రూ.999కే ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ టిక్కెట్‌ | International Flight Tickets Available Under Rs 1000 | Sakshi
Sakshi News home page

రూ.999కే ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ టిక్కెట్‌

Published Tue, Mar 6 2018 11:26 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

International Flight Tickets Available Under Rs 1000 - Sakshi

ముంబై : ఎయిర్‌ఏషియా అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ''బిగ్‌ సేల్‌'' ఆఫర్‌ కింద ఎంపిక చేసిన మార్గాలలో రూ.999కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు ఎయిర్‌ఏసియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ కింద ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ టిక్కెట్లు 2018 మార్చి 11 వరకు అందించనున్నామని ఈ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ట్రావెల్‌ పిరియడ్‌  2018 సెప్టెంబర్‌ 3 నుంచి ప్రారంభమై, 2019 మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్‌ఏషియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్ల ధరలు రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి.

''బిగ్‌ సేల్‌కు ఇది సరియైన సమయం. బీట్‌దిబడ్జెట్‌పై తమ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ రూ.999 నుంచి ప్రారంభమవుతుంది'' అని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. భువనేశ్వర్‌ నుంచి కౌలాలంపూర్‌ వరకు వన్‌-వే విమానాలకు రూ.999కి విమాన టిక్కెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. బిగ్‌ సేల్‌ కింద ఇతర రూట్లు కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్‌ ధర రూ.2,999కు, చెన్నై నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్‌ ధర రూ.3,399కు, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్‌ ధర రూ.1,399కు, జైపూర్‌ నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్‌ ధర రూ.3,690కు ఎయిర్‌ఏషియా ఆఫర్‌ చేస్తోంది. 

  • www.airasia.comలో ఆన్‌లైన్‌గా మాత్రమే ఈ డిస్కౌంట్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రెడిట్‌, డెబిట్‌, ఛార్జ్‌ కార్డుల ద్వారా జరిపే పేమెంట్లకు నాన్‌-రిఫండబుల్‌ ప్రాసెసింగ్‌ ఫీజు వర్తిస్తోంది.
  • పరిమిత సంఖ్యలో సీట్లు, అన్ని విమానాలకు ఇది వర్తించదు
  • వన్‌-వే జర్నీకే ఈ ఆఫర్‌ అందుబాటు
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement