ఎయిర్‌ ఏసియా ‘బిగ్‌ సేల్‌’ చెక్‌ చేశారా? | AirAsia India Offers Tickets From Rs. 899 Under Big Sale | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఏసియా ‘బిగ్‌ సేల్‌’ చెక్‌ చేశారా?

Published Thu, Mar 16 2017 3:07 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

ఎయిర్‌ ఏసియా ‘బిగ్‌ సేల్‌’ చెక్‌ చేశారా?

ఎయిర్‌ ఏసియా ‘బిగ్‌ సేల్‌’ చెక్‌ చేశారా?

న్యూఢిల్లీ:  దేశీయ విమాన యాన సంస్థ ఎయిర్‌ ఆసియా  ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  ఇప్పటికే  తగ్గింపు ధరల్లో దేశీయ, అంతర్జాతీయంగా  టికెట్లను ఆఫర్‌ చేసిన సంస్థ గురువారం మరో తగ్గింపు ధరలను వెల్లడించింది. ‘బిగ్‌ సేల్‌’ పథకం కింద అన్ని ఖర్చులుక లుపుకొని రూ. 899నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది.  

దేశీయ రూట్లలో  ఈరేట్లను అమలు చేయనుంది. మార్చి 19 లోపు  బుక్‌ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్‌ 1, 2017 నుంచి జూన్‌ 5, 2018 మధ్య ప్రయాణించే వెలుసులు బాటు కల్పించింది. ఎయిర్‌ ఏసియా వెబ్‌సైట్‌ ప్రకారం  బెంగళూరు-​హైదరాబాద్‌ మధ్య అతి తక్కువ ధర రూ. 899గా ఉండనుంది.  బెంగళూరు, కొచీ, గోవా, పూనే, న్యూ ఢిల్లీ, గౌహతి వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి.
 తక్కువ ధరల్లో హైదరాబాద్‌ నుంచి గోవా ఎగిరిపొమ్మని...సర్ఫింగ్‌,  డైవింగ్‌, స్నోర్కలింగ్‌ను ఎంజాయ్‌ చేయమంటూ  ట్విట్టర్‌ ద్వారా ఒక  ప్రకటన జారీ చేసింది.  మరిన్ని వివరాలకోసం  సంస్థ  అధికారిక వెబ్‌సైట్ ‌http://www.airasia.com  ను సందర్శించగలరు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement