డిస్కౌంట్ ఆఫర్స్: ఫ్లిప్ కార్ట్ మరో 'సమ్మర్ సేల్'
డిస్కౌంట్ ఆఫర్స్: ఫ్లిప్ కార్ట్ మరో 'సమ్మర్ సేల్'
Published Mon, May 29 2017 3:13 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ గత రెండు వారాల క్రితమే 10ఏళ్ల సందర్భంగా నాలుగు రోజుల 'బిగ్ 10 సేల్' నిర్వహించిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది. ప్రస్తుతం మరో సమ్మర్ సేల్ తో మన ముందుకు వచ్చేసింది. నేటి నుంచి ఈ నెల చివరి వరకు 80శాతం డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఎలాంటి ఖర్చులేని ఈఎంఐలతో సమ్మర్ సేల్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హోమ్ అప్లియెన్స్, స్మార్ట్ ఫోన్లపై ఈ కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఫ్లాట్ పై 10వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. జియోర్డోనో వాచ్ లు, మహిళల ప్రీమియం బ్యాగులపై కనీసం 75 శాతం వరకు తగ్గింపును ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 2 పై 14 శాతం తగ్గింపు, 40 అంగుళాల సోని టెలివిజన్ పై 20 శాతం తగ్గింపు, ఫిట్ నెస్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచింది.
అదేవిధంగా ఫోటో గ్రఫీ ఇష్టపడే వారి కోసం నికోన్ డీఎస్ఎల్ఆర్ కెమెరాను 20 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. మహిళా వినియోగదారుల ఆకట్టుకోవడం కోసం ఫ్యాషన్, అపీరల్స్ పై కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం ఫోన్ పేతో లావాదేవీలు జరిపిన వారికి తమ ఫ్లాట్ ఫామ్ పై 25 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు తెలిసింది. ఫోన్ పే అనేది ఫ్లిప్ కార్ట్ కు చెందిన పేమెంట్ సిస్టమ్. ఈ నెల మొదట్లో నిర్వహించిన బిగ్ 10సేల్ తో ఫోన్ పే లావాదేవీలు 30 శాతం పెరిగాయి. సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వాడిన కస్టమర్లకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ నెల మొదట్లోనే ఫ్లిప్ కార్ట్ కంటే కొంచెం ముందుగా ప్రత్యర్థి అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహించింది.
Advertisement
Advertisement