అమెజాన్‌కు షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల వర్షం | Sales galore: Flipkart takes on Amazon India, offers discounts upto 80% | Sakshi
Sakshi News home page

అమెజాన్‌కు షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల వర్షం

Published Wed, Jul 12 2017 1:54 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

అమెజాన్‌కు షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల వర్షం - Sakshi

అమెజాన్‌కు షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల వర్షం

ముంబై:  పండుగ సీజన్‌  ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ కామర్స్‌ సంస్థల ఆఫర్ల వర్షం కురుస్తోంది.  తాజాగా మరో ఈ రీటైలర్‌ దిగ్గజం​ ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యర్థి అమెజాన్‌కు పోటీగా   80శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.ముఖ్యంగా కిచెన్‌ అప్లయెన్సెస్‌, ఫూట్‌వేర్‌, షియామి, శాంసంగ్‌ , సోనీ, ఇతర ఎలక్ట్రానిక్స్  ఉత్పత్తులతోపాటు ఆదిదాస్, ప్యూమా, లివైస్‌, ఫాసిల్, హైడ్ సైన్ తదితర బ్రాండ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది.   

ప్రైమ్ డే సేల్ తో అమెజాన్  ఇండియా ప్రైమ్ సభ్యులను ఆకట్టుకోగా ఇపుడు  ఫ్లిప్ కార్టు కూడా ప్రైమ్‌ సభ్యుల కోసం స్పెషల్‌  అమ్మకాలను ప్రారంభించింది. ఎక్స్క్యూజివ్ గా స్మార్ట్ ఫోన్ల విడుదలతో పాటు వస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ఉత్పత్తులపై  ఆఫర్లను వెల్లడించింది.  ముఖ్యంగా ఫియామి నోట్‌ 4  రూ 9,999కు, గోల్డ్, బ్లాక్,  డార్క్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

గెలాక్సీ ఆన్ 5పై రూ. 2వేలు తగ్గించింది.  గెలాక్సీ ఆన్ 7 లో రూ. 500 డిస్కౌంట్‌ అందిస్తోంది. ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై, 35 శాతం, మహిళల దుస్తులు, పాదరక్షలు ,  లోదుస్తులపై 70 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది.
టీవీల  కొనుగోళ్లపై జీరో ఈఎంఐ  ఆప్లన్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది.  మైక్రోమ్యాక్స్ 50 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీటీవీలపై దాదాపు 50 శాతం తగ్గింపు, ఫాజిల్‌ వాచెస్‌పై 30 శాతం డిస్కౌంట్‌.
అంతేకాదు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా  అందించనుంది. అలాగే ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశాన్ని గెలుచుకోవచ్చని  ప్లిప్‌కార్ట్‌ తెలిపింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement