Summer Sale
-
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్‌ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్..
అమెజాన్ భారత్‌లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించిన టీజర్‌ను అమెజాన్ విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్లో పేర్కొంది. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్‌పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్మీ (Redmi 12C) ఫోన్‌ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999. సరికొత్త స్మార్ట్ఫోన్లు, వాటి యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్‌లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలపై.. టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో కస్టమర్లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ వై సిరీస్ హెచ్డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు.. -
Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు 'హలో సమ్మర్ డేస్ సేల్' (Hello Summer Days) పేరుతో సేల్స్ ప్రారంభించింది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మార్చి 22 నుంచి మొదలై 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన 'హలో సమ్మర్ డేస్ సేల్'లో ఎయిర్ కండీషనర్ కొనుగోలుపై 55 శాతం, రిఫ్రిజిరేటర్ల మీద 60 శాతం డిస్కౌంట్స్ పొందవచ్చు. అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా ఇతర బ్యాంకు కార్డులపై 'నో కాస్ట్ ఈఎమ్ఐ' సదుపాయం పొందవచ్చు. కావున సామ్సంగ్, వోల్టాస్, ఎల్జీ, వాల్పూల్, హయెర్, గోద్రెజ్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్లను సాధారణ ధరల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీ బ్రాండ్ కొనుగోలుపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు వినియోగించుకుని మరింత తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్) కంపెనీ అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ కింద సామ్సంగ్ 1.5 టన్ కన్వర్టబుల్ 5-ఇన్-1 3-స్టార్ ఏసీ కేవలం రూ. 37,999కే కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ప్యానసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ వైఫై కనెక్ట్ ఏసీ, ఎల్జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 3 స్టార్ ఏసీ, లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. -
అందరికీ ఎండాకాలం, మాకిదే మంచి కాలమంటున్న ఆ కంపెనీలు.. ఎందుకంటే?
వేసవి కాలం మొదలైపోయింది.. భానుడి వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాల డిమాండ్ ఎక్కువవుతోంది. కావున అమ్మకాలు మునుపటికంటే దాదాపు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి అండ్ డెయిరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీల అమ్మకాలు మరింత వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచుకోవడానికి తగిన ఆఫర్స్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం. పాలు, పాల పానీయాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌ల విక్రయదారులలో ఒకటైన మదర్ డైరీ ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అంచనా వేస్తూ ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగటానికి తగిన విధంగా సిద్ధమవుతోంది. కోల్డ్-చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫర్ వెహికల్స్, షెల్ఫ్ స్ట్రెంగ్త్ నిర్ధారించడానికి కన్స్యూమర్ టచ్ పాయింట్లలో అసెట్ డిప్లాయ్మెంట్లో పెట్టుబడి పెట్టామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బండ్లీష్ తెలిపారు. మదర్ డెయిరీ ఈ సమ్మర్ సీజన్లో మరో 15 కొత్త ఉత్పత్తులు లేదా రుచులను ప్రారంభించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే సీజన్లో ఐస్‌క్రీం వర్గం దాదాపు 25 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు కూడా బండ్లీష్ చెప్పుకొచ్చారు. శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో వేసవి ప్రారంభంమే చాలా ఉత్సాహంగా ఉందని, 2023 పానీయాల రంగానికి తప్పకుండా కలిసొస్తుందని ఆశాభావాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి మేజర్ డాబర్ ఇండియా తన వేసవి ఉత్పత్తులు తప్పకుండా ఆశాజనకంగా అమ్ముడవుతాయని ప్రకటించింది. -
నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ఆప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలలా ఆప్కో షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. చీరలు, చుడీదార్లు, పెళ్లి బట్టలు చాలా రకాల వెరైటీల్లో దొరుకుతున్నాయన్నారు. మహిళల మనసు దోచే విధంగా ఆప్కోలో చీరలు ఉన్నాయన్నారు. బయట షోరూమ్‌లకు ధీటుగా ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయన్నారు. తాను కూడా చేనేత కుటుంబ కోడలినని మంత్రి రోజా తెలిపారు. నేతన్నలకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు అందిస్తున్నారని అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరిద్దామని ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఆఫర్ల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 4 నుంచి 7 వరకూ నాలుగు రోజులు పాటు సాగే అమెజాన్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్లతో రికార్డ్ సేల్స్ నమోదు చేసేందుకు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం సంసిద్ధమైంది. ప్రైమ్ మెంబర్లకు మే 3న మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్ చేస్తోంది. సమ్మర్ సేల్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకునే కస్టమర్లకు రూ 5 లక్షల విలువైన బహుమతులు ప్రకటించింది. ఇక పలు ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను కస్టమర్ల ముందుంచింది. మరికొన్ని వారాల్లో ఒన్‌ప్లస్ 7, ఒన్‌ప్లస్ 7 ప్రొ లాంఛ్ కానున్న క్రమంలో ఒన్‌ప్లస్ 6టీ మోడల్స్ సేల్స్‌ను త్వరితగతిన పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. గత ఏడాది రూ 37,999తో భారత్‌లో లాంఛ్ అయిన ఒన్‌ప్లస్ 6టీపై అమెజాన్ ఇప్పటికే రూ 3000 డిస్కౌంట్‌ను ప్రకటించగా, సమ్మర్ సేల్‌లో లోయెస్ట్ ప్రైస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో రూ 41,999తో లాంఛ్ చేసిన ప్రోడక్ట్‌ను రూ 32,999కే ఆఫర్ చేస్తోంది. రూ 10,990తో లాంఛ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం 20ను సమ్మర్సేల్లో రూ 9,990కు ఆఫర్ చేస్తోంది. రూ 71,000తో లాంఛ్ అయిన గెలాక్సీ ఎస్10ను సేల్‌లో రూ 61,900కు ఆఫర్ చేస్తోంది. ఇలా పలు మోడళ్లు, ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో సమ్మర్ సేల్‌లో రికార్డు సేల్స్‌పై అమెజాన్ దృష్టిసారించింది. -
ఎయిర్ఏసియా ‘మిడ్ సమ్మర్ సేల్’
ఎయిర్ఏసియా ఇండియా ‘మిడ్ సమ్మర్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1500 కంటే తక్కువకే అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాంచి మార్గాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్సైట్ ఎయిర్ఏసియా.కామ్‌లో వెల్లడించింది. మిడ్-సమ్మర్ సేల్ కింద భువనేశ్వర్-కోల్కత్తా, రాంచి-కోల్కత్తా, కొచ్చి-బెంగళూరు, కోల్కత్తా-భువనేశ్వర్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.1399కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. ఎయిర్‌లైన్ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్ఏసియా ఇండియా ఈ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. మిడ్ సమ్మర్ సేల్ కింద టిక్కెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం www.airasia.com వద్ద ఆన్లైన్ బుకింగ్స్కే అందుబాటులో ఉంది. 2018 మే 13 వరకు ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 2018 అక్టోబర్ 31 వరకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పై ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్ జర్నీకి మాత్రమే. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డు ద్వారా పేమెంట్లను ఎయిర్ఏసియా అంగీకరించనుంది. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. అదేవిధంగా మిడ్ సమ్మర్ సేల్ కింద ఆసియన్, ఆస్ట్రేలియన్ మార్గాల విదేశీ విమానాలకు టిక్కెట్లు రూ.3999కే ప్రారంభమవ్వనున్నట్టు తెలిసింది. ఈ టిక్కెట్లను కూడా 2018 మే 13 వరకే బుక్చేసుకోవాలి. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. భారీ ఆఫర్లు
దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సమ్మర్లో మెగా సేల్స్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను అలరించేందుకు మే 13 నుంచి 16 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ల్యాప్టాపులు, కెమెరా, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 80 శాతం డిస్కౌంట్ అందించడం ద్వారా జోరుగా అమ్మకాలు జరపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సెలెక్టెడ్ మొబైల్ ఫోన్లను అతి తక్కువగా ధరకే అందించనుంది. దీని ద్వారా బిగ్ షాపింగ్ డేస్ సేల్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే మొబైల్ అమ్మకాలను ఆరు రెట్లు పెంచుకోవాలని ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది. అమ్మకాలు పెంచుకోవడం కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఆఫర్ ప్రకటించనుంది. క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్ఐ, బైబ్యాక్ గ్యారంటీ, కొన్ని వస్తువులపై ఎక్స్స్టెండెడ్ వారంటీ కూడా అందించనుంది. అంతేకాకుండా 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందేందుకు వీలుగా కస్టమర్లకు గేమ్స్ నిర్వహించనుంది. గేమ్‌లో గెలిస్తే కేవలం ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్, మొబైల్ గెలుచుకునే అవకాశం కల్పించనుంది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల కోసం సరికొత్త మొబైల్ బ్రాండ్లను బిగ్ షాపింగ్ డేస్‌లో భాగంగా లాంచ్ చేయనుంది. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మెగా సమ్మర్ సేల్స్
కోల్కత్తా : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు ఈ సమ్మర్లో మెగా సేల్స్‌తో మన ముందుకు రాబోతున్నాయి. వచ్చే నెలలో మెగా సమ్మర్ సేల్స్‌ను ఇవి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఇవి అలరించబోతున్నాయని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, అప్పీరెల్, హోమ్ డెకర్, రోజువారీ వస్తువులపై ఈ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ డిస్కౌంట్లో అప్పీరెల్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై 70 శాతం నుంచి 80 శాతం వరకు, స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ఫాస్ట్-మూవింగ్ కేటగిరీ వస్తువులపై అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఆన్లైన్ విక్రయాల్లో ఇవి 60 శాతానికి పైగా ఉన్నాయి. క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో అదనపు ప్రయోజనాలను కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అందించనున్నాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి వచ్చే నెలలో ఈ సేల్ నిర్వహించనున్నట్టు ధృవీకరించారు. కానీ తేదీలను బహిర్గతం చేయడానికి నిరాకరించారు.‘ఇది చాలా పెద్ద సేల్. తమ బిగ్ బిలియన్ డేస్ సేల్కు చిన్న వెర్షన్. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్ చేశాం. టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర కేటగిరి ఉత్పత్తులు మాకు బిగ్ లైనప్. బ్యాంకులు కూడా ఈ సేల్‌లో ఆఫర్లను ప్రకటించనున్నాయి’ అని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ కూడా మే నెలలో ఒకే తేదీల్లో ఈ సేల్స్‌ను నిర్వహించనున్నాయని ఎక్స్క్లూజివ్లేన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ గోయల్ చెప్పారు. రెండు కంపెనీలకు ఈ సేల్స్ ఎంతో ముఖ్యమైనవని, తర్వాతి సేల్ సీజన్ దివాలీ సమయంలో ప్రారంభం కావొచ్చని పేర్కొన్నారు. అయితే మే 11 నుంచి 14వ తేదీల వరకు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను నిర్వహించనుందని కొందరు సెల్లర్స్ చెబుతున్నారు. అదే తేదీల్లో లేదా కాస్త ముందుగా అమెజాన్ కూడా ఈ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంటున్నారు. -
డిస్కౌంట్ ఆఫర్స్: ఫ్లిప్ కార్ట్ మరో 'సమ్మర్ సేల్'
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ గత రెండు వారాల క్రితమే 10ఏళ్ల సందర్భంగా నాలుగు రోజుల 'బిగ్ 10 సేల్' నిర్వహించిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది. ప్రస్తుతం మరో సమ్మర్ సేల్ తో మన ముందుకు వచ్చేసింది. నేటి నుంచి ఈ నెల చివరి వరకు 80శాతం డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఎలాంటి ఖర్చులేని ఈఎంఐలతో సమ్మర్ సేల్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హోమ్ అప్లియెన్స్, స్మార్ట్ ఫోన్లపై ఈ కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఫ్లాట్ పై 10వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. జియోర్డోనో వాచ్ లు, మహిళల ప్రీమియం బ్యాగులపై కనీసం 75 శాతం వరకు తగ్గింపును ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 2 పై 14 శాతం తగ్గింపు, 40 అంగుళాల సోని టెలివిజన్ పై 20 శాతం తగ్గింపు, ఫిట్ నెస్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఫోటో గ్రఫీ ఇష్టపడే వారి కోసం నికోన్ డీఎస్ఎల్ఆర్ కెమెరాను 20 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. మహిళా వినియోగదారుల ఆకట్టుకోవడం కోసం ఫ్యాషన్, అపీరల్స్ పై కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం ఫోన్ పేతో లావాదేవీలు జరిపిన వారికి తమ ఫ్లాట్ ఫామ్ పై 25 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు తెలిసింది. ఫోన్ పే అనేది ఫ్లిప్ కార్ట్ కు చెందిన పేమెంట్ సిస్టమ్. ఈ నెల మొదట్లో నిర్వహించిన బిగ్ 10సేల్ తో ఫోన్ పే లావాదేవీలు 30 శాతం పెరిగాయి. సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వాడిన కస్టమర్లకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ నెల మొదట్లోనే ఫ్లిప్ కార్ట్ కంటే కొంచెం ముందుగా ప్రత్యర్థి అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహించింది. -
జెట్ ఎయిర్ వేస్ సమ్మర్ కూల్ ఆఫర్
ముంబై: విమానయాన సంస్థలు సమ్మర్ లో కూల్ ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఇండిగో దేశీయ రూట్లలో తగ్గింపు విమాన టికెట్లను ఆఫర్ చేయగా మరో ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ కూడా డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. సమ్మర్ బ్రేక్స్ పేరుతో తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. దేశీయ రూట్లలో తమ ప్రయాణికులకు సమ్మర్ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా జెట్ ఎయిర్ వేస్ ఈ ఆఫర్ వివరాలను షేర్ చేసింది. ఎకానమిక్ క్లాస్ టికెట్లలో రూ. 1,294 నుంచి మొదలయ్యే ధరలను అందుబాటలోకి తెచ్చింది. ఈ ఆఫర్ కింద 20 రోజుల ముందు టికెట్లను బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 7-9 తేదీల మధ్యఈ టికెట్లను బుక్ చేసుకోవాలని జెట్ ఎయిర్వేస్ ట్విట్టర్‌ద్వారా తెలిపింది. అలాగే స్పెషల్ఆఫర్ లో ఎకానమిక్ క్లాస్ టికెట్లను ప్రీమియం క్లాస్ గా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ లో ఎన్ని సీట్లుఅందుబాటులోఉండనున్నదీ స్పష్టం చేయలేదు. Your summer vacation starts right here! Get COOL fares & a chance2 WIN a complimentary upgrade to Première Book now https://t.co/opErm6XWsO pic.twitter.com/IWDCxrsE71 — Jet Airways (@jetairways) April 7, 2017