చదువు అనేది ఉత్పత్తిని పెంచడానికి.. సామాజిక, జాతీయ సమగ్రతకు.. ఆధునికత దిశగా దేశం అడుగులు వేసేందుకు.. సామాజిక, నైతిక, ఆధ్యాత్మికతకు సాధనంగా దోహదపడేలా చూడాలి’
గత 70 ఏళ్లలో నిరక్షరాస్య దేశం నుంచి భారత్ ప్రపంచ జ్ఞాన కేంద్రంగా అవతరించింది. విద్యా రంగంలో అవాంతరాలను అధిగమించి, అభివృద్ధికి బాటలు వేసింది. 1951లో 36.1 కోట్ల జనాభాలో 18.33% మంది ప్రజలే అక్షరాస్యులుగా ఉన్నారు. ప్రస్తుతం 74.04 శాతం మంది ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. పురుషుల్లో 82% మంది, స్త్రీలలో 66%మంది అక్షరాస్యులు. అత్యధిక అక్షరాస్యతా రాష్ట్రంగా 94.65 శాతంతో త్రిపుర నిలిచింది. బిహార్‌లో అతి తక్కువగా 63.82%అక్షరాస్యత ఉంది. ప్రాథమిక విద్య.. 1995లో కేంద్రం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం విద్యా రంగంలోనే విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది.
1950–51లో 2.1 లక్షల ప్రాథమిక పాఠశాలలున్నాయి. 2018 నాటికి దేశం మొత్తం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 8,40,546. సాంకేతిక విద్య.. సాధారణ విద్య స్థానంలో సాంకేతిక విద్య అభివృద్ధి వైపు దేశం పరుగులు తీసింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ కాలేజీలనూ, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఏర్పాటు చేశారు. ఎన్నో పారిశ్రామిక శిక్షణ సంస్థలను అభివృద్ధి పరిచారు. అందులో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) వంటివి ఉన్నాయి.
దాదాపు అన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలను స్థాపించారు. ఉన్నత విద్య.. 1951లో దేశంలో 27 యూనివర్సిటీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉన్నత విద్యలో మూడో అతిపెద్ద దేశం భారత్. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నాయి. 2016 నాటికి దేశంలో 799 విశ్వవిద్యాలయాలున్నాయి. 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 540 స్టేట్ యూనివర్సిటీలు. 122 డీమ్డ్ యూనివర్సిటీలు, 90 ప్రైవేటు యూనివర్సిటీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment