
ఐజ్వాల్: మిజోరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ కుమ్మనామ్ రాజశేఖరన్‌కు వింత పరిస్థితి ఎదురైంది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పలు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రజలెవరూ పాల్గొనలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మాత్రమే వచ్చారు. ప్రజలెవరూ రాకపోవడంతో మైదానమంతా ఖాళీగా ఉంది. అదేసమయంలో గవర్నర్ ప్రసంగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.