాయని ఎక్స్క్లూజివ్లేన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ గోయల్ చెప్పారు. రెండు కంపెనీలకు ఈ సేల్స్ ఎంతో ముఖ్యమైనవని, తర్వాతి సేల్ సీజన్ దివాలీ సమయంలో ప్రారంభం కావొచ్చని పేర్కొన్నారు. అయితే మే 11 నుంచి 14వ తేదీల వరకు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను నిర్వహించనుందని కొందరు సెల్లర్స్ చెబుతున్నారు. అదే తేదీల్లో లేదా కాస్త ముందుగా అమెజాన్ కూడా ఈ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంటున్నారు. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్12న ఆపిల్ మెగా ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఈ మెగా ఈవెంట్లో ఐఫోన్ 8 ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ కాబోతుంది. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లను ఆపిల్ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్ల రాక సందర్భంగా పాత ఐఫోన్లపై పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 తో పాటు మిగతా మోడల్స్‌పై పేటీఎం మాల్ ఈ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. ముందస్తు ఎన్నడూ చూడని ధరలో ఐఫోన్7 విక్రయానికి వచ్చింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాల వ్యవధిలోనే అందుబాటులో ఉండనున్నాయని పేటీఎం మాల్ చెప్పింది. ఐఫోన్ 7 ఆఫర్... ఆపిల్ గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్ 7ను అతి తక్కువగా డిస్కౌంట్ ధరలో రూ.39,479కే విక్రయించుతోంది. దాంతో పాటు 65,200 రూపాయల ధర కలిగిన ఐఫోన్ 7 128జీబీ వేరియంట్‌పై కూడా 8 శాతం డిస్కౌంట్, రూ.12వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ ప్రకటించింది. ఇక ఐఫోన్ 7 32జీబీ రోజ్ గోల్డ్ వేరియంట్‌ను కూడా 13 శాతం డిస్కౌంట్, 9,100 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో 39,599 రూపాయలకే పేటీఎం మాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ అసలు ధర రూ.56,200. ఐఫోన్ 7 256జీబీ రోజ్ గోల్డ్ వేరియంట్‌పై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర 80వేల రూపాయలుంటే, దీనిపై 24 శాతం డిస్కౌంట్, 10,500 క్యాష్‌బ్యాక్‌తో 60,898 రూపాయలకే అందిస్తోంది. ఐఫోన్ 7 256జీబీ బ్లాక్ వేరియంట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.62,099కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 6 ఆఫర్.... ఐఫోన్ 6ను 21,685 రూపాయలకు పేటీఎం మాల్ అందిస్తోంది. ఈ ఫోన్ ఇప్పటికే డిస్కౌంట్ ధర 27,685 రూపాయలకు అందుబాటులో ఉండగా.. దీనిపై 6000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ధర రూ.21,685కు దిగొచ్చింది. ఐఫోన్ 7 ప్లస్... ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ-గోల్డ్ వేరియంట్ అసలు ధర 72వేల రూపాయలుండగా.. డిస్కౌంట్ అనంతరం 51,399 రూపాయలకే ఈ ఫోన్ విక్రయానికి వచ్చింది. ఇదే వేరియంట్ సిల్వర్ కలర్ ఫోన్ కూడా 51,370 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ(గోల్డ్) వేరియంట్‌ను పేటీఎం మాల్ 57,599 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ మోడల్ అసలు ధర 82వేల రూపాయలు. ఐఫోన్ 6ఎస్ ప్లస్... ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా డిస్కౌంట్ ధరలో 37,299 రూపాయలకు పేటీఎం మాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అసలు ధర 72వేల రూపాయలు. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబీ(గోల్డ్) వేరియంట్ కూడా 38,299 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్ అసలు ధర కూడా 72వేల రూపాయలు. ఇలా ఐఫోన్ వేరియంట్లపై పేటీఎం మాల్ డిస్కౌంట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చేసింది.