దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సమ్మర్‌లో మెగా సేల్స్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను అలరించేందుకు మే 13 నుంచి 16 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ల్యాప్‌టాపులు, కెమెరా, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 80 శాతం డిస్కౌంట్ అందించడం ద్వారా జోరుగా అమ్మకాలు జరపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సెలెక్టెడ్ మొబైల్ ఫోన్లను అతి తక్కువగా ధరకే అందించనుంది. దీని ద్వారా బిగ్ షాపింగ్ డేస్ సేల్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే మొబైల్ అమ్మకాలను ఆరు రెట్లు పెంచుకోవాలని ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది.
అమ్మకాలు పెంచుకోవడం కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఆఫర్ ప్రకటించనుంది. క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్‌ఐ, బైబ్యాక్ గ్యారంటీ, కొన్ని వస్తువులపై ఎక్స్స్టెండెడ్ వారంటీ కూడా అందించనుంది. అంతేకాకుండా 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందేందుకు వీలుగా కస్టమర్లకు గేమ్స్ నిర్వహించనుంది. గేమ్‌లో గెలిస్తే కేవలం ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్, మొబైల్ గెలుచుకునే అవకాశం కల్పించనుంది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల కోసం సరికొత్త మొబైల్ బ్రాండ్లను బిగ్ షాపింగ్ డేస్‌లో భాగంగా లాంచ్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment