Offers Tickets
-
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్!
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 'రైట్ టూ ఫ్లై' పేరుతో గో ఫస్ట్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం చేసింది. రౌండ్ ట్రిప్పుల కోసం ఈ ఆఫర్‌ని వీనియోగించుకోలేరు, ఇతర ఆఫర్లతో క్లబ్ చేయలేరు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి. జనవరి 22 నుంచి 27 జనవరి 2022 మధ్య కాలంలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. క్యాన్సిలేషన్ ఫీజు: ప్రామాణిక నియమనిబంధనల ప్రకారం. ఈ ఆఫర్ ప్రత్యక్ష దేశీయ విమానాలలో మాత్రమే వర్తిస్తుంది. బ్లాక్ అవుట్ తేదీలు వర్తిస్తాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విమానయాన రంగం ఒకటిగా ఉండగా, గో ఎయిర్ డిసెంబర్ 2021 నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర అన్ని ఛానెల్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ ఆఫర్‌ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. Sale-brations in the air with #RightToFlySALE offer!🛩️🇮🇳 Book flights with GO FIRST at fares starting at just ₹926* on bookings before 27th January, 2022. Know more - https://t.co/EABrFEhAsb pic.twitter.com/ZdWhHNQGt4 — . (@GoFirstairways) January 23, 2022 (చదవండి: Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం) -
ఎయిర్ ఏసియా ‘బిగ్ సేల్’ చెక్ చేశారా?
న్యూఢిల్లీ: దేశీయ విమాన యాన సంస్థ ఎయిర్ ఆసియా ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే తగ్గింపు ధరల్లో దేశీయ, అంతర్జాతీయంగా టికెట్లను ఆఫర్ చేసిన సంస్థ గురువారం మరో తగ్గింపు ధరలను వెల్లడించింది. ‘బిగ్ సేల్’ పథకం కింద అన్ని ఖర్చులుక లుపుకొని రూ. 899నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. దేశీయ రూట్లలో ఈరేట్లను అమలు చేయనుంది. మార్చి 19 లోపు బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1, 2017 నుంచి జూన్ 5, 2018 మధ్య ప్రయాణించే వెలుసులు బాటు కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ ప్రకారం బెంగళూరు-హైదరాబాద్ మధ్య అతి తక్కువ ధర రూ. 899గా ఉండనుంది. బెంగళూరు, కొచీ, గోవా, పూనే, న్యూ ఢిల్లీ, గౌహతి వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి. తక్కువ ధరల్లో హైదరాబాద్ నుంచి గోవా ఎగిరిపొమ్మని...సర్ఫింగ్, డైవింగ్, స్నోర్కలింగ్ను ఎంజాయ్ చేయమంటూ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. మరిన్ని వివరాలకోసం సంస్థ అధికారిక వెబ్సైట్ http://www.airasia.com ను సందర్శించగలరు. Enjoy surfing, diving, and snorkeling at the beaches of #Goa! Fly from #Hyderabad with the Big Sale for low fares on https://t.co/2XVP2iSTNR pic.twitter.com/ykXBBGJf3V — AirAsia India (@airasiain) March 16, 2017