Republic Day 2019
-
గణతంత్ర్య పరేడ్‌లో ఏపీ శకటం
-
హలో పోలీసూ.. ఏంటా పని..!!
-
హలో పోలీసూ.. ఏంటా పని..!!
నాగ్‌పూర్ : రిపబ్లిక్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినిలపై డబ్బులు వెదజల్లిన ఓ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. వివరాలు.. నాగ్‌పూర్‌లోని భివాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రమోద్ వాల్కే హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ‘ఆయే వతన్ తేరే లియే’ దేశభక్తి గీతాన్ని ప్రదర్శిస్తున్న స్కూల్ విద్యార్థినిలపై తప్పతాగిన వాల్కే డబ్బులు వెదజల్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. సదరు పోలీసు చర్యపై విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉండి మద్యం సేవిచండంతో పాటు.. ఒళ్లు మరచి ప్రవర్తించినందుకు సస్పెండ్ చేశారు. కాగా, ముంబైలో డాన్సింగ్ బార్ల నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే, డ్యాన్సర్లపై డబ్బులు వెదజల్లడం నిషేధించిన కోర్టు.. కావాలంటే వారికి టిప్ అందివ్వొచ్చని పేర్కొంది. సీసీ కెమెరాల నిఘాలో డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవాలని నిబంధనలు విధించింది. -
ఖాళీ గ్రౌండ్లో గవర్నర్ ప్రసంగం
ఐజ్వాల్: మిజోరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ కుమ్మనామ్ రాజశేఖరన్‌కు వింత పరిస్థితి ఎదురైంది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పలు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రజలెవరూ పాల్గొనలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మాత్రమే వచ్చారు. ప్రజలెవరూ రాకపోవడంతో మైదానమంతా ఖాళీగా ఉంది. అదేసమయంలో గవర్నర్ ప్రసంగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. -
ఘనంగా గణతంత్రం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 70వ గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. అంతకుముందు, శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో కలసి రాహుల్ ముందటి వరుసలో కూర్చున్నారు. గతేడాది రాహుల్‌కు ఆరో వరసలో సీటు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమం చివర వాయుసేన ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి అస్సాం రైఫిల్స్ మహిళా జవాన్లు, మహిళా అధికారి బైక్ స్టంట్లు గణతంత్ర వేడుకల్లో చరిత్ర సృష్టించాయి. మహిళా శక్తిని ప్రదర్శించాయి. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు. నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్‌తోపాటు సిగ్నల్స్ కోర్కు చెందిన కెప్టెన్ శిఖా సురభి చేసిన మోటారు సైకిల్ విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో సంప్రదాయంగా వస్తున్న పురుష జవాన్ల ‘డేర్ డేవిల్స్’ బైక్ విన్యాసాల్లో కెప్టెన్ శిఖా సభ్యురాలు. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఆర్మీ సర్వీస్ కార్ప్స్కు లెఫ్టినెంట్ కస్తూరి, ట్రాన్స్‌పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్ కాంటిజెంట్‌కు కెప్టెన్ భావ్నా శ్యాల్ నేతృత్వం వహించారు. ‘రాజస్తాన్‌కు చెందిన నేను, ఒక బస్ కండక్టర్ కూతురుని. నేనే ఈ పని చేయగలిగానంటే బాలికలెవరైనా తమ కలలను నిజం చేసుకోగలరని నా నమ్మకం’ అని ఒక బిడ్డకు తల్లి అయిన మేజర్ కన్వర్ తెలిపారు. లక్షలాది పూలతో సీపీడబ్ల్యూడీ శకటం శకటాల ప్రదర్శనలో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజా పనుల విభాగం) శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటాన్ని ఏకంగా 3 లక్షల బంతిపూలు, మల్లె, గులాబీలతో అలంకరించింది. గాంధీ దండి యాత్రను ప్రదర్శిస్తూ, అహింసా మార్గంలో అనుచరులు, వెనుక ప్రపంచ శాంతి, ఐక్యతను ప్రదర్శించింది. పసుపు, నారింజ తలపాగాతో మోదీ రిపబ్లిక్ డే వేడుకల్లో రంగురంగుల తలపాగా ధరించే ఆనవాయితీని మోదీ ఈసారి కొనసాగించారు. ఎరుపు, పైన పసుపు, నారింజ రంగుతో కూడిన తలపాగా, కుర్తా పైజామా, నెహ్రూ ట్రేడ్‌మార్క్ జాకెట్‌తో ప్రధాని పాల్గొన్నారు. గణతంత్ర, ఆగస్టు 15 వేడుకల్లో మోదీ ధరిస్తున్న తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2018 పంద్రాగస్టు వేడుకల్లో కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ 2017లో చిక్కనైన ఎరుపు, పసుపు వర్ణంలో, బంగారు రంగు చారలు కలిగిన తలపాగాను కట్టుకున్నారు. రాజ్‌పథ్ విశేషాలు.. ► రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు. ► మార్చింగ్ చేసిన ఆర్మీ బృందాల్లో మద్రాస్ రెజిమెంట్, రాజ్‌పుతానా రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, గోర్ఖా బ్రిగేడ్లు ఉన్నాయి. ► సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే ► అమెరికా శతఘ్నులు ఎం777, ఎంబీటీ టీ–90, దేశీయంగా తయారుచేసిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ► పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ► నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు. ► 144 మంది యువ అధికారులతో కూడిన నేవీ బృందం వెనకే నేవీ శకటం పరేడ్‌లో పాల్గొంది. ► వైమానిక బృందంలో 144 మంది సైనికులకు చోటు కల్పించారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధ వ్యవస్థల్ని వైమానిక దళ శకటం ప్రదర్శించింది. తేలికపాటి యుద్ధ విమానం, దిగువ స్థాయి తేలికపాటి వెయిట్ రాడార్, సుఖోయ్30ఎంకేఐ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ► ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లతో పాటు పారా మిలిటరీ, ఇతర అనుబంధ బలగాలు కూడా పరేడ్‌లో పాల్గొన్నాయి. ► ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కారానికి ఎంపికైన 26 మంది బాలలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ► వైమానిక దళ విమానాలు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ► 70వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శనివారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులకు మిఠాయిలను పంచిపెట్టారు. పాకిస్తానీ సైనికులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని పాక్ సైనికులు ఆలింగనం చేసుకుని, చేతులు కలిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లడఖ్‌లో మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఐటీబీపీ జవాన్లు నజీర్ అహ్మద్ తరఫున భార్యకు అశోకచక్ర అందిస్తున్న కోవింద్. వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ. 3 లక్షల పుష్పాలతో రూపొందించిన శకటం -
ఎట్ హోం.. సందడే సందడి
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం సందడిగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రా ల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, బండారు దత్తాత్రేయ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, టి.సంతోష్కుమా ర్, ఎన్.రాంచందర్‌రావు, బి.వెంకటేశ్వర్లు, పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్, తెలంగాణ ఎన్నికల కమిషన్ సీఈవో రజత్‌కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తదితరులు ఎట్ హోంకు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ఎట్ హోం అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. పలకరింపులు... ముచ్చట్లు... ఎట్ హోంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేచి వచ్చి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పలకరించారు. పవన్‌కల్యాణ్‌తో సీఎం కేసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు పరిచయం చేయడాన్ని అంద రూ ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఎదురుపడగానే కేసీఆర్ ఆయన వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్.రమణ, కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దగ్గరికి వెళ్లి కేసీఆర్ పలకరించారు. భట్టి విక్రమార్క, మహమూ ద్ అలీ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సీఎం కేసీఆర్ పక్కనే పవన్‌కల్యాణ్ కూర్చున్నారు. మరోపక్క కేటీఆర్ ఉన్నారు. పలు అంశాలపై పవన్‌కల్యాణ్‌తో వారు వేర్వేరుగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. ఎట్ హోంకు వచ్చిన ముఖ్యుల్లో పవన్‌కల్యాణ్ ముం దుగానే బయటకు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ గవర్నర్ నివాసంలోకి వెళ్లి చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో ఈ విషయంపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
కన్నతండ్రి ఎదురీత
ఓ నలభై ఏళ్ల మధ్యతరగతి తండ్రికి తన కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కొడుకు కోరినది ఏదీ కాదనకుండా ఇస్తాడు. కానీ ఆ తండ్రి అతి ప్రేమ కొన్ని ఇబ్బందులకు కారణమైంది. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు ఏంటి? అనే అంశాల ఆధారంగా ‘ఎదురీత’ అనే చిత్రం తెరకెక్కింది. శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోయ్ హీరో హీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేశారు బాలమురుగన్. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కుమారుడి కోసం కన్నతండ్రి సాగించిన ‘ఎదురీత’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు లక్ష్మీ నారాయణ. కాశీ విశ్వనాథ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ‘రంగస్థలం’ మహేశ్, రవిప్రకాష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రకాష్ మనోహరన్ లైన్ ప్రొడ్యూసర్. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలు గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన అవససరం ఉందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో చైర్మన్ వి.స్వామిగౌడ్, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగమే మూలం. రాజ్యాంగాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి. ప్రకృతి, ఆర్థిక సంపదలకు మానవ వనరులు తోడయితే అద్భుతాలు సాధిం చొచ్చు. దేశంలో పేద, ధనికులు మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. 30% మంది దగ్గరే మొత్తం సంప ద కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అసమానతలను తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే పవిత్రమైన శాసన సభలోనూ రాజకీయాలు మాట్లాడితే అభాసుపాలవుతాం. నేరాలు తగ్గి శాంతిభద్రతలు పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’అన్నారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు, ఆకుల లలిత, ఎం.ఎస్.శ్రీనివాస్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, బోడికుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తరువాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
ప్రగతిపథంలో.. తెలంగాణ పరుగులు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా అన్ని బాలారిష్టాలను దాటుకొని తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మరే రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఇంత పెద్ద భారీగా నిధులను కేటాయించటం లేదన్నారు. ప్రభుత్వం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించే బృహత్తరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, అంతర్రాష్ట్ర వివాదాలను అధిగమించి, అటవీ, పర్యావరణ అనుమతులన్నీ సాధించి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోందన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఈ వర్షాకాలం నుంచే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టుల నిర్మాణ æపనులు అనతికాలంలో పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ఒక్క తెలంగాణలోనే... మిషన్ కాకతీయతో రాష్ట్రంలో వేలాది చెరువులు పునరుద్ధరణకు నోచుకుని కళకళ్లాడుతున్నాయన్నారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ వచ్చేనెల పూర్తవుతుందని నరసింహన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలోనే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని.. రైతుబంధు ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకోవడాన్ని గవర్నర్ గుర్తుచేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ వర్గాల కోసం 542 రెసిడెన్షియల్ స్కూళ్ళను ప్రారంభించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించబోతోందని గవర్నర్ ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూం’వేగవంతం... పేదల నివాసాలు నివాసయోగ్యంగా, గౌరవ ప్రదంగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఇప్పటికే 2.72 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. మెరుగైన రవాణా కోసం 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతమున్న ఔటర్ రింగు రోడ్డు అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగు రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని, పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా టీఎస్–ఐపాస్ చట్టం తీసుకొచ్చారని.. ఐటీ రంగంలో నూతన అన్వేషణలకు వేదికగా నెలకొల్పిన ‘టీ–హబ్’అంకుర సంస్థలకు అండగా నిలుస్తోందన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిందని, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 21 జిల్లాలకు తోడుగా త్వరలోనే నారాయణపేట, ములుగు జిల్లాలు కూడా అస్తిత్వంలోకి రాబోతున్నాయని చెప్పారు. అడవుల రక్షణ కోసం కలప స్మగ్మర్ల పై ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయించిందని, కాలుష్యమయంగా మారిన మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించిందని, కాళేశ్వరంతో మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానం చేయాలని సంకల్పించిందని గవర్నర్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును తెలంగాణ సాధిస్తోందని ఆయనవెల్లడించారు. అమర జవాన్లకు కేసీఆర్ నివాళి... అంతకుముందు పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా ఆర్మీ రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం భద్రతా దళాలు వెంటరాగా అమరజవాన్ల స్థూపం వద్దకు వెళ్లారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరసైనికులకు నివాళులర్పించారు. తర్వాత ప్రాంగణం వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగరేసి భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించారు. -
దేశం మనదే
-
‘మిగిలింది కలెక్టర్ గారు చదువుతారు’
భోపాల్ : ‘మిగిలినవి.. కలెక్టర్ గారు చదువుతారు. నాకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. కావాలంటే మా డాక్టర్ని అడగండి. మరేం పర్లేదు. నాకు బదులుగా కలెక్టర్ ప్రసంగాన్ని పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించిన మహిళా మంత్రి ఇమర్తీ దేవిపై నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే కార్యక్రమానికి ఎందుకు హాజరు అయ్యారు. అయినా చదవడం రాకపోతే హుందాగా తప్పుకొని ఉండాల్సింది. చిన్నపిల్లల్లా ఇలా సాకులు చెప్పడం దేనికి మేడమ్’ అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. మధ్యప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ఇమర్తీ దేవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో జెండా ఎగురవేశారు. అనంతరం ఉపన్యాసం ఇచ్చేందుకు ఉపక్రమించారు. పేపర్‌పై రాసుకున్న అక్షరాలను చదివే క్రమంలో ఆమె తడబడ్డారు. వెంటనే పక్కనే ఉన్న కలెక్టర్ భరత్ యాదవ్‌కు తన బాధ్యతను అప్పగించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక.. పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 25న మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. ఇద్దరు మహిళలు విజయలక్ష్మీ సాధూ, ఇమర్తీ దేవీలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. #WATCH Madhya Pradesh Minister Imarti Devi in Gwalior asks the Collector to read out her #RepublicDay speech pic.twitter.com/vEvy1YVjRM — ANI (@ANI) January 26, 2019 -
త్రిశూలం ఆకారంలో విన్యాసాలు..
-
మంచుకొండల్లో భారత పతాక రెపరెపలు
-
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
గణతంత్ర వేడుకలకు దూరంగా ఈశాన్య రాష్ట్రాలు
మిజోరాం : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వీటితో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ర్టాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇలా పిలుపునిచ్చిన వాటిల్లో నాగలాండ్‌కు చెందిన ‘నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్’(ఎన్ఎస్ఎఫ్), మణిపూర్‌కు చెందిన మరి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఎఫ్ పౌరసత్వ బిల్లు పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ప్రజలను తప్పు దోవ పట్టింస్తోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలంటూ ఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. ఇక మణిపూర్‌కు చెందిన ఐదు పౌరసంస్థలు కూడా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
అందుకే కేసీఆర్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందని, దేశనిర్మాణంలో తెలంగాణ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ‘గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర నిర్మాణనానికి మంచి అడుగులు పడ్డాయి. వినూత్న ఆలోచనలతో సీఎంగా కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా.. రాష్ట్ర పునర్నిర్మాణ చర్యలు చేపట్టారు. బలమైన నాయకత్వం వల్ల అందుకు సానుకూలత చేకూరింది’ అని గవర్నర్ పేర్కొన్నారు. నిబద్ధతతో కూడిన పరిపాలన కారణంగానే.. సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రజల మనుసులు గెలుచుకున్నాయని, అందుకే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి పట్టంకట్టారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతిఏటా రూ. 40 వేలకోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒక్కటైన సాగునీటి సాధనకోసం.. కోటి 25 లక్షల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ రబీ నుంచే కాళేళ్వరం ప్రాజెక్టు ఫలాలు తెలంగాణ ప్రజలకు అందేలా వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి, ప్రాజెక్టులు ఆన్ సకాలంలో పూర్తి చేస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో భగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రతి వ్యక్తికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, ఆవాసాలకు మంచినీరు అందుతున్నాయని తెలిపారు. రైతుబంధు పథకం జాతీయ ఎజెండాగా మారిందని ప్రశంసించారు. కేసీఆర్ కిట్‌తో మాతాశిశు మరణాలు తగ్గాయని చెప్పారు. నిబద్ధతతో కూడిన పరిపాలన కారణంగానే కేసీఆర్ మరోసారి గెలుపొందారని అన్నారు. -
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నేతల పాలన..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నేటితరం నాయకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ మాత్రం సిగ్గుపడకుండా నాయకులు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మత గ్రంథాలను ఏవిధంగా గౌరవిస్తామో.. అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించాలని, అప్పుడే రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం పెరుగుతుందని అన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హమీలిస్తూ.. రాష్ట్రాన్ని దగా చేస్తూ ఏదోరకంగా ఎన్నికల్లో మళ్లీ గెలువాలనే విధానం నుంచి కొందరు నేతలు బయటికి రావాలని ఆయన సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడినప్పుడే సమాజం కలకాలం బాగుంటుందన్నారు. స్వప్రయోజనాల కోసం భారతదేశ స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా ఉత్తర భారతదేశంలో చిచ్చుపెట్టేవిధంగా మాట్లాడటం మంచి పరిణామం కాదని హితవు పలికారు. అనేక మతాలు, కులాలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన మన దేశాన్ని గౌరవించే విధానం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించి.. రాష్ట్రపోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడుకలకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడకల్లో ఉత్తమ్‌తో పాటు శాసనసభపక్షనేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ: హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సీనియర్ నేతలు, పార్టీ శ్రేణుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముందు ఆయన జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేడ్కర్, జాతీయోద్యమ నేతలు నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబూ జగజ్జీవన్ రామ్‌ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హాజరైన పార్టీ శ్రేణులకు, ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో కొద్ది సేపు గడిపి కార్యకర్తలను, నేతలను పలకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు వైఎస్ వివేకానందరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర మైనారిటీల విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నేతలు వాసిరెడ్డి పద్మ, హెచ్ఏ రెహ్మాన్, విజయచందర్, కంతేటి సత్యనారాయణరాజు, పీఎన్వీ ప్రసాద్, ఎస్.దుర్గాప్రసాదరాజు, ఎం.కిష్టప్ప, మహ్మద్ ఇక్బాల్, కొండా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, పి.సుబ్బారెడ్డితో సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడలో ఘనంగా వేడుకలు విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. దేశం కోసం పోరాడిన మహనీయుల చిత్ర పటాలకు పార్టీ నేతలు పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలంగా మనకు రాజ్యాంగం, దాని ద్వారా హక్కులు సంక్రమిస్తే.. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా వాటికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబుకు దేశమన్నా, రాష్ట్రమన్నా, ప్రజలన్నా కూడా గౌరవం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండి పుణ్యశీల, బొప్పన భవకుమార్, మనోజ్ కొఠారి, ఎంవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్‌డే వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో శనివారం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. -
మంచుకొండల్లో భారత పతాక రెపరెపలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ సందర్బంగా ఇండియన్ ఆర్మీ 21 గన్ సెల్యూట్ చేసింది. కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి ప్రకటించిన అశోకచక్ర అవార్డును ఆయన సతీమణికి రాష్ట్రపతి అందజేశారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్ త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిద దళాల అధిపతులు నివాళులర్పించి రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. త్రిశూలం ఆకారంలో విన్యాసాలు.. రిపబ్లిక్ వేడుకల అతిథిగా వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస ప్రధాని నరేంద్రమోదీ పక్కనే ఆసీనులై కవాతును, శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. వైమానిక దళం జరిపిన ఆకాశ విన్యాసాలు కనువిందు చేశాయి. త్రిశూలం ఆకారంలో సుఖోయ్ యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 18 వేల మీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకం.. మంచు పటాలంగా చెప్పుకునే ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బెటాలియన్ భారత 70వ గణతంత్ర దినోత్సవం సదర్భంగా త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. భారత్ మాతా కీ జై.. అంటూ నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను చేతబూని కవాతు చేశారు. వీరు 18 వేల మీటర్ల ఎత్తులో గల లడక్ హిమ ప్రాంతంలో, జీరో డిగ్రీల చలిలో విధులు నిర్వహిస్తున్నారు. మైనస్ 30 వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఇక ఎవరెస్టు 3 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉండగా.. ఐటీబీపీ దళం దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తులో రక్షణ సేవలందిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపడుతోంది. -
అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
-
జనవరి 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కోడెల
సాక్షి, అమరావతి : అమరావతిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 నుంచి గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమవేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫిబ్రవరి 1,2,3 తీదీల్లో అసెంబ్లీకి సెలవు అని ప్రకటించారు. అనంతరం ఫిబ్రవరి 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశం.. 6 నుంచి 8 వరకూ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని తెలిపారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు, ప్రపంవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన, అత్యుత్తమైన రాజ్యాంగం అమలులోకి వచ్చి 69 సంవత్సరాలు అయిందని, ప్రతి పౌరుడికీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే మన ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుతున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
-
శతాబ్దానికొక్క అవకాశం!
న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం, శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశంగా భావించండి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఇది పరీక్షా సమయమన్న రాష్ట్రపతి.. ఇప్పుడు వేసే ఓటు ఈ శతాబ్దంలో దేశం గతిని నిర్ణయిస్తుందన్నారు. పేదలకు రిజర్వేషన్ల కల్పన గాంధీ కలల సాకారం దిశగా పడిన అడుగుగా ఆయన అభివర్ణించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వ భావనను స్వీకరించనిదే దేశాభివృద్ధి పరిపూర్ణం కాదు. ఈ దేశం మనది, మన అందరిదీ. మన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శం. ఇవి విడదీయరానివి. ఈ మూడూ మనకు అత్యవసరం’ అని రాష్ట్రపతి అన్నారు. ఓటర్లకు విన్నపం మరో నాలుగు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన..‘21వ శతాబ్దంలో పుట్టిన పౌరులు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో దక్కనుంది. భారతీయుల ఆకాంక్షలకు, విభిన్నతకు నిదర్శనం ఈ ఎన్నికలు. అర్హులైన ఓటర్లందరికీ నా విన్నపం ఒక్కటే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికలు తరానికి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు..ఈ శతాబ్దానికి ఏకైక ఎన్నికలుగా భావించండి. ప్రజాస్వామ్య ఆదర్శాలు, ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేవి ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో, దేశ అభివృద్ధిలో ఇవి ఒక మైలురాయి మాత్రమే’ అని అన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు ‘పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణ గాంధీజీ కలలు, భారతీయుల కలల సాకారం వైపునకు పడిన మరో అడుగు’ అని అన్నారు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళకు సమాన అవకాశాలు, సమాన పరిస్థితులు కల్పించడమే మన సమాజం లింగ సమానత్వం సాధించిందనేందుకు సరైన సూచిక’ అని తెలిపారు. మన రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవసూచికగా ఈ ఏడాది దేశం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోనుంది’ అని పేర్కొన్నారు. -
'విలక్షణ' రాజ్యాంగం!
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత విశిష్టతల్లో.. రాజ్యాంగం ప్రత్యేకమైనది. బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి.. 308 మంది మేధావుల సుదీర్ఘ మేధోమథనం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో చేతితో రాశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాం గం మనదే. దీంట్లో 444 అధికరణలు, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు, 118 సవరణలున్నాయి. ఇంగ్లీషు రాజ్యాంగంలో 1,17,369 పదాలున్నాయి. రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలంటే పార్లమెం టులో మూడొంతుల ఆమోదం తప్పనిసరి. మరికొన్ని సవరణలకు పార్లమెంటులో మెజా రిటీతో పాటు సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు ద్వంద్వ పాలన విధానం మరో ప్రత్యేకత. మొదటిది సమాఖ్య లేదా కేంద్ర ప్రభుత్వం. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు. రాజ్యాంగం ఈ రెండింటికీ అధికారాలు పంచింది. అయితే, రాష్ట్రాలకంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధి కారాలన్నీ రాజ్యాంగం నుంచే దఖలు పడ్డాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఇచ్చింది.భారత దేశం గణతంత్ర రాజ్యం. ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు విశేషాధికారాలు ఉంటే దాన్ని ‘గణతంత్రం’ అంటారు. రాజ్యాం గాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటడం మన రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకత. మరే దేశ పౌరులకు ఈ హక్కు లేదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రజలకు పెద్ద ఆస్తి. సమానత్వం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛ, సాంస్కృతిక, విద్యా పరమైన స్వేచ్ఛ మొదలై నవి రాజ్యాంగం మనకిచ్చిన వరాలు. చాలా దేశాల్లో పౌరులకు ఇలాంటి హక్కులు లేవు. రాజ్యాంగ పీఠిక చెబుతున్నదిదే! భారత ప్రజలమైన మేము.. ‘భారతదేశాన్ని సర్వసత్తాక– సామ్యవాద – లౌకిక – ప్రజాస్వామిక – గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు.. పౌరులందరికీ సాంఘిక – ఆర్థిక – రాజకీయ న్యాయాన్ని.. ఆలోచన – భావ ప్రకటన – విశ్వాసం – ధర్మం – ఆరాధనలపై స్వేచ్ఛను.. అంతస్తుల్లో – అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుకునేందుకు.. వారి వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ ఐక్యత, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు..’ రాజ్యాంగ పీఠికలోని పై వాక్కులు భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రతిబింబిస్తు న్నా యి. రాజ్యాంగ లక్ష్యాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఈ పీఠికే రాజ్యాంగానికి ఆత్మ. పీఠికలో భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగానే పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో (1976లో) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి.. ‘సామ్యవాద’, ‘లౌకిక’పదాలు చేర్చారు. ‘దేశ ఐక్యత’అనే పదాన్ని, ‘దేశ ఐక్యత, సమగ్రత’గా మార్చారు. సార్వభౌమాధికారానికి పెద్ద పీట వేయడం ద్వారా భారతదేశం సర్వ స్వతంత్రమైనదని పీఠిక పేర్కొంది. తన విధానాల విషయంలో రాజీలేని వైఖరి అవలంభించగలదని స్పష్టీకృతమైంది. ప్రజాస్వామ్యమార్గాల్లో ‘సామ్యవాద’లక్ష్యాలు సాధిం చాలనే ఆలోచనకు దేశం కట్టుబడుతుందని తేల్చింది. ‘లౌకిక’తత్వానికి లోబడడం ద్వారా మత ప్రమేయం లేని రాజ్యంగా ప్రకటించుకుంది. ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పాలనా వ్యవహారాల్లో భాగమయ్యేందుకు కావ లసిన ‘ప్రజాస్వామిక’హక్కులను కట్టబెట్టింది. రాచరికానికి స్థానం లేదని, ప్రజలు మాత్రమే పాలిస్తారని (గణతంత్రం) ప్రకటించింది. -
గణతంత్ర విజయం.. పంచాయతీరాజ్ వ్యవస్థ
70ఏళ్ల భారత గణతంత్ర సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన అతిగొప్ప విజయం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఢిల్లీ పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంతో మొదలైన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా వరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుంది. జనాభాలో సగంగా ఉన్న మహిళలు ఇప్పుడు 50% స్థానిక సంస్థలను పాలిస్తున్నారు. ఊరికి దూరంగా బతుకులీడ్చిన దళితులు కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. అయితే, ఇలాంటి విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ.. అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ పరిష్కరించుకోగలిగితే ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ ఆదర్శవంతమవుతుంది. 73వ రాజ్యాంగ సవరణతో.. ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింపచేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి ంది. పాలనలో పంచాయతీ ప్రతినిధులు భాగస్వాములయ్యారు. గ్రామస్థాయి పాలనలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. తమ సమస్యలను తామే గుర్తించి వాటి పరిష్కారాలను కూడా తామే నిర్ణయించుకునే అధికారం పంచాయతీ ప్రతినిధులకు దక్కింది. తద్వారా నిధుల వినియోగం, పాలనలో పారదర్శకత ఏర్పడింది. ఆ మేరకు రాష్ట్రాలు పంచాయతీలకు అవసరమైన అధికారాలు బదిలీ చేయడానికి వీలైంది. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులతో గ్రామ పాలన సాగించేది. అధికారులకు స్థానిక సమస్యల పట్ల అవగాహన లేమి కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడేది. గ్రామాలపై అధికారుల పెత్తనం కొనసాగేది. పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, విధుల వికేంద్రీకరణ వల్ల అవి బలమైన పాలన కేంద్రాలుగా తయారవుతాయనడంలో సందేహం లేదు.స్థానికుల అవసరాలను తీర్చగలుగుతాయి. వారికి జవాబుదారీగా ఉంటాయి. మహిళలకు పగ్గాలు.. ప్రస్తుతం దేశంలో 2,32,332 గ్రామ పంచాయతీలు, 6000 మండల/సమితులు, 534 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 27,75,858 మంది, మండల/సమితులకు 1,44,491 మంది, జిల్లా పరిషత్‌లకు 15,067 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. వీటిలో 75వేల పంచాయతీలు, 2వేల మండల పరిషత్‌లు 175 జిల్లా పరిషత్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ల కారణంగా పలువురు ఎస్సీ,ఎస్టీలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికవుతున్నారు. పాలనలో భాగస్వాములవుతున్నారు. దేశ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ విజయవంతం అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం స్థానిక సంస్థలు కూడా పార్లమెంటు, అసెంబ్లీల్లాగే రాజ్యాంగబద్ధ సంస్థలే. వాటిలాగే ఇవి కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. చాలా స్థానిక సంస్థలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల పాలనాపరంగా పంచాయతీలకు నేటికీ పూర్తి స్వయంప్రతిపత్తి లభించడం లేదు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదా సీనంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. నిధుల కేటాయింపులో రాజకీయ ఒత్తిళ్లు, కాం ట్రాక్టర్ల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రక్రి యలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోం ది. కొన్ని రాష్ట్రాలు పంచాయతీల నిధులను కూడా ఏదో వంకతో పక్కదారి పట్టిస్తున్నాయి. సమాంతర పాలన.. పంచాయతీల అధికారాల్ని దెబ్బతీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పార్టీ తరఫున గ్రామ సభలు/కమిటీలు ఏర్పాటు చేయడం, పంచాయతీ నిధుల్ని పక్కదారి పట్టించడం చేస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పంచాయతీలతో సంబంధం లేకుండా అభివృద్ధి పథకాలు అమలు పరచడం కూడా పంచాయతీ వ్యవస్థను బలహీనపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర పాలన సాగిస్తోంది. మౌలిక వసతుల కొరత.. దేశవ్యాప్తంగా 2.52 లక్షల పంచాయతీలు ఉంటే, వాటిలో 60వేల పంచాయతీలకు సొంత భవనాలు కూడా లేవు. చాలా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉన్నాయి. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ ప్రవేశపెట్టినా దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన సదుపాయాలు చాలా పంచాయతీలకు లేవు. సాంకేతిక నిపుణుల కొరత, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా పంచాయతీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోలేక అభివృద్ధిలో వెనకబడుతున్నాయి. పేరుకు స్వయం నిర్ణయాధికారాలు ఉన్నా పరోక్షంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుగా వాటి అదుపాజ్ఞల్లోనే పని చేయాల్సి వస్తోంది. స్వయం ప్రతిపత్తి లేదు. మూడంచెల మధ్య సమన్వయం, సామరస్యం లోపిస్తోంది. జవసత్వాలిచ్చిన సవరణ 73వ రాజ్యాంగ సరవణ పంచాయతీలకు కొత్త అధికారాలు కల్పించడమే కాక దాని స్వభావాన్ని కూడా మార్చివేసింది. అంతకు ముందు పంచాయతీలు రాజ్యాంగ సంస్థలు కావు. కేవలం అమలు కమిటీలుగానే ఉండేవి. వాటిలో రాజకీయ పార్టీలకు ఏ సంబంధం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగతంగానే పోటీ చేసేవారు. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీల్లో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. వాటికి స్వయం నిర్ణయాధికారం లభించింది. పంచాయతీల్లో బలహీనవర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. దేశమంతటా రెండు, మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటయింది. నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట రాజస్థాన్ ప్రభుత్వం 1959లో నాగపూర్ జిల్లాలో ప్రవేశపెట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. రాజస్తాన్ రెండో సీఎం బల్వంత్రాయ్ను ‘పంచాయతీ పిత’గా పేర్కొంటారు. ఆయన ఆధ్వర్యంలో వేసిన కమిటీ సిఫారసు మేరకే దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. వైఫల్యాల్లోంచి పుట్టిన ఆలోచన దేశాభివృద్ధి కోసం1952లో నాటి ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది. అయితే, ఇవి ఆశించిన ఫలితాలనివ్వలేదు. గ్రామస్థాయికి ఆ పథకాలు వెళ్లకపోవడం, పంచాయతీలు వాటిని సమర్థవంతంగా అమలు పరచలేకపోవడమే దీనికి కారణమన్న భావన వ్యక్తమయింది. పరిపాలన కేంద్రీకృతం కావడం వల్ల గ్రామ స్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణ లోపించింది, అవినీతి పెరిగింది. జవాబుదారీ తనం లోపించింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై, అధికారులపై నమ్మకం పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడానికి, అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయిలో పూర్తిగా అమలు కావడానికి అధికార వికేంద్రీకరణ అవసరమని పెద్దలు భావించారు. దాంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. 1990లో జనతా ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యాల అధ్యయనానికి అశోక్ మెహతా కమిటీని వేసింది. రాజీవ్ గాంధీ (1989), వీపీ సింగ్(1990), పీవీ నరసింహారావు(1991) ప్రభుత్వాలు ఈ వ్యవస్థ బలోపేతానికి పలు సవరణలు చేశాయి. వీటన్నిటి కారణంగానే.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. -
జయ జయ జయ జయహే
అద్భుతం.. అపూర్వం.. 69 ఏళ్లలో.. వందల సవరణలు జరిగినా మౌలిక స్వరూపం చెక్కుచెదరని రాజ్యాంగం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఎన్నో కులాలు, మతాలు, విభిన్న భాషలు,సంప్రదాయాలున్నప్పటికీ.. అందరినీ కలుపుకుని వెళ్తూ ఘనమైన గణతంత్రంగా కొనసాగడానికి అసలైన కారణం బలమైన మన రాజ్యాంగ పునాదులే. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవడానికి కారణం కూడా మన రాజ్యాంగం వేసిన బాటలే. రాజ్యాంగంలోని సెక్షన్లు, చాప్టర్లు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అవసరాలను తీరుస్తున్నాయి. కొత్త సమస్యలకూ పరిష్కారాలు చూపిస్తున్నాయి.అందుకే మన రాజ్యాంగం ‘ది గ్రేట్’. ఎన్నో సమస్యలు.. ఒకే పరిష్కారం విభిన్న భాషలు, మతాలు, సంప్రదాయాల సంగమమైన విశాల భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగానికి రూపకల్పన చేయడం ఓ అద్వితీయమైన ప్రక్రియ. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఇలాంటి రాజ్యాంగాన్ని.. నేటి పరిస్థితుల్లో రాయడం కచ్చితంగా అసాధ్యమనే చెప్పాలి. భారత్‌తోపాటు అనేకమైన ఆసియా, ఆఫ్రికా దేశాలు వలసపాలకులనుంచి విముక్తి పొందినా.. ఆయా దేశాలన్నీ ఇప్పటికీ అంతర్గత కల్లోలాలతో సతమతమవుతున్నాయి. పాకిస్తాన్ పరిస్థితిలో ఇన్నేళ్లయినా మార్పు రాకపోవడమే ఇందుకు సరైన ఉదాహరణ. భారత విభజన కూడా చాలా దుర్మార్గంగా జరిగిందనేది సుస్పష్టం. పంజాబ్, బెంగాల్‌లు రెండేసి ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో చెలరేగిన హింస చరిత్రలో చెరగని మరకలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత పలు సంస్థానాలు భారత్‌లో కలిసే సమయంలోనూ ఇబ్బందులు తప్పలేదు. కశ్మీర్‌లోయలో కొంతభాగం పాక్ అధీనంలోకి వెళ్లడం, తదనంతర సమస్యలు నేటికీ ఓ సవాల్‌గా మారాయి. ఇన్ని విచిత్రమైన, విపత్కర సమస్యలున్నప్పటికీ.. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించారు. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత జనతా ప్రభుత్వం, 1999 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. ప్రభుత్వాలేవైనా.. రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకున్నాయి. తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు అందరూ రాజ్యాంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య పండగ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మించడానికి 1950లోనే సుకుమార్ సేన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. పాశ్చాత్య దేశాల్లో మొదట ఆస్తులున్నవారికి, ఆ తర్వాత చాలా కాలానికి.. కార్మికులు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. భారత్‌లో మాత్రం రాజ్యాంగంలో రాసుకున్న విధంగా భాష, లింగ, కుల, మత వివక్ష లేకుండా 21 ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల కమిషన్ తన మొదటి కర్తవ్యంగా లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందిని తీసుకుని ఓటర్ల జాబితాలు రూపొందించింది. ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రయోగమైన తొలి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదన్న పాశ్చాత్య దేశాల అంచనాలు తప్పని మన రాజ్యాంగం మరోసారి రుజువుచేసింది. 1952 నుంచి 2014 వరకు 16సార్లు పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ద్వారా కేంద్రంలో, రాష్ట్రాల్లో శాంతియుతంగా అధికార బదిలీ జరుగుతోంది. ఇదంతా అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందించుకున్న భారత రాజ్యాంగం పుణ్యమేననడంలో సందేహం లేదు. చెక్కు చెదరని మౌలిక స్వరూపం 69 ఏళ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. వందకు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలు, నిరంతర నిఘా కారణంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం నేటికీ చెక్కుచెదరలేదు. రాజ్యాంగబద్ధ పాలనతో ప్రజాస్వామ్యం కొత్త కొత్త ప్రాంతాలకు, వర్గాలలోకి చొచ్చుకుపోతోంది. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగంలోని కొన్ని లోటుపాట్లు సుపరిపాలనకు అడ్డంకిగా మారాయని ఏడు దశాబ్దాల మన అనుభవాలు చెబుతున్నాయి. 20 కోట్ల జనాభా దాటిన ఉత్తరప్రదేశ్ మొదలుకుని లక్షల జనాభా ఉన్న సిక్కిం వరకూ ఉన్న 29 రాష్ట్రాలకు ఫెడరల్ వ్యవస్థలో వాటికి ఉండాల్సినన్ని అధికారాలు లేవు. 1980ల్లోనే వామపక్షాలు, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, తెలుగుదేశం, అస్సాం గణపరిషత్ వంటి ప్రాంతీయపక్షాల డిమాండ్ల కారణంగా.. కేంద్రం–రాష్ట్రాల సంబంధాలు సమీక్షించేం దుకు పలు కమిషన్లను ఏర్పాటుచేశారు. లిబ రలైజేషన్, గ్లోబలైజేషన్ ఫలితంగా ఆర్థిక, పారి శ్రామిక రంగాల్లో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ పెరిగిన మాట వాస్తవమేగాని విద్య, వైద్యం వంటి అనేక కీలక రంగాల్లో ఇప్పటికీ రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం లేదు. ఈ నేపథ్యంలో నిజమైన ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే డిమాండ్ల పరీక్షను భారత రాజ్యాంగం ఎదుర్కోవలసి వస్తుంది. ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే రాజ్యాంగ సవరణ దేశ చరి త్రలో అతి పెద్ద సవరణ అయ్యే ఆస్కారం ఉంది. ఇది రిపబ్లిక్ దేశం భారత్‌కు రాజ్యాంగాన్ని రూపొందించ డమే లక్ష్యంగా భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 జనవరి 9న జరిగింది. మూడేళ్ల తర్వాత 1949 నవంబర్ 26న చర్చోపచర్చల తర్వాత రాజ్యాంగానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే నిజమైన స్వాతంత్య్రం భారత ప్రజలకు లభించింది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పౌరులకు అధికారాన్ని రాజ్యాంగం అందించింది. తొలి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దేశప్రజలకు సందేశమిస్తూ.. ‘జాతి పిత, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న వర్గ రహిత, సహకార స్వేచ్ఛతో, సంతోషాలతో నిండిన సమాజ స్థాపనకు మనం పునరంకితమౌదాం. ఈ రోజు కేవలం పండుగ చేసుకోవడంపై కన్నా మన లక్ష్యాలకు పునరంకితం కావడానికే శ్రద్ధ చూపాలి. కర్షకులు, శ్రామికులు, కార్మికులు, ఆలోచనపరులు పూర్తి స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేలా చేసే.. గొప్ప లక్ష్యానికి కట్టుబడి ఉందాం’అని పిలుపునిచ్చారు. ప్రయాణం మొదలైందిలా..! రాజధాని ఢిల్లీలోని అర్విన్ స్టేడియం (ప్రస్తుత మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో 1950 జనవరి 26న ఉదయం 10.30 గంటలకు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మువ్వన్నెల జాతీయ పతాకం ఆవిష్కరించడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 21గన్ సెల్యూట్‌తో ఈ చారిత్రక ఘట్టం మొదలైంది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఇండియాలో బ్రిటిష్ పాలన ముగిసిన 894 రోజులకు ప్రజలే ప్రభువులుగా భారత్ సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రయాణం ప్రారంభించింది. బ్రిటిష్ వలస రాజ్యం ట్యాగ్ నుంచి.. సర్వసత్తాక, లౌకిక, ప్రజాతంత్ర దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవడం చాలా గొప్ప పరిణామం. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్యం కావాలనే స్వప్నం.. 1950లో వాస్తవరూపం దాల్చడానికి రెండు దశాబ్దాలు పట్టింది. 1929 లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో భారత గణతంత్ర రాజ్యానికి బీజాలు పడ్డాయి. 1930 జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వ్యాధుల ఆటకట్టు.. ఆరోగ్యమే మన పట్టు!
ఆరోగ్య రంగంలో మన దేశం గత 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని చూస్తే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం నుంచి ప్రాణాంతక వ్యాధులెన్నింటినో మట్టుబెట్టగలిగాం. మలేరియా, క్షయ, ఆటలమ్మ, కుష్టువ్యాధి, పోలియో లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టగలిగాం. 1947లో 725 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, 2017 నాటికి 28,863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. 1950–51లో ప్రతి 1000 జననాలకు 145.6 మంది శిశువులు మరణించేవారు. ప్రస్తుతం ప్రతి 1000 మందికి 34 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. 1940ల్లో ప్రతి లక్ష జననాలకు 2 వేల మాతృ మరణాలు సంభవించేవి. 1950కి వచ్చేసరికి 1,000కి తగ్గాయి. 2015 నాటికి 174 మాతృమరణాలు సంభవిస్తున్నాయి. అయితే అంతర్జాతీ యంగా చూసుకుంటే మనదేశం మాతృమరణాల్లో శ్రీలంక (30), థాయ్‌లాండ్(20), చైనా (27) లకంటే బాగా వెనుకబడి ఉంది. 1950 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల సంఖ్య 50,000. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 725. 1950లో మన దేశ ప్రజల జీవిత కాలం 32 ఏళ్లే. 2016 గణాంకాల ప్రకారం మన దేశ ప్రజల సగటు జీవన ప్రమాణం 68 ఏళ్లు. 1. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ ( ప్రతి 10,000 మందికి) 1950– 51లో 1.7 మంది ఉంటే, 1999– 2000 సంవత్సరంలో 5.5 ఉన్నారు. 2. మెడికల్ కాలేజీలు 1950–51లో 28 ఉంటే, 1999–2000 నాటికి 167 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2017 నాటికి మన దేశంలో 460 మెడికల్ కాలేజీలున్నాయి. 3. ప్రతి 10 వేల మంది జనాభాకు ఆసుపత్రి బెడ్లు 1950–51లో 3.2 ఉంటే 1999–2000లో 9.3 ఉన్నాయి. 4. వైద్యులు ప్రతి 10 వేల మందికి 1950–51లో 61.8 మంది ఉంటే, 1999–2000 ల కల్లా 535.2 మంది వైద్యులున్నారు. 2017 నాటికి దేశంలో మొత్తం 8 లక్షల మంది వైద్యులున్నారు. ప్రతి 1668 మందికీ ఒక వైద్యులున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులను అధిగమించాం! మలేరియా: 1958లో నేషనల్ మలేరియా ఎరాడికేషన్ కార్యక్రమం తీసుకోవడం ద్వారా చాలా వరకు మలేరియాని నివారించగలిగాం. మశూచి: 1977 తర్వాత దీన్ని అధిగమించడంలో మనం సఫలీకృతం అయ్యాం. క్షయ: 1955 లో నేషనల్ టీబీ కంట్రోల్ కార్యక్రమాన్ని మన దేశంలో తెచ్చారు. 1977లో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ కార్యక్రమంలో కొద్దిగా మార్పులు చేసి పునఃప్రారంభించారు. జిల్లా టీబీ కంట్రోల్ సెంటర్లు దేశవ్యాప్తంగా 446 నెలకొల్పారు. ఆ తరువాత మన దేశంలో క్షయ వ్యాధుల సంఖ్య తగ్గింది. కుష్టువ్యాధి: 1990–91 నాటికి క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 లక్షలు. 1955లోనే కుష్టువ్యాధి నివారణకు నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రాంలో ప్రారంభించారు. కుష్టు వ్యాధి నిర్మూలనలో మనం సఫలీకృతులమయ్యాం. ఎయిడ్స్: మన దేశంలో 1987 సంవత్సరంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ప్రారంభించాం. 1990–91లో జోనల్ స్థాయి రక్తపరీక్ష కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు. పోలియో: ఏడాదికి ఒకేరోజులో కోట్లాది మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా దాదాపు పోలియోని దేశం అధిగమించగలిగింది. -
విను వీధిలో విద్యారంగం!
చదువు అనేది ఉత్పత్తిని పెంచడానికి.. సామాజిక, జాతీయ సమగ్రతకు.. ఆధునికత దిశగా దేశం అడుగులు వేసేందుకు.. సామాజిక, నైతిక, ఆధ్యాత్మికతకు సాధనంగా దోహదపడేలా చూడాలి’ గత 70 ఏళ్లలో నిరక్షరాస్య దేశం నుంచి భారత్ ప్రపంచ జ్ఞాన కేంద్రంగా అవతరించింది. విద్యా రంగంలో అవాంతరాలను అధిగమించి, అభివృద్ధికి బాటలు వేసింది. 1951లో 36.1 కోట్ల జనాభాలో 18.33% మంది ప్రజలే అక్షరాస్యులుగా ఉన్నారు. ప్రస్తుతం 74.04 శాతం మంది ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. పురుషుల్లో 82% మంది, స్త్రీలలో 66%మంది అక్షరాస్యులు. అత్యధిక అక్షరాస్యతా రాష్ట్రంగా 94.65 శాతంతో త్రిపుర నిలిచింది. బిహార్‌లో అతి తక్కువగా 63.82%అక్షరాస్యత ఉంది. ప్రాథమిక విద్య.. 1995లో కేంద్రం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం విద్యా రంగంలోనే విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. 1950–51లో 2.1 లక్షల ప్రాథమిక పాఠశాలలున్నాయి. 2018 నాటికి దేశం మొత్తం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 8,40,546. సాంకేతిక విద్య.. సాధారణ విద్య స్థానంలో సాంకేతిక విద్య అభివృద్ధి వైపు దేశం పరుగులు తీసింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ కాలేజీలనూ, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేశారు. ఎన్నో పారిశ్రామిక శిక్షణ సంస్థలను అభివృద్ధి పరిచారు. అందులో.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటివి ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలను స్థాపించారు. ఉన్నత విద్య.. 1951లో దేశంలో 27 యూనివర్సిటీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉన్నత విద్యలో మూడో అతిపెద్ద దేశం భారత్. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నాయి. 2016 నాటికి దేశంలో 799 విశ్వవిద్యాలయాలున్నాయి. 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 540 స్టేట్ యూనివర్సిటీలు. 122 డీమ్డ్ యూనివర్సిటీలు, 90 ప్రైవేటు యూనివర్సిటీలున్నాయి. -
ఐదేళ్లకో ప్రణాళిక.. 5వ స్థానానికి చేర్చింది
డెబ్భై ఏళ్లు!!. ఒక పూర్తి జీవితం!!. వెనక్కి తిరిగి చూసుకుంటే బాల్యం నుంచి జరిగిన ఘటనలు అన్నీ ఇన్నీ కావు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇదే సమయంలో... ఊహకందనన్ని జీవితాల్ని చూసిందను కోవాలి. కేవలం రూ.947 కోట్లతో మొదలైన ప్రస్థానం... ఇపుడు ఏకంగా రూ.167 లక్షల కోట్లకు చేరింది. సగటు భారతీయుడి తలసరి ఆదాయాన్ని రూ.247 నుంచి రూ.1.12 లక్షలకు తీసుకెళ్లింది. పంచవర్ష ప్రణాళికలతో మొదలుపెట్టి... వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, సేవలు... ఇలా అన్ని రంగాలకూ ప్రాధాన్య మిచ్చుకుంటూ... సంక్షోభాల్ని తట్టుకుని, సంస్కరణలకు ప్రాణం పోసి ఇపుడో మహాశక్తిగా ఎదిగింది. ఈ ఏడు దశాబ్దాల పయనంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది... స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కేవలం రూ.947 కోట్ల ఆర్థిక వ్యవస్థను మనకు బ్రిటిష్ వారు అప్పగించి వెళ్లగా... అదిప్పుడు రూ.167 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. స్వాతంత్య్రం వచ్చాక స్వల్ప వృద్ధికి కూడా కటకటలాడే ఆర్థిక వ్యవస్థ 2005–06 నాటికి ఏకంగా రెండంకెల వృద్ధికి ఎగబాకింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత వృద్ధి రేటు నెమ్మదించి నప్పటికీ, 2014 నుంచి (2017 మినహా) ప్రపంచంలో అత్యంత వేగంగా 7 శాతం వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ అవతరించగలిగింది. ఈ 70 ఏళ్లలో భారతీయుడి వార్షిక తలసరి ఆదాయం రూ.247 నుంచి రూ.1.12 లక్షలకు చేరింది. ఇక రిజర్వుబ్యాంకు వద్ద 1950లో కేవలం 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలుండేవి. అలాంటిదిపుడు 400 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలుండే స్థాయికి చేరింది. పంచవర్షం నుంచి నీతి ఆయోగ్‌కు... బుడిబుడి అడుగులేసే పిల్లల ఎదుగుదలకు ప్రణాళిక వేసినట్లుగా.. ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపడానికి 1951లో పంచవర్ష ప్రణాళికలు ఆరంభమయ్యాయి. యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడటం వంటి కారణాలతో 1967– 1969 సంవత్సరాల మధ్య పంచవర్ష ప్రణాళికలు అమలు కాలేదు. 1978–79, 1990–91, 1991–92లో మూడు సార్లు వార్షిక ప్రణాళి కలను అమలు చేశారు. ప్రస్తుత 2012–2017 పంచవర్ష ప్రణాళిక 12వది. కాగా తాజాగా ఏర్పాటైన నీతి ఆయోగ్ మూడేళ్ల యాక్షన్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. సంక్షోభాలను తట్టుకుంటూ... ఈ 70 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థ 3సంక్షోభాల్ని చవి చూసింది. అవి 1966, 1981, 1991 సంవత్స రాల్లో. ఈ మూడూ కూడా విదేశాలకు చెల్లింపులు చేయలేక తలెత్తిన సంక్షోభాలే. దివాలా దేశంగా ప్రకటితమయ్యే సందర్భాలవి. అలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డాలరు రుణాన్ని సర్దుబాటు చేయడంతో తక్షణ చెల్లింపులు చేయగలిగాం. 1991లో తలెత్తిన సంక్షోభానికి రిజర్వు బ్యాంకు తన దగ్గరున్న 67 టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్ వద్ద తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1991లో సంక్షోభ ఫలితంగా 1992లో ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. అవి కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయి. మన మానవ వనరుల సమర్థ వినియోగానికి దారులు వేశాయి. అంతే!! ఆ తరవాత మళ్లీ సంక్షోభ ఛాయలు భారత్‌ను తాకలేదు. గ్యాస్... ఫోన్... సంస్కరణల చలవే! 1992 వరకు ఏదైనా వ్యాపారం నడపాలంటే ప్రతి దానికీ లైసెన్సులు లేదా పర్మిట్లు తప్పనిసరి పద్ధతి నడిచింది. 1992లో రూపాయి విలువను ఒకే నెలలో మూడు దఫాలు తగ్గించడం ద్వారా మొదలైన ఆర్థిక సంస్కరణలు.. లైసెన్స్ రాజ్‌కు తెరవేశాయి. పలు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచాయి. అప్పటిదాకా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ కావాలంటే సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. టెలిఫోన్ శ్రీమంతులకే సాధ్యం. ప్రయివేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవటంతో పోటీతత్వం పెరిగింది. తక్షణం కావాల్సిన గ్యాస్ కనెక్షన్ రావటమే కాదు.. ఫోన్ కనెక్షన్లను ఇంటికొచ్చి మరీ ఇచ్చే పరిస్థితులొచ్చాయి. 1990 దశకం తొలినాళ్లలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావంతో భారత్ క్యాపిటల్ మార్కెట్ వృద్ధిచెందింది. లిస్టెడ్ కంపెనీల విలువ రూ.150 లక్షల కోట్లకు చేరడంతో భారత్ స్టాక్ మార్కెట్ 9వ పెద్ద స్టాక్ మార్కెట్‌గా ఎదిగింది. ఆర్థిక సంస్కరణలకు ముందు... కారు లేదా స్కూటర్ కొనాలంటే వాటిని బుక్ చేసుకున్న రెండు, మూడేళ్లకుగానీ డెలివరీ వచ్చేది కాదు. మన కంపెనీల వద్ద ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం, ప్రభుత్వం ఉత్పత్తిపై పరిమితులు విధించడం ఇందుకు కారణం. వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.విదేశాల నుంచి కారు గానీ, కంప్యూటర్‌గానీ, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200 నుంచి 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. ఆర్థిక సంస్కరణలకు తర్వాత.. కారు లేదా స్కూటర్ కొనాలంటే వాటిని బుక్ చేసుకున్న రెండు, మూడేళ్లకుగానీ డెలివరీ వచ్చేది కాదు. మన కంపెనీల వద్ద ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం, ప్రభుత్వం ఉత్పత్తిపై పరిమితులు విధించడం ఇందుకు కారణం. వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.విదేశాల నుంచి కారు గానీ, కంప్యూటర్‌గానీ, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200 నుంచి 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. గత 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 500 డాలర్ల నుంచి 1600 డాలర్లకు మూడు రెట్లకుపైగా పెరిగింది. రానున్న 25 ఏళ్లలో తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా. విదేశీ మారక నిల్వలు దాదాపు జీరో నుంచి 400 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పాలించిన బ్రిటన్‌కంటే... ఏ దేశం నుంచైతే మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నామో.. ఆ దేశం.. బ్రిటన్ను మించిపోయేందుకు భారత్ సిద్ధమయ్యింది. 2020లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ తలదన్ని ప్రపంచంలో ఐదో పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందంటూ తాజాగా పీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రపంచ కుబేరులొచ్చారు... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ టాప్–5 శ్రీమంతుల జాబితాలో చేరారు. పేదరికం తగ్గుముఖం దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం 45 నుంచి 21.9కి తగ్గింది. (2011 గణాంకాలు) -
అవమానాల నుంచి..విప్లవాలనెంచి
తినేందుకు తిండి లేదు.. రోగమొస్తే మందుబిళ్లకూ దిక్కులేని స్థితి.. గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పుడు ఇదీ భారత్ పరిస్థితి! మరి ఇప్పుడు.. అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి.. అగ్రరాజ్యాల కళ్లు కుట్టే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి! శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ ఘన విజయాలను తరచిచూస్తే.. హరిత విప్లవం విజయాలు.. 1947 నాటికి గోధుమ దిగుబడి 60 లక్షల టన్నులు వరి దిగుబడి 24 లక్షల టన్నులు 2017–18 నాటికి గోధుమలు 10 కోట్ల టన్నులు వరి దిగుబడి 11.2 కోట్ల టన్నులు క్షీర విప్లవం..(1955లో దిగుమతులు) వెన్న 500 టన్నులు పాలపొడి 3,000 టన్నులు 2016లో భారత్ ఎగుమతి చేసిన పాలు 36 వేల టన్నులు 2018 నాటికి పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతుల విలువ 17.2 కోట్ల డాలర్లు క్షీర విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్ అని చాలామందికి తెలుసు. అప్పట్లో పాలను పొడిగా మార్చే సాంకేతికతను భారత్‌కు ఇచ్చేందుకు ఐరోపా దేశాలు నిరాకరించాయి. దీంతో హెచ్.ఎం.దలయా అనే డెయిరీ శాస్త్రవేత్త మామూలు స్ప్రే గన్, ఎయిర్ హీటర్ల సాయంతో ఓ యంత్రాన్ని తయారు చేయడంతో పరిస్థితి మారింది. గేదె పాలను పొడిగా మార్చలేమన్న యూరోపియన్ల అంచనాను తప్పు అని నిరూపించారు. హెచ్.ఎం.దలయా వల్లే భారత్‌లో క్షీర విప్లవ ప్రస్థానం మొదలైంది. ప్రపంచానికి మందులిచ్చాం విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ సాయంతో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ చట్టాన్ని సవరించడంతో జెనరిక్ మందుల తయారీ సులువైంది. నేషనల్ కెమికల్ లేబొరేటరీస్, రీజినల్ రీసెర్చ్ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్ మందుల విప్లవం మొదలైంది. విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ సాయంతో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ చట్టాన్ని సవరించడంతో జెనరిక్ మందుల తయారీ సులువైంది. నేషనల్ కెమికల్ లేబొరేటరీస్, రీజినల్ రీసెర్చ్ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ))లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్ మందుల విప్లవం మొదలైంది. ఐటీతో మున్ముందుకు తమకు అక్కరకు రాని యంత్రాలను భారత్‌కు పంపడం.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం.. ఇదీ 1960– 70లలో దేశంలోని డేటా ప్రాసెసింగ్ రంగం పరిస్థితి. ఐబీఎం, ఐసీఎల్ కంపెనీల గుత్తాధిపత్యం ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మిలిటరీ, పరిశోధన సంస్థల్లోనూ ఇదే తంతు. ఈ నేపథ్యంలో 1970లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయిన్టెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ), స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ఏర్పాటుతో దేశంలో ఐటీ విప్లవానికి బీజాలు పడ్డాయి. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణకు ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేసిన తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఐటీ ఉత్పత్తులు, సేవల రంగంలో ఈ రోజు భారత్ ఓ తిరుగులేని శక్తి. టెలికం విప్లవం ఒకప్పుడు ఇంటికి ఫోన్ కావాలంటే నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. టెలికామ్ రంగంలో కీలకమైన స్విచింగ్ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లోనే ఉండటం ఇందుకు కారణం. అయితే 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో దేశంలో టెలికామ్ విప్లవానికి అంకురం పడింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి 100 లైన్ల ఎలక్ట్రానిక్ స్విచ్‌ను అభివృద్ధి చేయగలిగింది. ఇదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు సంయుక్తంగా మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్ తయారు చేశారు. 1984లో శాం పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో పల్లెపల్లెనా టెలిఫోన్ ఎక్సే ్చంజ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీ–డాట్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లోనూ టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సమాచార విప్లవం 1975.. భారత్ సొంత ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం. ఐదేళ్లు తిరగకుండానే ఎస్ఎల్వీ–3 రాకెట్‌తో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాలు 238 వరకు ఉంటే అందులో విదేశీ ఉపగ్రహాలు 104. ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాలు దేశంలో సమాచార విప్లవానికి నాంది పలికాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వాతావరణ అంచనాలు, తుపాను హెచ్చరికలను సామాన్యుడికి చేరువ చేసిందీ పరిణామం. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారకుడిపైకి అంతరిక్ష నౌకను పంపగలిగినా.. జాబిల్లిపై నీటి జాడను కనిపెట్టేందుకు ప్రయోగాలకు కేంద్రంగా నిలిచినా అది భారత్‌కే చెల్లింది. సొంతంగా రాకెట్ కూడా తయారు చేసుకోలేని దశ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు జీపీఎస్ వ్యవస్థలను అందించే స్థాయికి ఎదగడం మనం గర్వించాల్సిన విషయమే! అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడాలని మన విధానం. విద్య, ఆరోగ్యం దేశ నలుమూలలకు చేర్చేందుకు ఉపగ్రహాలను వాడతామని 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆలోచనలను పట్టించుకున్న వారు కొందరే. రాకెట్, ఉపగ్రహ నిర్మాణంలో అప్పటికి మనకున్న టెక్నాలజీ సున్నా! అయితే దశాబ్దం తర్వాత ఆర్యభట్ట ప్రయోగంతో భారత్ తన సత్తా చాటుకుంది. -
ఎవరి మేళం వారిది!
మా ఊళ్లో పోలేరమ్మ గుడి ఉంది. ఏటా ఆ గ్రామ దేవతకి జాతర జరుగుతుంది. ఎవరి పద్ధతిలో వాళ్లు పూజలు చేస్తారు. మొక్కులు తీరుస్తారు. పోటాపోటీగా జాతర నిర్వహిస్తారు. గ్రామ దేవతకి ఊళ్లో వాద్య కళాకారులంతా తమతమ వాద్యగోష్ఠితో సంగీత నివేదన చేస్తారు. డప్పులు వాయించే కళాకారులు, డోలు వాయిద్యాలు, బాకాలూదేవారు, బ్యాండ్ సెట్లో ఇత్తడి బూరాలు వాయించే వాళ్లు ఇలా రకరకాల వాళ్లు అమ్మవారి గుడిచుట్టూ చేరి తమ భక్తిని అపారంగా ప్రదర్శిస్తారు. మా ఊళ్లో రెండు వర్గాలుంటాయ్ హీనపక్షంగా. రెండో వర్గం డప్పులు, బ్యాండ్లు మంచి సెగలో వేడెక్కించి అమ్మోరి గుడిచుట్టూ మోహరించేది. తాషా మరపాలు, రామ డోళ్లు, ఇంకా రకరకాల తోలు వాయిద్యాలు వాటి శ్రుతుల్లో అవి మోగిపోతూ ఉంటాయ్. నాదస్వరం, క్లారినెట్లు, మెడకి వేసుకున్న హార్మణీ పెట్టెలు వాటికొచ్చిన సంగీతాన్ని అవి సొంత బాణీల్లో వినిపిస్తూ ఉంటాయ్. వాద్యకారులందరికీ పోలేరమ్మమీద భక్తే. ఏ ఒక్కరినీ శంకిం చలేం. మధ్యమధ్య ఊదుడు శంఖాలున్న జంగందేవర్లు శంఖనాదాలు చేస్తుంటారు. ఇంకా బోలెడు సందళ్లు. వీటన్నింటినీ ఏకకాలంలో మూకుమ్మడిగా గంటల తరబడి వినడమంటే ఇహ ఆలోచించండి. పైగా వర్గపోటీలో రెచ్చిపోయి వాయిస్తూ ఉంటారు. వాళ్లని ఎవ్వరూ అదుపులో పెట్టలేరు. ఆ.. వూ... అనలేరు. వింటూ చచ్చినట్టు ఆ శిక్ష అందరూ అనుభవించాల్సిందే. ఆ కారణంగా కుర్రతనంలో నాకు మొదటిసారి దేవుడు లేడేమోనని సందేహం వచ్చింది. నిజంగా ఉంటే జాతరలో భక్తులు చేస్తున్న ఈ రణ గొణ ధ్వనులను ఏ అమ్మవారైనా, ఏ అయ్యోరైనా ఎందుకు వారించరు? గుడ్లురిమి ఎందుకు భయపెట్టరు? వారి మనస్సుల్లో ప్రవేశించి, గ్రామానికి శాంతి ఏల ప్రసాదించరు? ఇలా పరిపరి విధాల అనుకుంటూ దేవుడి ఉనికిని శంకించేవాణ్ణి. ఆ ముక్క చెబితే, మా నాయనమ్మ గుంజీలు తీయించి, చెంపలు వేయించి, నా చేత తలస్నానం చేయించేది. ఆ తర్వాత మళ్లీ పోలేరమ్మ మీద నమ్మకం కుదిరేది. ఈ మహా కూటముల తిరనాళ్లు చూస్తుంటే మా వూరి జాతర మేళం గుర్తొస్తుంది. అందరి లక్ష్యమూ ఒక్కటే. ఉన్నవాళ్లని ఇప్పుడు కుర్చీలోంచి దింపాలి. వీళ్లు పవర్లోకి రావాలి. ఇప్పుడు ఉన్నాయన ప్రజ లకు చాలా అన్యాయం చేస్తున్నారు, మేం మిమ్మల్ని రక్షిస్తాం–అనే ఉమ్మడి నినాదంతో ఇంటింటికీ వస్తారు. ర్యాలీలు, భారీ సభలు నిర్వహిస్తారు. ఓటర్లు మరొక్కసారి బోనులో పడకపోతారా అని కూటమి పిచ్చి నమ్మకంతో ఉంది. ఈ జగత్తు యావత్తూ ఒక పెద్ద వల. తెల్లారిన దగ్గర్నించి జీవిని జీవి వలలో వేసుకోవడమే లక్ష్యం. పురుగుని కప్ప, కప్పని పాము, పాముని డేగ, డేగని వేటగాడు ఇలా ఒక వలయం చుట్టూ వేట సాగు తుంది. నిద్ర లేవకుండానే, సాలెపురుగు వల అల్లడం మొదలుపెడుతుంది. జింక కోసం పులి పొంచి ఉంటుంది. నోటి సైజులని బట్టి చేపలు చేపల కోసం పరుగులు పెడుతుంటాయ్. కొంగ ఒంటికాలి మీద జపంలో నుంచుంటుంది. ఏ జీవి లక్ష్యమైనా కావల్సిన ఆహారం సంపాయించుకోవడమే. నాయకుడికి కావల్సిన మేత ఓట్లు. పవర్ చేతికొస్తే మనదేశంలో కామధేనువుని పాకలో కట్టేసుకున్నట్టే. కల్పతరువుని పెరట్లో నాటినట్టే. పవ రుంటే సర్వభోగాలు ఉన్నట్టే. వారికి వారి నియర్ అండ్ డియర్‌కి చట్టాలు వర్తించవు. అవసరమైతే ఒక్కోసారి తెగించి వాళ్లు ప్రజాసేవ కూడా చెయ్యొచ్చు. మిగతాప్పుడు ఎలా ఉన్నా ఈ గణతంత్ర దినోత్సవం రోజు భారత జాతి గర్వంగా, తలెత్తి జాతీయ పతాకానికి శాల్యూట్ కొడుతుంది. మూడు సింహాల మొహర్ చాలా శౌర్యాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలున్నట్టు, మనది నాలుగుసింహాల ముద్ర. వెనకపడిన నాలుగో సింహం ఏ మాత్రం చైతన్యవంతంగా లేదన్నది మాత్రం నిజం. అందుకే నాలుగో సింహానికి కూడా శాల్యూట్ కొడదాం! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కొల్లాయి కట్టి... 99 ఏళ్లు!
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938 మాలపిల్ల సినిమాలో సూరి బాబు పాడిన గీతం. నిజానికి ఈ కొల్లాయి కట్టే ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే మనం కొంత ఆలోచిస్తాం కానీ, ఎవరీ వ్యక్తి అంటే, ఒక్క క్షణమైనా తడుముకోకుండా, కొల్లాయి కట్టినది గాంధీజీ అని చెప్పేస్తాం. పైపెచ్చు తెలుగు సాహిత్యంలో, ‘కొల్లాయిగట్టితేనేమి’ ఒక ప్రఖ్యాత తెలుగు నవల కూడా. 1960లలో ఈ నవల రాసింది మహీధర రామమోహనరావు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల ఇది. అయితే గాంధీజీ జీవితంలో కూడా ఇది జరిగింది సెప్టెంబర్ 1921లో. తన పత్రిక నవజీవన్‌లో గాంధీ ఇలా చెప్పారు. ‘‘మదరాసు నుంచి మదురైకి రైలుబండిలో వెళ్తుండగా, ఏమీ పట్టనట్టుగా రైలు పెట్టెలో ఉన్న జనాలను చూశాను. అందరూ విదేశీ దుస్తుల్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి నేను నచ్చచెప్పబోయాను. వారు తలలు అడ్డంగా ఊపి ‘‘మేం చాలా పేదవారం, ఖాదీ ధారణ చేయడానికి, కొనాలంటే ఖాదీ చాలా ఖరీదు’’ వారి మాటల అంతరార్థం నేను గ్రహించాను. నేను పూర్తి దుస్తుల్లో ఉన్నాను, తలపై టోపీతో సహా. వీరు చెప్పింది కొంతవరకూ సత్యమే అయినా, కోట్లాదిమంది ప్రజలు కేవలం ఒక్క లంగోటీతో కాలం గడుపుతూ ఇదే నిజాన్ని చెప్తున్నారనిపిం చింది. వారికి నేనేమని సరైన జవాబివ్వగలను, నా వంటిమీది అదనపు దుస్తులను ప్రతి అంగుళమూ గనుక వదులుకుంటే, అలా చేయడం ద్వారా, ఈ దేశపు కోట్లాది మందికి దగ్గర కాగలిగితే.. మరునాడు ఉదయం మదురై సమావేశం తరువాత, వెంటనే నేను ఆ పని చేశాను’’. అలా మదురై మహాత్మునికి కొల్లాయి కట్టించిన తల్లి. తన దుస్తుల ధారణ, జాతీయోద్యమంలో భాగం చేయగల మేధావి గాంధీజీ. కొల్లాయి గాంధీజీ బ్రాండ్‌గా ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరకొర దుస్తుల ఫకీరు, అతిపెద్ద ఉపఖండ స్వాతంత్య్ర పోరాట నాయకుడని, గాంధీజీ ఆకర్షణ వలయంలో పడిపోయింది. ఈ దుస్తుల పద్ధతి, ఒకసారి అయిదో జార్జ్ చక్రవర్తిని బకింగ్ హామ్ భవంతిలో కలవడానికి వెళ్లాల్సివచ్చినప్పుడు, ఇవే దుస్తులా అని ప్రపంచం, పాలక వర్గాలు విస్మయంలో పడ్డాయి. చక్రవర్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చాలీ చాలని దుస్తుల్లోనే వెళ్తారా? అన్నది మీడియా ప్రశ్న. ‘‘మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’’ అన్నది గాంధీజీ ఇచ్చిన చురుకైన జవాబు. విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ రోజుల్లో ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా బ్రిటిష్ వారి పై ఆర్థిక పరమైన దెబ్బ తీశారు గాంధీజీ. ఇలా కొల్లాయి కట్టిన ఘట్టానికి నాంది, సెప్టెంబర్ 1921లో గాంధీజీ బస చేసిన మదురైలోని పడమటి మాసి స్ట్రీట్‌లోని డోర్ నంబర్ 251 ఇల్లు. ఇప్పుడు అదే భవనంలో ఖాదీ ఎంపోరియం నడుస్తున్నది. కొల్లాయిగట్టితేనేమి, మహీధర వారి నవల 1920 డిసెంబర్–1921 ఏప్రిల్ వరకూ కథా కాలంగా నడుస్తుంది. టెక్నికల్‌గా, ఈ నవలలో కథనడిచే కాలానికి ఇంకా గాంధీజీ (సెప్టెంబర్ 1921 దాకా) కొల్లాయి కట్టడం ప్రారంభించలేదు. అందుకే మహీధర వారు, ఎంత చారిత్రక దృష్టితో చెప్పారు అంటే, ఈ నవల కథాకాలం పూర్తి అయిన కొద్ది నెలలకు కానీ గాంధీజీ కొల్లాయి కట్టడం మొదలు కాలేదు. అంటే గాంధీజీ కొల్లాయి కట్టడానికి ముందర కాలంలో, అసలు కొల్లాయి కట్టు గురించి ఏ పాటలూ లేని కాలంలోకి వెళ్ళి (1920–21) తను 1960లో రాసిన నవలకి ఇలా పేరు పెట్టిన సంగతి వివరించారు. అలా 1921లో తన దుస్తుల ధారణ కూడా స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేసిన వ్యూహకర్త గాంధీజీ. ఆ దుస్తుల వ్యూహానికి ఇది 99వ వత్సరం. 70ఏళ్ల రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో, గాంధీజీ కొల్లాయి ధారణ ఈ దేశానికి చేసిన మేలు ఎంతో, స్వదేశీ ఉత్పత్తుల సమాదరణ వల్ల ఎంత అభివృద్ధి సాధించగలమో కూడా ఇంకా మనం గ్రహించవలసి ఉన్నది. (నేడు కృష్ణానదీ నౌకావిహార సాహిత్య సభలో మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలపై సాయంత్రం 5 గంటలకు రామతీర్థ ప్రసంగం) వ్యాసకర్త కవి, విమర్శకులు‘ 98492 00385 రామతీర్థ -
రాజ్యాంగం వేదమంత్రమా, కరదీపికా?
పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ద్రవ్యబిల్లును పొరపాటున తన ఆమోదం కోసం తీసుకువచ్చినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్. హిదయతుల్లా దాన్ని తిరస్కరించారు. ఆయన రాజ్యాంగాన్ని సంప్రదాయంగా కాకుండా, కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలోని సూక్ష్మభేదాలను పట్టించుకోవడం లేదు. రాబర్ట్ బొర్క్ ప్రకారం, మనం రాజ్యాంగాన్ని చదవడం కాదు.. అసలు చదవాలా అన్నదే ప్రశ్న. నేడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మ శాస్త్రాన్ని సీల్ట్ కవర్లో ఉంచేసిన యుగంలోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక..! అత్యంత శ్రద్ధాశక్తులతో, శ్రమకోర్చి రూపొం దించిన భారత రాజ్యాంగం.. రాజకీయ పవి త్రత కలిగిన శాసన పత్రం. నూతన గణతంత్ర వ్యవస్థ నిర్మాతలు పొందుపర్చిన ఆదర్శాలతో అది ప్రతిష్టితమైనది. కానీ దేశంలో 70 ఏళ్లుగా సాగుతున్న క్రమబద్ధ పాలనలో అది దాని ప్రాసంగికతను, ప్రగతిశీల స్వభావాన్ని కోల్పోయిందా అని నేను భీతిల్లుతున్నాను. ఏడు దశాబ్దాలలోపే మన రాజ్యాంగం సారాంశాన్ని లేక స్ఫూర్తిని కొనసాగించకుండా, దాన్ని కేవలం ఒక పూజనీయమైన పవిత్రగ్రంథం స్థాయికి కుదించివేశారు. నిజానికి అది రాజ్యాంగ పరిధిలో స్థాపించిన ప్రభుత్వానికి చెందిన మూడు విశిష్ట విభాగాల దుష్పరిపాలనకు వీలుకల్పించే అధికార వనరుగా మారిపోయింది. వివిధ రాజ్యాంగ సంబంధ కార్యాలయాలు తమ అసమర్థత కారణంగా రాజ్యాంగ ప్రతిని చదవటం కానీ లేక దాని సంవిధానాన్ని అర్థం చేసుకోవడం కాని చేయలేకపోతున్నాయి. తన మహోన్నతమైన ప్రయోజనాన్ని గుర్తించడానికి బదులుగా భారత ప్రజ లపై అధికారాన్ని చలాయించే వనరుగా మాత్రమే మన రాజ్యాంగం మారిపోయింది. వేదమంత్రాల స్థాయిలో రాజ్యాంగ అధికరణలను మతిహీనంగా జపిస్తున్నారు. రాజ్యాంగ న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులే భారత రాజ్యాంగం అత్యున్నత పూజారులు. చాలాకాలం క్రితమే మృతిచెందిన ఇతర దేశాలకు చెందిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయోగించిన సామెతలు, నిగూఢ పదబంధాలు, ఉల్లేఖనల ప్రస్తావనలతో వీరు సంతోష పడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త హైకోర్టు ఏర్పాటు అంశం దీనికి సంబంధించిన తాజా అభాసగా నిలుస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (1956 నుంచి 2014 వరకు మనుగడలో ఉండింది) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 పేరిట పార్లమెంటు చేసిన చట్టం ద్వారా విభజనకు గురైంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలను రూపొందించింది. రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన వివిధ అంశాలను ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకించి విడిగా హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214 అధికరణ ఆదేశించి ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ‘ఏర్పాటు చేయాల్సిన’ అవసరముందని, హైదరాబాద్ పరిధిలోని హైకోర్టును, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా మార్చాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 31 ప్రకటించాయి. అయితే హైదరాబాద్ పరిధిలోని హైకోర్టు మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టే తప్ప మరొకటి కాదు. దాని ప్రాదేశిక అధికార పరిధి రెండు కొత్త రాష్ట్రాల సారాంశంగా ఉండేది. కానీ రెండు రాష్ట్రాల అధికార పరిధిని కలిగి ఉండిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాదేశిక అధికార పరిధిని మాత్రమే కలిగి ఉంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ‘ఏర్పర్చాల్సిన’ తేదీ గురించి పునర్వ్యవస్థీకరణ చట్టం మౌనం వహించింది. అలాగే ప్రత్యేక హైకోర్టును ఏర్పర్చాల్సిన విధివిధానం గురించి కూడా ఈ చట్టం మౌనం పాటిస్తోంది. దీన్ని వివరించడానికి మనం ఆంధ్రప్రదేశ్ చట్టం 1953, సెక్షన్ 28ని ప్రస్తావించాలి. 1956 జనవరి ఒకటవ తేదీన లేక రాష్ట్రపతి ప్రకటన ద్వారా నిర్దేశించిన అంతకు మునుపటి తేదీన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని ఇది నిర్దేశించింది. హైకోర్టు ప్రధాన పీఠం నెలకొల్పాల్సిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నిర్ణయించవచ్చని సెక్షన్ 28(3) ప్రకటించింది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, గుజ రాత్ రాష్ట్రాలను ఏర్పర్చిన బిహార్, మధ్యప్రదేశ్, బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టాల్లో కూడా ఇదే విధమైన అంశాలను మనం చూడవచ్చు. పైన పేర్కొన్న చట్టాలన్నింటిలోనూ నూతనంగా ఏర్పర్చిన హైకోర్టు ఉనికిలోకి వచ్చే తేదీని నిర్ధారించే నిబంధనలను, హైకోర్టు ప్రధాన పీఠం ఎక్కడ ఉండాలో నిర్ణయించే రాజ్యాంగబద్ధ అధికారి గురించి నిర్దిష్టంగా సూచించడమైనది. నూతన హైకోర్టుకు చెందిన రాజ్యాంగబద్ధ ప్రాథమిక శాసనాధికారాన్ని పార్లమెంటు అత్యంత స్పష్టంగా నిర్దేశించింది. దురదృష్టవశాత్తూ, నూతన హైకోర్టు ఉనికిలోకి రావలసిన తేదీకి సంబంధించి 2014 చట్టంలో అలాంటి శాసనసంబంధమైన నిబంధనను మనం చూడలేం. లేక అలాంటి నిర్దిష్ట తేదీని ప్రకటించే అధికారాన్ని భారత రాష్ట్రపతి లేక మరెవరైనా రాజ్యాంగబద్ధ అధికారికి కట్టబెట్టిందీ లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు ఏర్పాటు, భారత రాష్ట్రపతి సంతకం చేసిన 2018 డిసెంబర్ 26 నాటి భారత ప్రభుత్వ గెజెట్‌లో ప్రచురించిన ప్రకటన ద్వారా ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వం వర్సెస్ బి. ధనపాల్ ఎస్ఎల్పి 298902018 మరియు రాష్ట్రాలకు చెందిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రకటన ప్రస్తావిస్తూ, ఆ తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్ అధికార పరిధిలోని హైకోర్టును తెలం గాణ హైకోర్టుగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా విభజించే ప్రకటనను సంబంధిత సమర్థ అధికారి చేయగలరని పేర్కొంది. అయితే న్యాయపాలనా పవిత్ర సూత్రం పరిధిలో అలాంటి సమర్థ అధికారి ఎవరు, స్వయంగా రాజ్యాంగం ద్వారా లేక రాజ్యాంగం పరి ధిలో రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా రాజ్యాంగ పాలన కలిగిన దేశంలో ఏదైనా ప్రభుత్వ చట్టం ద్వారా అలాంటి అధికారాన్ని చలాయిస్తారా అన్నదే ప్రశ్న. నేను ముందే చెప్పినట్లుగా హైకోర్టు ఏర్పాటు తేదీని ఎవరు నిర్ణయించాలి అనే అంశానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పూర్తిగా మౌనం పాటిస్తోంది. కానీ రాష్ట్రపతి పేరుతో జారీ చేసే ప్రకటన ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం లేక దేశ పాలకులు విశ్వసిస్తున్నారు. అయితే ఒరిజనల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉండి ఇప్పుడు మారిన తెలంగాణ హైకోర్టులో కుదించిన ప్రాదేశిక న్యాయాధికార పరిధితో కొనసాగనున్న జడ్జీలుకూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేయడమే ఈ మొత్తం ఉదంతంలో ఉల్లాసం కలిగించే అంశం. అయితే తాజాగా ఎలాంటి నియమకాలకు చెందిన వారంట్లనూ జారీచేయలేదు. నా అభిప్రాయంలో ఇది సరైనదే. కానీ అదేసమయంలో, రాజ్యాంగ సంవిధా నాన్ని లేక రాష్ట్రపతి అధికారాలను విశ్లేషించి చూస్తే ఇలా కొత్తగా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. మాతృసంస్థ అయిన మద్రాసు హైకోర్టు నుంచి ప్రాదేశిక న్యాయాధికార పరిధిలో ఆంధ్ర హైకోర్టు 1953లో ఏర్పాటైన సందర్భంగా మదరాసు హైకోర్టులోనే ఉండిపోయిన న్యాయమూర్తులు కొత్తగా ప్రమాణం చేయలేదు. అలాగే గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నూతన హైకోర్టులను ఏర్పర్చిన సందర్భం లోనూ బాంబే, పాట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కొత్తగా ఎలాంటి ప్రమాణం చేయలేదు. చెప్పుకుంటే ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా పిలుస్తున్న హైదరాబాద్ అధికార పరిధిలో కొనసాగుతున్న జడ్జీలు మాత్రం తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ఇలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, ప్రస్తుత సిట్టింగ్ జడ్జీలు కూడా వాటికి హాజరవటం గమనార్హం. 1969లో నాటి రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ పదవిలో ఉండగానే మరణించినప్పుడు, రాష్ట్రపతిగా వ్యవహరించిన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి రాజ్యాంగం రీత్యా పరిస్థితి డిమాండ్ చేసిన నేపథ్యంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్ హిదయతుల్లా మరొకరి బదులుగా రాష్ట్రపతిగా అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మనీ బిల్లును ఆయన పరిశీలనకు పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1) ప్రకారం, రాష్ట్రపతి ‘సిపార్సు’తో మాత్రమే పార్లమెంటులో మనీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లు నెగ్గినట్లయితే, దాన్ని మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. ఇక్కడ సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికే రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం ఆ బిల్లును శాసనంగా మారుస్తుంది. అయితే పార్లమెంటులో ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ముందుకు పొరపాటున ఆ ద్రవ్య బిల్లును తీసుకెళ్లారు. హిదయతుల్లా రాజ్యాంగం గురించి మరిచిపోయి ఉంటే, లేక రాజ్యాంగం గురించి తెలియకుండా ఉంటే, లేక అహంభావంతో ప్రవర్తించి ఉంటే ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టేవారు. దీంతో పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టకుండానే ఆ బిల్లు భారత ప్రామాణిక శాసనంగా మారిపోయి ఉండేది. హిదయతుల్లా రాజ్యాంగానికి సేవ చేసిన విశిష్ట న్యాయవేత్త. ఆయన రాజ్యాంగాన్ని కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. ఆయన కేవలం సంప్రదాయాలను గుడ్డిగా పాటించే అత్యున్నత పూజారి కాదు. అందుకే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే తన వద్దకు వచ్చిన ఆ ద్రవ్యబిల్లును ఆమోదించడానికి ఆయన తిరస్కరించారు. దాంతో ఆయన కింది అధికారులు న్యాయమీమాంసకు సంబంధించిన ఒక పెను సంక్షోభాన్ని తప్పిస్తూ తమ తప్పును సరిదిద్దుకోవలసి వచ్చింది. హిదయతుల్లా ఇప్పుడు లేరు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలో పొందుపర్చి ఉన్న సూక్ష్మభేదాల గురించి పెద్దగా విచారించడం లేదు. వారితోపాటు ప్రధాన పూజారులు కూడా వాటిని లెక్కబెట్టడం లేదు. ఈ సందర్భంగా నేను రాబర్ట్ బొర్క్ ప్రకటనను గుర్తు చేస్తాను– ఈరోజుల్లో రాజ్యాంగాన్ని ఎలా చదవాలన్నది కాదు.. చదవాలా వద్దా అన్నదే ప్రశ్న. ఇప్పుడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మశాస్త్రాన్ని సీల్ట్‌కవర్‌లో ఉంచేసిన యుగం లోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక! జాస్తి చలమేశ్వర్ వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి -
ఒక ఉడి కథ
ఏ దేశంలో ఉండేదైనా మనుషులే. వాళ్లకుండేదీ కుటుంబాలే. తప్పు చేసిన ‘రోగ్ నేషన్స్’కి శిక్ష వేయాలి కానీ.. ఆ దేశంలో ప్రజలకు నష్టం కలక్కూడదు. యుద్ధంలో అదెలా సాధ్యం?! బాంబులు వేస్తే మంచివారు, చెడ్డవారూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు కదా! అందుకే... సర్జికల్ స్ట్రయిక్స్. అందుకే.. ఈ రిపబ్లిడ్ డే రోజు ‘ఉడి’ చిత్రంపై స్పెషల్ ఫోకస్. సెప్టెంబరు 18, 2016. లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో ఉన్న 12 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారి దాడిలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఆ వాస్తవ కథాంశమే ‘ఉడి: ది సర్జికల్ స్ట్రయిక్.’ విహాన్ సింగ్ షెర్గిల్ (వికీ కౌశల్) భారత ఆర్మీ మేజర్. ఎన్నో యుద్ధాలలో విజయాలు సాధిస్తూ, మాతృదేశానికి సేవ చేస్తుంటాడు. అయితే తన తల్లిని విస్మరిస్తున్నాననే బాధ అతడి హృదయాన్ని దహిస్తూ ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో ఉన్న తల్లి.. చెల్లి దగ్గర ఉంటుంది. ఈ సమయంలో తల్లి దగ్గరకు వెళ్లకపోతే, తనను పూర్తిగా మరచిపోతుంది అనుకుంటాడు. విధుల నుంచి తప్పుకుని, తల్లి దగ్గరకు వెళ్లిపోతానని చెబుతాడు. ‘దేశానికి సేవ చేసే అదృష్టం అందరికీ లభించదు. శక్తి ఉన్నంతవరకు దేశం కోసం పాటుపడాలి’ అని పై అధికారి అనడంతో మనసు మార్చుకుని, తన తల్లి ఉండే ప్రాంతానికి బదిలీ చేయించుకుంటాడు. రాజధానిలో ఆర్మీ బేస్‌లో చేరి, తల్లికి సేవ చేస్తుంటాడు. చెల్లి భర్త మేజర్ కరణ్ కశ్యప్ (మోహిత్ రైనా) కూడా సైనికదళంలోనే పని చేస్తుంటాడు. వారికి ఒక పాప. ఆ పాపలో తండ్రి, మేనమామల దేశభక్తి ప్రవహిస్తుంటుంది. తను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానంటుంది. తల్లి (స్వరూప్ సంపత్)ని చూసుకోవడానికి జాస్మిన్ అల్మైదా (యామీ గౌతమ్) అనే ఒక నర్సుని పెడతాడు విహాన్. ఆమే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజున అకస్మాత్తుగా తల్లి కనిపించదు. అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. ఆ కోపంలో నర్సుని విధుల నుంచి తొలగిస్తారు. ఆమె వెళ్లిపోతుంది. ఇంతలో తల్లిని కారులో తీసుకువస్తారు అపరిచితులు. (వెళ్లిపోయిన ఆ నర్సు తరవాత ‘రా’ ఏజెంట్ అని విహాన్‌కి తెలుస్తుంది). ఈ క్రమంలో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉడిలో చేసిన దాడిలో వీర మరణం పొందుతాడు విహాన్ చెల్లి భర్త కరణ్. టెర్రిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు విహాన్. అదే సమయంలో పాకిస్తాన్ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది భారత ప్రభుత్వం. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గోవింద్ భరద్వాజ్ (పరేశ్ రావల్) సర్జికల్ స్ట్రయిక్‌కి ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ బెటాలియన్‌కి నాయకత్వం వహించి, ఉడి ఆర్మీ బేస్ క్యాంపులో పథకం ప్రకారం దాడులు జరపడానికి విహాన్సింగ్ సన్నద్ధుడవుతాడు. మరోవైపు.. చేతికి చిక్కిన పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు ‘రా’ ఏజెంట్ పల్లవి శర్మ, విహాన్ సింగ్. మొత్తానికి తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్‌కి ముహూర్తం నిర్ణయం అవుతుంది. కేవలం గంటలో ఈ ఆపరేషన్ పూర్తి కావాలి. అయితే పాకిస్తాన్ స్థావరాలలో ఎవరెవరు ఉన్నారో తెలిస్తేనే కాని, వీరి దాడి త్వరగా పూర్తి చేయలేరు. ఏం చేయాలా అని ఆలోస్తుంటారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు తయారుచేస్తున్న గరుడ డ్రోన్ (గరుడ పక్షి బొమ్మ లోపల డ్రోన్ కెమెరా ఉంచుతారు)ను చూస్తాడు భారత ఆఫీసర్. దాని సహాయంతో టెర్రరిస్టుల స్థావరాలను గమనిస్తూ, సమాచారం అందించుకుంటూ టెర్రరిస్టులను మట్టుపెట్టాలనుకుంటారు. పథకం ప్రకారం అన్నీ సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ స్థావరాలకు చేరుకుని, పని పూర్తి చేసుకుని తెల్లారేలోగా వెనక్కు వచ్చేయాలని ప్రధాని ఆదేశం. అడుగడుగునా గరుడ డ్రోన్ సమాచారం అందిస్తూనే ఉంటుంది. పథకం ప్రకారం దాడి జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా గరుడ డ్రోన్ అకస్మాత్తుగా కింద పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా కొద్దిగా కూడా కదలదు. ఇంతలో పాకిస్తానీ టెర్రరిస్టులకు చెందిన ఒక చిన్న కుర్రవాడు అక్కడకు వచ్చి, గరుడను చూసి బొమ్మ అనుకుని, చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తుంటాడు. ఆ పిల్లవాడు గరుడను ఏం చేస్తాడా అని భారత అధికారులు ఆందోళనగా చూస్తుంటారు. రిమోట్ ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గాలిలోకి ఎగురుతుంది. నిమిషాలలో సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం అవుతుంది. ఈ దాడిలో ఆ గరుడను పట్టుకున్న కుర్రవాడు ఎదురుపడతాడు భారత సైనికులకు. ఆ బాలుడి పట్ల దయచూపి విడిచిపెడతాడు విహాన్సింగ్. తెలతెలవారుతున్నా వీరజవానులు ఇంకా వెనుకకు రాకపోవడంతో ప్రధానిలో ఆందోళన బయలుదేరుతుంది. ఇంతలోనే ‘ఆపరేషన్ సక్సెస్, మనవారంతా వెనక్కు వస్తున్నారు’ అనే సమాచారం అందుతుంది. సెర్బియాలో ‘వాస్తవాధీన’ సన్నివేశాలు పాకిస్తాన్‌పై భారతదేశం సర్జికల్ స్ట్రయిక్ జరిగిన సంవత్సరానికి.. సెప్టెంబరు 2017లో తాను ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు ఆదిత్యధర్. ఆ పదకొండు రోజులు (సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 29 వరకు) ఏం జరిగిందనే అంశం ఆధారంగా కథను రూపొందించుకున్నారు. మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో నటించడం కోసం విక్కీ కౌశల్ ఐదు మాసాల పాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. బరువు పెరిగారు. రోజుకి ఐదు గంటల పాటు శ్రమపడ్డారు. ముంబైలోని ‘కఫ్ పరేడ్’లో గన్ ట్రయినింగ్ కూడా తీసుకున్నారు. ముంబై నవీ నగర్లోనే నటులందరికీ శిక్షణ ఇచ్చారు. ఆయుధాలు ఉపయోగించడం నేర్పారు. ‘వాస్తవ అధీన రేఖ’ సన్నివేశాలను సెర్బియాలో చిత్రీకరించారు. యామీ గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో యుద్ధం, యాక్షన్, స్ట్రాటెజీ అన్నీ ఉన్నాయి. నరేంద్రమోడి, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ పాత్రలను కూడా చూపారు దర్శకులు. సర్జికల్‌స్ట్రయిక్ అంటే?! ఇదొక సైనిక దాడి. లక్ష్యాన్ని మాత్రమే ఛేదించి.. ప్రజలకు, చుట్టుపక్క ప్రదేశాలకు, వాహనాలకు, భవంతులకు ఏ మాత్రం హాని, విధ్వంసం జరగకుండా చేసేదే సర్జికల్ స్ట్రయిక్. 1976లో ఉగాండాలోని ఎంటెబ్బే మీద ఆ ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. 1981లో ఇజ్రాయిల్.. ఇరాక్ అణు రియాక్టర్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. అఫ్గానిస్తాన్‌లోని అల్‌కాయిదా స్థావరాల మీద అమెరికా చాలాసార్లు సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఇక మన దేశం 2016 సెప్టెంబరు 18న ‘ఉడి’ ప్రాంతంలో పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. – డా. పురాణపండ వైజయంతి -
వెలుగునీడల ‘గణతంత్రం’
దేశంలో గణతంత్ర వ్యవస్థ ఆవిర్భవించి నేటికి డబ్భైయ్యేళ్లవుతోంది. బ్రిటిష్ వలసపాలకులపై సాగిన అహింసాయుత సమరానికి నేతృత్వంవహించి పరదాస్య శృంఖలాలు తెగిపడేందుకు దోహదపడిన మహాత్ముడి 150వ జయంతి కూడా ఈ ఏడాదే రాబోతోంది. భారతావని సమై క్యంగా, సమష్టిగా సాధించుకున్న స్వరాజ్యాన్ని సురాజ్య స్థాపన దిశగా తీసుకెళ్లడానికి ఉద్దేశించిన భారత రాజ్యాంగం ఏర్పడి ఏడు పదులవుతున్న ఈ సందర్భంలో సమీక్షించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూల స్తంభాలుగా రూపొందిన ఆ రాజ్యాంగం మన గణతంత్ర వ్యవస్థ ప్రగతి పథ ప్రస్థానానికి ఎంతవరకూ తోడ్పడిందో...సామాజిక అసమానతలను, పెత్తందారీ పోకడలను ఏమేరకు తరిమికొట్టగలిగామో... ఆకలి, అనారోగ్యాలను ఎంతవరకూ నిర్మూలించగలిగామో... మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో సాధించినదెంతో చర్చించాల్సిన సందర్భమిది. మిగిలినవాటి మాటెలా ఉన్నా ప్రజాస్వామ్యం పేరు చెప్పి మన దేశంలో క్రమం తప్పకుండా జరుగుతున్నవి ఎన్నికలు మాత్రమే. ఇతరాలన్నీ సామాన్యులకు దేవతావస్త్రాలుగానే మిగిలిపోతున్నాయి. గణతంత్ర వ్యవస్థ ఆవిర్భావంనాటికే మన దేశం ఎన్నో క్లేశాలను చవిచూసింది. ప్రజల్ని మతం పేరిట విభజించాలని చూశారు. లేనిపోని వదంతులు సృష్టించి పరస్పర అవిశ్వాసాన్ని, అపనమ్మ కాన్ని నాటేందుకు ప్రయత్నించారు. ఈ దేశం సమైక్యంగా ముందుకెళ్లగలదా... అసలు మనుగడ సాగించగలదా అని ప్రపంచవ్యాప్తంగా పలువురు సందేహపడే స్థాయిలో ఇదంతా కొనసాగింది. అంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే మన రాజ్యాంగ నిర్ణాయక సభ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో చర్చోపచర్చలు సాగించి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించింది. జాతికి దిశానిర్దేశం చేసింది. వలసపాలకులు ఈ దేశాన్ని వదిలిపోతూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. తమ ప్రమేయంలేని ఈ దేశం పరస్పర ఘర్షణల్లో అతి త్వరలో విచ్ఛిన్న మైపోతుందని జోస్యం చెప్పారు. భారతీయులకు పాలన చేతగాదన్నారు. గణతంత్ర వ్యవస్థ స్థాపన కలగానే మిగులుతుందని, ఏర్పడినా అది ఎంతోకాలం మనుగడ సాగించలేదని లెక్కలేశారు. కానీ వారివన్నీ అక్కసు మాటలేనని మనం రుజువు చేయగలిగాం. సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. కానీ వాటినే చూసి మురుస్తూ వైఫల్యాలను గమనించకపోతే అది ఆత్మవంచన అవుతుంది. ఒకప్పుడు తిండిగింజలకు కటకటలాడిన దేశం ఇప్పుడు స్వయంసమృద్ధి సాధించడం మాత్రమే కాదు.. భారీయెత్తున ఎగుమతులు చేస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం సాధించిన పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ప్రాణాంతక వ్యాధుల్ని చెప్పుకోదగ్గ రీతిలో అదుపు చేయగలిగాం. మన దేశం చెప్పుకోదగ్గ ఆర్థిక శక్తిగా ఎదిగింది. కానీ ఎన్నో రంగాల్లో మన వైఫల్యాలు సిగ్గుపడేలా చేస్తున్నాయి. ప్రజాజీవన రంగంలో నైతిక విలువలు అడుగంటుతున్న తీరు అన్ని స్థాయిల్లోనూ ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సినవారే దోహదపడుతున్న వైనం దిగ్భ్రాం తిగొలుపుతోంది. కాసుల లాలసతో, పదవీవ్యామోహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీ పంచన చేరడానికి ఏమాత్రం తటపటాయించని చవకబారు రాజకీయ నేతల హవా ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటివారి వల్ల మన చట్టసభలు చట్టుబండలవుతున్నాయి. జవాబుదారీతనం కొరవ డుతోంది. చట్టసభల తీరుతెన్నులిలా ఉంటే వాటి వెలుపల అరాచకం రాజ్యమేలుతోంది. గణతంత్ర దినోత్సవానికి రెండురోజుల ముందు హరియాణాలోని రోహ్తక్ సమీపంలో నౌషాద్ మహమ్మద్ అనే 24 ఏళ్ల యువకుణ్ణి గోరక్షక ముఠా కరెంటు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టి హింసిస్తే... అదే మని ప్రశ్నించినవారు లేరు. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతాని కొచ్చిన పోలీసులు అతణ్ణి ఆసు పత్రికి తీసుకెళ్లకపోగా పోలీస్‌స్టేషన్‌లో గొలుసులతో బంధించారు. ఉపాధి అవకాశాల లేమి యువ తను ఇలా సంఘవిద్రోహశక్తులుగా మారడానికి పురిగొల్పుతోంది. మన వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 7.4 శాతం ఉండొచ్చునని ఐక్యరాజ్య సమితి నివేదిక రెండురోజుల క్రితం అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) కూడా దాన్ని 7.5 వరకూ ఉండొచ్చు నని లెక్కేసింది. కానీ విచారించదగ్గ విషయమేమంటే వృద్ధిరేటుకు అనుగుణంగా మన దేశంలో ఉద్యోగిత పెరగడం లేదు. ‘సమ్మిళిత వృద్ధి’ దరిదాపుల్లో కనబడటం లేదు. యువతలో నైపుణ్యాన్ని పెంచుతామని గత యూపీఏ ప్రభుత్వం చెప్పింది. 50 కోట్లమందిని నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమాలను ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగించింది. అయిదారేళ్లు గడిచాక చూస్తే ఏముంది... నిపుణులు పెరిగారుగానీ, వారికి ఉద్యో గాల్లేవు. యువత ఉద్యోగాల వేట సాగించడం కాదు... తామే ఉద్యోగాలను సృష్టించాలంటూ ఆ తర్వాత ఊదరగొట్టారు. కానీ అందుకు అనువైన పథకాల అమలూ సక్రమంగా లేదు. సాగు గిట్టు బాటు కాక, నానాటికీ రుణాల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమే. అయిదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఉపశమనం కలిగించేదే. కానీ ఏడాదిలోపు శిశు మరణాలను, పసికందుల మరణాలను అరికట్టడంలో చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేకపోతున్నాం. ఆర్థిక వ్యత్యా సాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. అసమ అభివృద్ధి మన సమర్థతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికీ నాణ్యమైన విద్య అత్యధికులకు అందుబాటులో లేదు. ఫలితంగా పేదరికమే కోట్లాది కుటుంబాల శాశ్వతంగా చిరునామాగా మారింది. అన్ని రంగాల్లోనూ మాఫియాలదే పైచేయి అవుతోంది. అవి నీతి ఊడలు దిగింది. ఈ దుస్థితి మారాలంటే, మన రాజ్యాంగ నిర్మాతల కలలు ఫలించాలంటే ఆత్మవిమర్శ అవసరం. దిద్దుబాట్లు కీలకం. అందుకు ఈ గణతంత్ర దినోత్సవం ఒక సందర్భం కావాలని ఆశిద్దాం. -
గణతంత్ర దినోత్సవం: దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ పవిత్రకార్యంగా భావించి ఓటింగ్‌లో పాల్గొనాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామ్‌నాథ్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది రాబోతున్న ఎన్నికలను 21వ శతాబ్దపు భారతదేశాన్ని మలిచే విశిష్ట అవకాశంగా పరగణించాలని ఆయన సూచించారు. ఎన్నికలు అంటే రాజకీయ ప్రక్రియ కాదని, అది ఉమ్మడి విజ్ఞత, ఉమ్మడి కార్యాచరణ అని, ప్రజాస్వామిక స్ఫూర్తి, ఆదర్శాలు ప్రాతిపదికగా రానున్న 17వ లోక్‌సభ కొలువుదీరాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో మహిళలు, రైతులు సాధికారిత సాధిస్తున్నారని, డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కోవింద్ పేర్కొన్నారు. జాతీయ వనరులపై అందరికీ హక్కులు ఉన్నాయని గుర్తుచేశారు. నేటి మన నిర్ణయాలే రేపటి భవిష్యత్ భారతానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. -
గో ఎయిర్ ఆఫర్ : 999లకే టికెట్
సాక్షి, ముంబై : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విమానయాన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ కూడా తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు రూ.999లకే టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. రేపటితో (జనవరి 26) ఈ ఆఫర్‌ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు. హైదరాబాద్, కోల్‌కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో గో ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లలో కనిష్టంగా రూ.999కే విమాన ప్రయాణం చేయవచ్చు. బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణించవచ్చు. ఇక ముంబై-లేహ రూట్లో ప్రయాణించాలంటే రూ.4,599 చెల్లించాల్సి ఉంటుంది. -
గణతంత్ర దినోత్సవం: దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపు
-
జెట్ ఎయిర్వేస్ రిపబ్లిక్ డే సేల్
సాక్షి,ముంబై : భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను సగం ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడు రోజుల సేల్‌లో పరిమిత కాలం ఆఫర్‌గా అందిస్తున్న 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇరువైపుల ప్రయాణానికి వర్తిస్తుందని తెలిపింది. ప్రీమియం, ఎకానమీ క్లాసుల్లో కూడా ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. జనవరి 30వరకూ ఈ ఆఫర్లో అందుబాటులో ఉండనుంది. మస్కట్, షార్జా తప్ప గల్ఫ్‌లోని అన్ని దేశాలతోపాటు బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్, ఖాట్మాండు, కొలంబో, ఢాకా వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపదికన ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం సరికొత్త కాంబో ఎస్టీవీని ప్రకటించింది. ఎస్టీవీ-269 పేరుతో ఒక ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్‌లో ఏ నెట్‌వర్క్‌కు అయినా 2600 నిమిషాల టాక్‌టైం, 260 మెసేజ్‌లు, 2.6 జీబీ డేటా వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాన్ వాలిడిటీ 26 రోజులు. దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 70వ రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులకు శుభాకాంక్షలు అందిస్తూ బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాస్తవ మీడియా ప్రకటన జారీ చేశారు. -
వారానికో క్రిమినల్ బుల్లెట్లకు బలయ్యాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్కౌంటర్లలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. 2017 మార్చి 19న యూపీ ముఖ్యమంత్రిగా యోగి పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి 16 నెలల్లో, అంటే 2018 జూలై వరకు రాష్ట్రంలో మూడు వేల 26 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 78 మంది నేరస్తులు చనిపోయారు. 838 మంది గాయపడ్డాడు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11వేల 981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు తెలియజేసేందుకు మొత్తం రికార్డులను పరిశీలించగా.. ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. గణాంకాల ప్రకారం 16 నెలల కాలంలో రోజుకు ఆరు ఎన్కౌంటర్లు జరిగాయి. సగటున వారానికి ఒక క్రిమినల్ పోలీసుల బుల్లెట్లకు బలయ్యాడు. -
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్కౌంటర్లలో సరికొత్త రికార్డ్