Airlines company
-
సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇంధనం లేని కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇంధనం పరిమితంగా ఉండటం వల్ల విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విమాన సర్వీసులను రీషెడ్యూల్ కూడా చేశామని పీఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 13 దేశీ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే 12 విమానాలను షెడ్యూల్ మార్చామని అన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని కోరారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశామని, మరోకొన్ని ఆలస్యం కానున్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ చమురు సంస్థ (PSO) పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. మరోవైపు రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో పీఐఏను ప్రైవేట్ పరం చేసేందుకూ ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు రోజూ వారి ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల పాయం అందించాలని పీఐఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. PSO నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెంట్లు మాత్రమే అని పీఎస్ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పీఐఏ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోగా.. ప్రజలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదీ చదవండి: దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్ -
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్!
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 'రైట్ టూ ఫ్లై' పేరుతో గో ఫస్ట్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం చేసింది. రౌండ్ ట్రిప్పుల కోసం ఈ ఆఫర్‌ని వీనియోగించుకోలేరు, ఇతర ఆఫర్లతో క్లబ్ చేయలేరు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి. జనవరి 22 నుంచి 27 జనవరి 2022 మధ్య కాలంలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. క్యాన్సిలేషన్ ఫీజు: ప్రామాణిక నియమనిబంధనల ప్రకారం. ఈ ఆఫర్ ప్రత్యక్ష దేశీయ విమానాలలో మాత్రమే వర్తిస్తుంది. బ్లాక్ అవుట్ తేదీలు వర్తిస్తాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విమానయాన రంగం ఒకటిగా ఉండగా, గో ఎయిర్ డిసెంబర్ 2021 నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర అన్ని ఛానెల్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ ఆఫర్‌ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. Sale-brations in the air with #RightToFlySALE offer!🛩️🇮🇳 Book flights with GO FIRST at fares starting at just ₹926* on bookings before 27th January, 2022. Know more - https://t.co/EABrFEhAsb pic.twitter.com/ZdWhHNQGt4 — . (@GoFirstairways) January 23, 2022 (చదవండి: Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం) -
Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
భారత బిలియనీర్ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్‌ఝున్‌వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు నేడు(నవంబర్ 16) ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే మాట్లాడుతూ కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. "ఈ కొత్త 737 మ్యాక్స్ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే మా లక్ష్యానికి మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి అని దుబే అన్నారు. ఆకాశ ఎయిర్ ప్రధాన ఉద్దేశ్యం భారతదేశం ఎదుగుదలకు శక్తిని అందించడంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని దుబే తెలిపారు. అకాసా ఎయిర్ ఆర్డర్ చేసిన వాటిలో రెండు వేరియెంట్లు ఉన్నాయి. అవి ఒకటి 737-8, రెండవది అధిక సామర్ధ్యం గల 737-8-200. బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే సృజనాత్మక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన ప్రాంతాలలో తక్కువ ధరకు సేవలను అందించడానికి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై నమ్మకాన్ని ఉంచిందుకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతుయ్..!) -
Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం. అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్‌షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్‌తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్బుల్(ఝున్‌ఝున్‌వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్‌లో ఎయిర్‌బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు -
పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌక!
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇది పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం. డిసెంబర్‌లోనూ ఓ సారి పెద్ద మొత్తంలో రేట్లకు కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఏటీఎఫ్ ధరలు ఏడాది కాలంలోనే కనిష్ట స్థాయికి చేరాయి. -
ఇండిగో రూ. లక్షన్నర కోట్ల విమానాల ఆర్డరు
250 ఏ-320ల కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ఎయిర్‌బస్‌కి చెందిన ఏ-320 విమానాలను 250 కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 1.55 లక్షల కోట్లు (25.5 బిలియన్ డాలర్లు). ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి. యూరోపియన్ కంపెనీ అయిన ఎయిర్‌బస్‌కి సంఖ్యాపరంగా ఒకే సంస్థ నుంచి ఇంత పెద్ద ఆర్డరు రావడం ఇదే మొదటిసారి. ఆర్డరు విలువను ఎయిర్‌బస్ వెల్లడించనప్పటికీ కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఒక్కో ఏ-320 విమానం ధర 102.8 మిలియన్ డాలర్లు. ఇండిగో 2005లో 100 విమానాలు, 2011లో 180 ఏ-320 నియో విమానాలను ఆర్డరు ఇచ్చింది. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే ఏ-320 నియో విమానాల డెలివరీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇండిగో 180 సీట్లుండే 83 ఏ-320 విమానాలతో సర్వీసులు నడుపుతోంది. అదనంగా విమానాలను సమకూర్చుకోవడం వల్ల మరింత మంది కస్టమర్లు, మార్కెట్లకు చేరువయ్యేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తోడ్పడగలదని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు.