సాక్షి,ముంబై : భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను సగం ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడు రోజుల సేల్‌లో పరిమిత కాలం ఆఫర్‌గా అందిస్తున్న 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇరువైపుల ప్రయాణానికి వర్తిస్తుందని తెలిపింది. ప్రీమియం, ఎకానమీ క్లాసుల్లో కూడా ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
జనవరి 30వరకూ ఈ ఆఫర్లో అందుబాటులో ఉండనుంది. మస్కట్, షార్జా తప్ప గల్ఫ్‌లోని అన్ని దేశాలతోపాటు బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్, ఖాట్మాండు, కొలంబో, ఢాకా వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపదికన ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment