గో ఎయిర్ విమానం (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, బెంగళూరు : వివాదాస్పదమయ్యే ఓ వీడియో రికార్డు చేసినందుకు విమానాన్ని కూల్చివేస్తానని ఓ పైలట్ ప్రయాణీకుడిని బెదిరించాడు. వెంటనే ఆ వీడియోను తొలగించుకుంటే తాను అన్నంత పని చేస్తానంటూ హెచ్చరించాడు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన గో ఎయిర్ విమానం జీ8-113లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజున ఢిల్లీలో గో ఎయిర్ విమానం ఏ-320ని దాదాపు విమాన సిబ్బందితో కలిసి 187 మంది ఎక్కారు. అది ఉదయం 5.50గంటలకే బయలుదేరి బెంగళూరు రావాల్సి ఉంది. కానీ, రెండుగంటలపాటు ప్రయాణీకులు అందులోనే కూర్చుని చిరాకు పడ్డారు. సరిగ్గా ఏడున్నర ప్రాంతంలో పైలట్ విమానంలోకి ప్రవేశించాడు.
ఆ సమయంలో ఆలస్యంగా వస్తున్న పైలట్‌ను ఓ ప్రయాణీకుడు వీడియో తీశాడు. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నపలంగా ఆ వీడియో తొలగించాలని, సోషల్ మీడియాలో పెడితే విమానం కూల్చి వేస్తానంటూ బెదిరించాడు. దీంతో పెద్ద గొడవ అయింది. చివరకు అతడు ప్రయాణీకుడికి క్షమాపణలు చెప్పాడు. 8.40గంటల ప్రాంతంలో విమానం బయలుదేరింది. కాగా, పైలట్ అలాంటి బెదిరింపులు చేయలేదని, ఆలస్యం ఎందుకైందనే ప్రశ్నపై అతడు సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణీకులు కాస్తంగా కోపగించుకున్నారని గో ఎయిర్ విమాన సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment