
సాక్షి, ముంబై : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విమానయాన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. బడ్జెట్ విమానయాన సంస‍్థ గోఎయిర్ కూడా తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు రూ.999లకే టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. రేపటితో (జనవరి 26) ఈ ఆఫర్‌ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.
హైదరాబాద్, కోల్‌కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో గో ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లలో కనిష్టంగా రూ.999కే విమాన ప్రయాణం చేయవచ్చు. బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణించవచ్చు. ఇక ముంబై-లేహ రూట్లో ప్రయాణించాలంటే రూ.4,599 చెల్లించాల్సి ఉంటుంది.