ఎయిర్‌ఏసియా ‘మిడ్‌ సమ్మర్‌ సేల్‌’ | AirAsia India Announces Mid Summer Sale | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏసియా ‘మిడ్‌ సమ్మర్‌ సేల్‌’

May 7 2018 12:32 PM | Updated on Oct 2 2018 7:37 PM

AirAsia India Announces Mid Summer Sale - Sakshi

ఎయిర్‌ఏసియా ఇండియా ‘మిడ్‌ సమ్మర్‌ సేల్‌’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1500 కంటే తక్కువకే అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, రాంచి మార్గాలకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్‌సైట్‌ ఎయిర్‌ఏసియా.కామ్‌లో వెల్లడించింది. మిడ్‌-సమ్మర్‌ సేల్‌ కింద భువనేశ్వర్‌-కోల్‌కత్తా, రాంచి-కోల్‌కత్తా, కొచ్చి-బెంగళూరు, కోల్‌కత్తా-భువనేశ్వర్‌, హైదరాబాద్‌-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.1399కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్‌ఏసియా ఇండియా తెలిపింది. ఎయిర్‌లైన్‌ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్‌ఏసియా ఇండియా ఈ సమ్మర్‌ సేల్‌ను ప్రారంభించింది. 

మిడ్‌ సమ్మర్‌ సేల్‌ కింద టిక్కెట్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం www.airasia.com వద్ద ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కే అందుబాటులో ఉంది. 2018 మే 13 వరకు ఈ సేల్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. 2018 అక్టోబర్‌ 31 వరకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పై ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్‌ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్‌ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్‌ జర్నీకి మాత్రమే. క్రెడిట్‌, డెబిట్‌, ఛార్జ్‌ కార్డు ద్వారా పేమెంట్లను ఎయిర్‌ఏసియా అంగీకరించనుంది. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్‌ఏసియా ఇండియా తెలిపింది. అదేవిధంగా మిడ్‌ సమ్మర్‌ సేల్‌ కింద ఆసియన్‌, ఆస్ట్రేలియన్‌ మార్గాల విదేశీ విమానాలకు టిక్కెట్లు రూ.3999కే ప్రారంభమవ్వనున్నట్టు తెలిసింది. ఈ టిక్కెట్లను కూడా 2018 మే 13 వరకే బుక్‌చేసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement