గో ఫస్ట్ ఎయిర్ లైన్స్​ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్​! | Go First Offers Flight Tickets From RS 926 in Special Sale | Sakshi
Sakshi News home page

గో ఫస్ట్ ఎయిర్ లైన్స్​ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్​!

Published Tue, Jan 25 2022 4:50 PM | Last Updated on Tue, Jan 25 2022 6:01 PM

Go First Offers Flight Tickets From RS 926 in Special Sale - Sakshi

ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమాన ప్రయాణికులకు​ సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. రిపబ్లిక్​ డే సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 'రైట్​ టూ ఫ్లై' పేరుతో గో ఫస్ట్ ఈ ఆఫర్​ను తీసుకొచ్చింది​. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం చేసింది. రౌండ్ ట్రిప్పుల కోసం ఈ ఆఫర్‌ని వీనియోగించుకోలేరు, ఇతర ఆఫర్‌లతో క్లబ్ చేయలేరు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి. 

  • జనవరి 22 నుంచి 27 జనవరి 2022 మధ్య కాలంలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది.
  • ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 
  • ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు.
  • క్యాన్సిలేషన్ ఫీజు: ప్రామాణిక నియమనిబంధనల ప్రకారం.
  • ఈ ఆఫర్ ప్రత్యక్ష దేశీయ విమానాలలో మాత్రమే వర్తిస్తుంది.
  • బ్లాక్ అవుట్ తేదీలు వర్తిస్తాయి.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విమానయాన రంగం ఒకటిగా ఉండగా, గో ఎయిర్ డిసెంబర్ 2021 నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అధికారిక వెబ్​సైట్​తో పాటు ఇతర అన్ని ఛానెల్స్​ ద్వారా బుక్​ చేసుకున్నా ఈ ఆఫర్​ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది.

(చదవండి: Google: టీనేజర్ల బ్రౌజింగ్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement