go air
-
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్!
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 'రైట్ టూ ఫ్లై' పేరుతో గో ఫస్ట్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం చేసింది. రౌండ్ ట్రిప్పుల కోసం ఈ ఆఫర్‌ని వీనియోగించుకోలేరు, ఇతర ఆఫర్లతో క్లబ్ చేయలేరు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి. జనవరి 22 నుంచి 27 జనవరి 2022 మధ్య కాలంలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. క్యాన్సిలేషన్ ఫీజు: ప్రామాణిక నియమనిబంధనల ప్రకారం. ఈ ఆఫర్ ప్రత్యక్ష దేశీయ విమానాలలో మాత్రమే వర్తిస్తుంది. బ్లాక్ అవుట్ తేదీలు వర్తిస్తాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విమానయాన రంగం ఒకటిగా ఉండగా, గో ఎయిర్ డిసెంబర్ 2021 నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర అన్ని ఛానెల్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ ఆఫర్‌ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. Sale-brations in the air with #RightToFlySALE offer!🛩️🇮🇳 Book flights with GO FIRST at fares starting at just ₹926* on bookings before 27th January, 2022. Know more - https://t.co/EABrFEhAsb pic.twitter.com/ZdWhHNQGt4 — . (@GoFirstairways) January 23, 2022 (చదవండి: Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం) -
పెండింగ్‌లో గో ఎయిర్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు గత నెలలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినప్పటికీ గో ఎయిర్‌లైన్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇంకా క్లియరెన్స్ లభించలేదు. రూ. 3,600 కోట్ల సమీకరణకు వీలుగా మే నెలలోనే గో ఎయిర్ సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ అప్లికేషన్‌పై నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. ప్రాస్పెక్టస్ దాఖలు సమయంలో గో ఫస్ట్‌గా రీబ్రాండింగ్ చేసుకున్నట్లు గో ఎయిర్‌లైన్స్ (ఇండియా) లిమిటెడ్ ప్రకటించింది. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు దరఖాస్తులో పేర్కొంది. కాగా.. గో ఎయిర్‌లైన్స్ ఆఫర్ డాక్యుమెంట్ల ప్రాసెసింగ్‌పై నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవో ప్రాస్పెక్టస్‌లను ప్రాసెస్ చేసేందుకు కేసులను బట్టి 30, 45, 90 రోజులు లేదా అంతకుమించిన సమయాన్ని తీసుకునేందుకు సెబీకి వీలుంది. గో ఎయిర్ ప్రాస్పెక్టస్‌పై సెబీ ఈ నెల 11న లీడ్ మేనేజర్‌ను వివరణలు కోరింది. అయితే ప్రాస్పెక్టస్‌పై నిర్ణయాన్ని నిలుపుదల చేసిన కారణాలు వెల్లడికావలసి ఉంది. కంపెనీలో వాడియా గ్రూప్‌నకు 73.33 శాతం వాటా ఉంది. 30 రోజుల్లోగా సాధారణంగా సెబీ ఐపీవో దరఖాస్తులపై 30 రోజుల్లోగా నిర్ణయాలు వెల్లడిస్తుంటుంది. అయితే కొన్ని కేసులలో షోకాజ్ నోటీసులు జారీ కాకుంటే పరిశోధన చేపట్టడం లేదా దర్యాప్తు జరుగుతుండటం వంటి అంశాల కారణంగా మరో 30 రోజులపాటు నిర్ణయాన్ని వాయిదా వేస్తుంది. తదుపరి మరో 30 రోజుల్లోగా దర్యాప్తును పూర్తిచేసేందుకు వీలుంటుంది. ఒకవేళ షోకాజ్ నోటీసులను జారీ చేస్తే 90 రోజులపాటు నిర్ణయాన్ని పక్కనపెట్టడంతోపాటు.. మరో 45 రోజులలోగా ప్రొసీడింగ్స్‌ను పూర్తిచేస్తుంది. చదవండి: వాయిస్ బీపీవో హబ్‌గా భారత్.. -
పాపం పాప.. విమానం గాల్లో ఉండగా..
నాగ్‌పూర్ : గో ఏయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించింది. మంగళవారం లక్నో నుంచి ముంబై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్, శేఖర్ ఖత్, సిద్దార్ద్ నగర్‌కు చెందిన ఆయుషి పున్వసి ప్రజాపతి అనే ఏడేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తండ్రి ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గో ఏయిర్ విమానాన్ని ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగా బాలిక కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా విమానాన్ని ఆపి బాలికను నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ( ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను ) పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. విమానం ఎత్తులో ఎగరటం కారణంగానే ఆయుషి కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు అభిప్రాయపడ్డారు. దీనిపై గో ఏయిర్ అధికారులు మాట్లాడుతూ.. ‘‘ పాప రక్తహీనతతో బాధపడుతోంది. తండ్రి ఆ విషయం మాకు చెప్పలేదు. చెప్పుంటే విమానం ఎక్కనిచ్చే వాళ్లం కాదు. 8-10గ్రాముల కంటే తక్కవ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్లు విమానప్రయాణానికి అనర్హులు. ఆ పాపకు కేవలం 2.5 హిమోగ్లోబిన్ మాత్రమే ఉంది. దానికి చికిత్స చేయించుకోవటానికే వారు ముంబై వెళుతున్నారు’’ అని తెలిపారు. -
దివాలా అంచున ఎయిర్‌లైన్స్ ..
ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు గోఎయిర్ వివరించింది. ఈ వ్యవధిలో జీతభత్యాలు ఉండవు. దీంతో పాటు ఉద్యోగుల వేతనాలను క్రమంగా 20 శాతం మేర తగ్గించాలని గోఎయిర్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా అంచున ఎయిర్‌లైన్స్ .. కరోనా వైరస్ కారణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఫ్లైబీ సంస్థ ఇప్పటికే దివాలా తీయగా.. ఈ ఏడాది మే ఆఖరు నాటికి చాలా ఎయిర్‌లైన్స్ మూతపడే ప్రమాదముందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సీఏపీఏ హెచ్చరించింది. పలు విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు 50 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటూ అమెరికాలోని ఎయిర్‌లైన్స్ సంస్థల సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. విమానరంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని పార్లమెంటు ఆమోదించింది. విమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కరోనా వైరస్‌పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు. -
చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : విమానాలు అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్ సిబ్బంది కొరతతో 18 దేశీయ విమానాలను గోఎయిర్ రద్దు చేసింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్ సమస్యలతో ఆ విమానాలు కొన్ని అందుబాటులో లేవని ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలతో పాటు కాక్‌పిట్ సిబ్బంది కొరతతో ముంబై, గోవా, బెంగళూర్, ఢిల్లీ, శ్రీనగర్, జమ్ము, పట్నా, ఇండోర్, కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన 18 విమానాలను సోమవారం గోఎయిర్ రద్దు చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న ఆందోళనలతో పాటు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని గోఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతికూల వాతావరణం, లో విజిబిలిటీ వంటి సమస్యలతో పాటు పౌర చట్టంపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, విమాన సిబ్బంది హాజరులో పరిమితుల కారణంగా గోయిర్ నెట్‌వర్క్‌లోని పలు విమానాల సేవల్లో విఘాతం కలుగుతోందని సంస్థ ప్రతినిధి ప్రకటనలో వెల్లడించారు. చివరినిమిషంలో గోఎయిర్ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
గో ఎయిర్ చౌక ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ గో ఎయిర్ మినికేషన్ పేరుతో హైదరాబాద్ నుంచి పలు నగరాలకు టికెట్ ధరలను రూ.1,798 నుంచి ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,798, బెంగళూరు, లక్నో రూ.1,799, కోల్‌కతా రూ.1,983, కొచ్చి రూ.2,499, ఢిల్లీకి రూ.2,599 చార్జీ చేస్తారు. బుకింగ్ పీరియడ్ జూన్ 18 నుంచి 23 వరకు ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబరు 30లోగా కస్టమర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గో ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. Family time=Mini-cation time! 👨👩👧👦 Take off with our LOWEST fares starting ₹899* Use promo code GOAIR10 to get an additional 10%* off on https://t.co/0fTA5swRMW or mobile app. Book from 18th - 23rd June'19 & Travel from 1st July - 30th Sept'19 Book now: https://t.co/oBy0dKMKYw pic.twitter.com/PoChsP1o8m — GoAir (@goairlinesindia) June 18, 2019 -
గో ఎయిర్ ఆఫర్ : 999లకే టికెట్
సాక్షి, ముంబై : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విమానయాన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ కూడా తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు రూ.999లకే టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. రేపటితో (జనవరి 26) ఈ ఆఫర్‌ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు. హైదరాబాద్, కోల్‌కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో గో ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లలో కనిష్టంగా రూ.999కే విమాన ప్రయాణం చేయవచ్చు. బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణించవచ్చు. ఇక ముంబై-లేహ రూట్లో ప్రయాణించాలంటే రూ.4,599 చెల్లించాల్సి ఉంటుంది. -
15కేజీల బ్యాగేజీ దాటితే వాతే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై ప్రైవేటు విమాన సంస్థలు భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై ప్రయాణికుల బ్యాగేజీ 15 కేజీలు దాటితే.. అదనపు లగేజీకి వాతలు తప్పవు. ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్లు ఈ 15 కేజీల నిబంధనను తీసుకొచ్చాయి. పరిమితి తర్వాత ఒక్కో కేజీకి రూ.400 రూపాయలు వసూలు చేయనున్నారు. గో ఎయిర్‌లో శని వారం నుంచే ఈ వడ్డింపు అమల్లోకి రాగా.. ఇండిగో, స్పైస్ జెట్లలో వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ ముందుగానే బుక్ చేసుకున్నట్లయితే.. 5 కేజీలకు రూ.1,900, 10 కేజీలకు రూ. 3,800లు వసూలు చేస్తామని గో ఎయిర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో, స్పైస్జెట్లలోనూ కాస్త అటు, ఇటుగా ఇదే వడ్డింపు ఉంటుంది. గత నెల్లో, జెట్ ఎయిర్వేస్ కూడా కొత్త బ్యాగేజీ నిబంధనలను (వచ్చే నెల నుంచి అమల్లోకి) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా మాత్రమే తమ ప్రయాణికులకు 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతినిస్తోంది. -
'ఆ వీడియో బయటపెడితే విమానం కూల్చేస్తా'
సాక్షి, బెంగళూరు : వివాదాస్పదమయ్యే ఓ వీడియో రికార్డు చేసినందుకు విమానాన్ని కూల్చివేస్తానని ఓ పైలట్ ప్రయాణీకుడిని బెదిరించాడు. వెంటనే ఆ వీడియోను తొలగించుకుంటే తాను అన్నంత పని చేస్తానంటూ హెచ్చరించాడు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన గో ఎయిర్ విమానం జీ8-113లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజున ఢిల్లీలో గో ఎయిర్ విమానం ఏ-320ని దాదాపు విమాన సిబ్బందితో కలిసి 187 మంది ఎక్కారు. అది ఉదయం 5.50గంటలకే బయలుదేరి బెంగళూరు రావాల్సి ఉంది. కానీ, రెండుగంటలపాటు ప్రయాణీకులు అందులోనే కూర్చుని చిరాకు పడ్డారు. సరిగ్గా ఏడున్నర ప్రాంతంలో పైలట్ విమానంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆలస్యంగా వస్తున్న పైలట్‌ను ఓ ప్రయాణీకుడు వీడియో తీశాడు. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నపలంగా ఆ వీడియో తొలగించాలని, సోషల్ మీడియాలో పెడితే విమానం కూల్చి వేస్తానంటూ బెదిరించాడు. దీంతో పెద్ద గొడవ అయింది. చివరకు అతడు ప్రయాణీకుడికి క్షమాపణలు చెప్పాడు. 8.40గంటల ప్రాంతంలో విమానం బయలుదేరింది. కాగా, పైలట్ అలాంటి బెదిరింపులు చేయలేదని, ఆలస్యం ఎందుకైందనే ప్రశ్నపై అతడు సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణీకులు కాస్తంగా కోపగించుకున్నారని గో ఎయిర్ విమాన సంస్థ అధికారులు స్పష్టం చేశారు. -
అధికారులను వణికించిన పవర్ బ్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులను పవర్ బ్యాంక్ కాసేపు వణికించింది. లగేజీ తనిఖీ సందర్భంగా ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో హ్యాండ్ గ్రెనేడ్ తరహా వస్తువు దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు గో ఎయిర్ సర్వీస్ ద్వారా వెళ్లేందుకు సదరు ప్రయాణికుడు సిద్ధమయ్యాడు. ఇంతలో అతని లగేజీలో హ్యాండ్ గ్రనేడ్ షేప్‌లో ఉన్న వస్తువు ఒకదానిని గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అదొక పవర్ బ్యాంక్ అని.. కావాలంటే పరిశీలించుకోండంటూ అధికారులను ఆ ప్రయాణికుడు కోరాడు. దీంతో రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు అదొక పవర్ బ్యాంక్ అని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపై అతన్ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించారు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో అలర్ట్ ప్రకటించిన అధికారులు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్
కోల్కత్తా: ప్రయివేటు విమానయాన సంస్థ గో ఎయిర్ విదేశాలు వెళ్లాలనుకునే విమాన ప్రయణికులకు ఊరటనందిస్తోంది. త్వరలోనే తక్కువ ఖర్చుతో నడిచే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని ప్రకటించింది. తమ విదేశీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభిస్తామని గో ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ హెహ్ వాడియా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి తమ విదేశీ గో ఎయిర్ విమానాలను ప్రారింభిచనున్నామని ఆయన అన్నారు. ప్రారంభంలో ఆసియా రీజన్ తమ సేవలను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 24-బలమైన విమానాలకు తోడు నియో ఎ320 143 ఎయిర్ బస్‌లకు ఆర్డర్చేసినట్టు పేర్కొన్నారు. వీటిలో అయిదింటిని ఇప్పటికే తమకు అందాయని, ఇంజీన్ లోపాల కారణంగా డెలివరీ ఆలస్యమవుతున్నట్టు వాడియా వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వాటాల కొనుగోలుపై మరో వైమానిక సంస్థ ఇండిగోకు పోటీగా రానుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీలేదని స్పష్టం చేశారు. అలాగే సంస్థ ఐపీఓకు వచ్చే అంచనాలను కూడా ఆయన కొట్టి పారేశారు. -
రూ.599కే గోఎయిర్ టికెట్!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రూ.599 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ ఆఫర్ మే 12 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. నిజానికి గో ఎయిర్ దేశవ్యాప్తంగా 23 రూట్లలో విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఆఫర్ మే 12న ఆరంభమైందని... 15 అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. -
గో ఎయిర్ ఆఫర్: రూ. 599లకే టికెట్
న్యూడిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్ సమ్మర్ స్పెషల్ సేల్ తరువాత దేశీయ ఎయిర్‌లైన్ గో ఎయిర్ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. మాన్ సూన్ క్యాంపెయిన్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 599 గా ప్రారంభమయ్యే ధరలను శుక్రవారం ప్రకటించింది. ఈ రోజు మే 12 నుంచి మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులోఉండనున్నాయని ఎయిర్ లైన్ ఒకప్రకనట లో తెలిపింది. జూలై 01 - సెప్టెంబరు 30, 2017 మధ్య ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తమ నెట్ వర్క్ లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ చెల్లుతుంది. 23 సెక్టార్లలో గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు అత్యల్ప ఛార్జీలను అందిస్తుంది. ఇన్ఫాంట్ గ్రూప్ బుకింగ్ కోసం ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదని, ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో లేదా ఏదైనా రూపంలో కలిపి వర్తించదని తెలిపింది. కాగా రూ .899ప్రారంభ ధరలతో మే 8, 2017 న, ఇండిగో 'సమ్మర్ స్పెషల్ సేల్' ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు
-
ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ ఎయిర్ లైన్స్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్ ప్రైస్ వార్ లో మరింతగా దూసుకుపోతున్నాయి. ఈ మేరకు తక్కువ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్ 'గెట్ సెట్ ఫర్ ప్లయింగ్ స్టార్ట్' పేరుతో తగ్గింపు ధరల పథకాన్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ బుకింగ్స్ కోసం జనవరి 7, 2017 వరకు అవకాశాన్ని కల్పించింది. ఎంపిక చేసిన విమానాల్లో రూ. 999 లకే టికెట్లను అందించనుంది. దేశీయ రూట్లలో అన్ని టాక్స్ లను కలుపుకొని డిస్కౌంట్ రేట్లను అందిస్తోంది. ఇండిగో ఎంపిక చేసిన రూట్లలో మరో ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా రూ. 949 లకే విమాన టికెట్లను అందిస్తోంది. ఈ బుకింగ్ ద్వారా జనవరి 31, 2017 నుంచి ఏప్రిల్ 13, 2017 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. కోయంబత్తూరు -చెన్నైరూ. 949, న్యూఢిల్లీ- జైపూర్ రూ. 1,042, చెన్నై-బెంగళూరు రూ.1,187 , ఢిల్లీ-ముంబై రూ. 2,214, రూ నుంచి ఢిల్లీకి చెన్నై- ఢిల్లీ రూ. 2,832 లకు అందుబాటులో ఉన్నట్టు అధికారిక వెబ్ సైట్లో ఇండిగో పేర్కొంది. గో ఎయిర్ ఎంపిక చేసిన మార్గాల్లో రూ.1,057 నుంచి ప్రారంభయ్యే టికెట్లను గోఎయిర్ ఆఫర్ చేస్తోంది. జనవరి 31 దాకా బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. ఈ పథకం క్రింద జైపూర్ - ఢిల్లీ రూ.1,267, బెంగళూరు - గోవా రూ.1,692 ఇతర ధరలను అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ (సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్) ప్రకారం జనవరి -నవంబర్ 2016 భారత మార్కెట్లో విమాన ప్రయాణికుల సంఖ్య 23 శాతం జంప్ చేసి 903 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయ విమానయానంలో బలమైన పెరుగదలను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలు ఈ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని వివరాలకోసం ఆయా సంస్థల వెబ్ సైట్లను సందర్శించవచ్చు. -
రూ. 736కే విమానం టికెట్
విమాన ప్రయాణాలు తగ్గిన నేపథ్యంలో.. మరో విమానయాన సంస్థ కూడా చౌక టికెట్లను ప్రకటించింది. 2017 జనవరి 9వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు పన్నులన్నింటితో కలిపి కేవలం రూ. 736 చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. అయితే ఈ టికెట్లను ఈనెల 24వ తేదీ (గురువారం)లోపు బుక్ చేసుకోవాలి. గో ఎయిర్ నెట్వర్కులు అన్నింటిలోనూ.. అంటే, గో ఎయిర్ వెబ్సైట్, టికెటింగ్ కౌంటర్లు, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లన్నింటికీ ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. అయితే, గ్రూప్ డిస్కౌంటులు, ఇన్ఫాంట్ బుకింగ్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న మరే ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో కలిపి దీన్ని వాడటానికి వీలుండదు. ప్రామాణిక రద్దు, రీబుకింగ్ విధానాలకు అనుగుణంగా ధరలుంటాయి. మరోవైపు.. గురువారం అర్ధరాత్రి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను తమ టికెటింగ్ కౌంటర్లలో అనుమతిస్తామని కూడా గో ఎయిర్ ప్రకటించింది. అయితే, ఈ నోట్లతో బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి గానీ, మార్చుకోడానికి గానీ కుదరదని చెప్పింది. -
2017 నుంచి విదేశాలకు గోఎయిర్
కంపెనీ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది వేసవి సీజన్ నుంచి విదేశీ రూట్లలోనూ సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రైవేట్ విమానయాన సంస్థ గోఎయిర్ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ ప్రాక్-షోర్ వెల్లడించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, చైనా, ఇరాన్, వియత్నాం తదితర దేశాలకు విమాన సేవలు మొదలు కాగలవన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు మొదలైన రూట్లలో గోఎయిర్ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 20గా ఉన్న విమానాల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు కల్లా 26కి పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 144 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరివ్వగా.. వచ్చే పదేళ్లలో నెలకొకటి చొప్పున 2025 నాటికల్లా డెలివరీ అందుకోగలమన్నారు. వీటిలో సింహభాగం సేల్, లీజ్‌బ్యాక్ విధానంలో ఉంటాయని చెప్పారు. దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 8 శాతం మేర ఉందని, అయిదో స్థానంలో ఉన్నామని ఊల్ఫ్‌గాంగ్ వివరించారు. రోజూ 23 నగరాల మధ్య తమ 144 ఫ్లయిట్స్ తిరుగుతుండగా .. డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 184కి చేరగలదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి రేటు 20 శాతం మేర ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ముడివనరుల వ్యయాల పెరుగుదల, మౌలిక సదుపాయాలపరమైన అడ్డంకులు మొదలైనవి డిమాండ్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అయితే, 10 శాతం పైగా.. 15 శాతం మేర వృద్ధి రేటు నమోదైనా మెరుగైనదిగానే భావించవచ్చని ఊల్ఫ్‌గాంగ్ తెలిపారు. ప్రాంతీయ పట్టణాలకు విమాన సేవల పథకంపై స్పందిస్తూ.. ప్రస్తు తం తమ విమానాలకు అనువుగా ఉన్న పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
172 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు
ఎయిర్‌బస్‌తో ఎయిర్ ఏషియా, గో ఎయిర్ ఒప్పందం ఫార్న్‌బరో: విమానయాన సేవలకు గిరాకీ నేపథ్యంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా తోపాటు తక్కువ ధరల విమానసేవల సంస్థ గో ఎయిర్ భారీ ఎత్తున ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఎయిర్‌బస్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంగ్లండ్‌లోని ఫార్న్బరోలో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఎయిర్ ఏషియా 100 విమానాలు ఎయిర్ ఏషియా సంస్థ 100 ఎయిర్‌బస్ ఏ321 నియో మోడల్ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు 1260కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.84,420కోట్లు సుమారు) ఖర్చు చేయనుంది. ఇందులో ఒకే తరగతిలో 236 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. తాజా కొనుగోలుతో కలిపి చూస్తే... ఎయిర్ ఏషియా ఇప్పటి వరకు మొత్తం 575 ఏ320 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో 170 విమానాలను ఎయిర్‌బస్ అందించింది. గో ఎయిర్ 72 విమానాలు గో ఎయిర్ సంస్థ కూడా తన సేవల విస్తరణకు వీలుగా ఎయిర్‌బస్ 72 ఏ320 నియో మోడల్ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 770 కోట్ల డాలర్లు (రూ.51,590 కోట్లు సుమారు). దీంతో వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ మొత్తం 144 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు అయింది. -
రూ. 829 నుంచి విమాన టికెట్లు!
వర్షాకాలం మొదలవ్వడంతో విమాన చార్జీలు కూడా తగ్గుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్సైట్లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
చౌక విమానయానం మరికొన్నాళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంతకాలంగా నష్టాలను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు దిగొస్తున్న ఇంధన ధరలు కలిసొస్తున్నాయి. గత రెండు నెలల్లో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 11 శాతం మేర తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు చౌక టికెట్ల పోటీని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసంలో విమానయానానికి డిమాండ్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు పెంచేవాళ్లమని, కానీ ఈసారి ఇంధన ధరలు తగ్గడంతో ధరలను పెంచకుండా ప్రస్తుత తగ్గింపు ధరలనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు ధరలను మరికొంత కాలం కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా మేనేజింగ్ డెరైక్టర్ ఎల్.వి.ఎస్.రాజశేఖర్ చెప్పారు. ఇంధన ధరలు తగ్గినప్పటికీ ఇంతకంటే విమానయాన ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోని విమాన టికెట్ల సగటు ధరలతో పోలిస్తే ఇక్కడే తక్కువున్నాయని, దీంతో ప్రస్తుత ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించలేమని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే బాటలో ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా కూడా తక్షణం టికెట్ల ధరలను మరింత తగ్గించలేమని స్పష్టం చేసింది. ఇండిగో, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కంపెనీలకు ఊరట... విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 నుంచి 50 శాతం వాటా కేవలం ఇంధనానిదే. ఇప్పుడు ఆ ఇంధన ధరలు దిగొస్తుండటంతో విమానయాన సంస్థలకు నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం విమానయాన సంస్థలు ఏటా రూ. 25,000 కోట్లు ఇంధనం కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ధరలు 11 శాతం తగ్గడంతో పరిశ్రమకు రూ. 2,750 కోట్లు ప్రయోజనం లభించిందంటున్నారు. ఈ ధరల తగ్గింపు వల్ల రూ. 320 కోట్లు తక్షణ ప్రయోజనం కలిగినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. గతేడాది స్పైస్ జెట్ ఆదాయం రూ. 5,200 కోట్లు కాగా, నిర్వహణా వ్యయం రూ. 6,200 కోట్లు అవ్వడంతో రూ.1,000 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు ఇంధన ధరలు తగ్గడంతో నష్టాలు తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఇంధన ధరలు తగ్గడం వల్ల నిర్వహణా వ్యయం 6 శాతం వరకు తగ్గినట్లు రాజశేఖర్ తెలిపారు. గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఈ త్రైమాసికం లాభాల్లోకి ప్రవేశించింది. ఒక పక్క ఇంధన ధరలు తగ్గుతున్నా రూపాయి విలువ క్షీణించి డాలరు విలువ పెరుగుతుండటంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానాల లీజింగ్ దగ్గర నుంచి చాలా సేవల ఒప్పందాలన్నీ డాలర్లలోనే ఉంటాయని, డాలరు విలువ పెరగడంతో ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. విస్తరణపై దృష్టి..: గత కొంతకాలంగా విస్తరణకు దూరంగా ఉన్న విమానయాన సంస్థలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంధన ధరలు దిగిరావడం దేశీయ విమానయాన రంగ వృద్ధికి ఊతమిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త విమానాలను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ. 47,200 కోట్లతో 58 విమానాలను కొనుగోలు చేయనున్నాయి. వచ్చే ఫిబ్రవరికి మరో రెండు కొత్త విమానాలు వస్తాయని, దీంతో మరిన్ని పట్టణాలకు విస్తరించడమే కాకుండా, సర్వీసుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఎయిర్కోస్టా తెలిపింది. స్పైస్ జెట్ మరో మూడు విమానాలను కొనుగోలు చేసే పనిలో ఉంది. దేశీయ ప్రయాణికులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో రైలు టికెట్ల కంటే తక్కువ రేటుకే విమానయానాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వంటి పట్టణాలకు పరిమిత సంఖ్యలో రూ.300కే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి.