గో ఎయిర్‌ ఆఫర్‌: రూ. 599లకే టికెట్‌ | Monsoon Special: Go Air offers air tickets at Rs 599 | Sakshi
Sakshi News home page

గో ఎయిర్‌ ఆఫర్‌: రూ.599లకే టికెట్‌

Published Fri, May 12 2017 2:37 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

గో ఎయిర్‌ ఆఫర్‌: రూ. 599లకే  టికెట్‌

గో ఎయిర్‌ ఆఫర్‌: రూ. 599లకే టికెట్‌

న్యూడిల్లీ:  ఇండిగో ఎయిర్ లైన్ సమ్మర్ స్పెషల్  సేల్   తరువాత  దేశీయ ఎయిర్లైన్  గో ఎయిర్ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది.  మాన్ సూన్ క్యాంపెయిన్  పేరుతో అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 599 గా ప్రారంభమయ్యే ధరలను శుక్రవారం  ప్రకటించింది.
ఈ రోజు   మే 12  నుంచి మే 15, 2017 అర్ధరాత్రి  వరకు  ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులోఉండనున్నాయని   ఎయిర్ లైన్ ఒకప్రకనట లో తెలిపింది.  జూలై 01 - సెప్టెంబరు 30, 2017 మధ్య ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.  తమ నెట్ వర్క్ లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే  ఈ డిస్కౌంట్ చెల్లుతుంది. 23 సెక్టార్లలో  గో ఎయిర్ ఎయిర్లైన్స్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు అత్యల్ప ఛార్జీలను అందిస్తుంది.
ఇన్ఫాంట్ గ్రూప్ బుకింగ్ కోసం ఈ  డిస్కౌంట్ అందుబాటులో ఉండదని,  ఇతర ప్రమోషనల్ ఆఫర్తో లేదా ఏదైనా రూపంలో కలిపి వర్తించదని తెలిపింది. 

కాగా రూ .899ప్రారంభ ధరలతో మే 8, 2017 న, ఇండిగో 'సమ్మర్ స్పెషల్ సేల్' ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement