Empty seats
-
ప్రేక్షకులకు ఏమైంది?
సాక్షి, బెంగళూరు: ప్రతి శుక్రవారం థియేటర్లలో అభిమానుల సందడి మిన్నంటేది. టికెట్ల దొరకాలంటే నానా పాట్లు పడేవారు. కొత్త సినిమా వస్తోందంటే ఉద్వేగం మిన్నంటేది. కానీ ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు థియేటర్ల వైపు అంతగా చూడడం లేదనే చెప్పాలి. కేజీఎఫ్–2 సినిమా విడుదల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో నూతనోత్సాహం కనిపించింది. కరోనా మహమ్మారి వల్ల చాలా సినిమాల షూటింగ్‌లు అటకెక్కాయి. కేజీఎఫ్ విజయంతో ఆ సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి నాంది పలికారు. గత మూడు వారాలుగా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. గత వారం సుమారు 11 సినిమాలు తెరమీదకు వచ్చాయి. తొలిరోజే ముఖం చాటేశారు అయితే ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. గత వారం విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు ఒక్క రోజు ప్రదర్శనకే పరిమితమయ్యాయి. ప్రేక్షకులు కరువై రెండో రోజు కొన్ని థియేటర్లలో ప్రదర్శన రద్దు చేశారు. ఈ వారం విడుదలయిన కొన్ని సినిమాలు మొదటి షోనే రద్దు అయ్యాయి. దీంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. కారణాలు అనేకం కరోనా వల్ల ఓటీటీకి ప్రజలు అలవాటు పడిపోవడం, టికెట్లు రేట్లు అధికంగా ఉండడం, పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం వంటివి కారణాలుగా భావిస్తున్నారు. ప్రతి సినిమా కూడా కేజీఎఫ్ అంతటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న ప్రేక్షకులూ పెరిగిపోయారు. మరోవైపు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో ప్రముఖులు చాలా మంది బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో థియేటర్లలో సినిమాను బతికించడం కోసం కన్నడ సినీ రంగ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. -
జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి
-
అయితే మాత్రం ఫొటో తీస్తావా..?
సాక్షి, తమిళనాడు: కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో జనాలు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఫోటో జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి.. దాడి చేశారు. తమిళనాడులోని విరూద్‌నగర్ జిల్లాలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి పెద్దగా జనాలు రాలేదు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి కూడా ఖాళీ కుర్చీలు కనిపించడంతో ఓ తమిళ వార పత్రిక జర్నలిస్టు అయినా ముత్తురాజ్.. ఆ ఖాళీ కుర్చీలను ఫోటో తీశాడు. ఆది కాంగ్రెస్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. ఖాళీ కుర్చీల ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ.. అతని దగ్గరున్న కెమెరాను లాక్కోడానికి ప్రయత్నించడమే కాకుండా అతనిపై దాడికి దిగబడ్డారు. ఇతర జర్నలిస్టులు కలుగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన జర్నలిస్టు ముత్తురాజ్‌ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ గొడవంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ దాడిని ఖండిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలను గూండాల్లా ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. -
ఖాళీ గ్రౌండ్లో గవర్నర్ ప్రసంగం
ఐజ్వాల్: మిజోరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ కుమ్మనామ్ రాజశేఖరన్‌కు వింత పరిస్థితి ఎదురైంది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పలు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రజలెవరూ పాల్గొనలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మాత్రమే వచ్చారు. ప్రజలెవరూ రాకపోవడంతో మైదానమంతా ఖాళీగా ఉంది. అదేసమయంలో గవర్నర్ ప్రసంగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. -
5, 6వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ
గిరిజన గురుకులంలో దరఖాస్తులకు ఆహ్వానం కౌడిపల్లి: మండల కేంద్రమైన కౌడిపల్లిలో ప్రారంభించిన గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో ఏర్పాటు చేయాల్సిన గిరిజన బాలికల గురుకుల పాఠశాలను స్థలాభావం వల్ల కౌడిపల్లిలో ప్రారంభించడం జరిగిందన్నారు. పాఠశాల భవనంతోపాటు హాస్టల్‌తో కూడిన భవనం అందుబాటులో ఉండటం, మెరుగైన వసతులు ఉండటంతో పాఠశాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విద్యాసంవత్సరం 5, 6వ తరగతుల్లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.5వ తరగతిలో ఎ, బీ సెక్షన్లు, 6వ తరగతిలో ఎ సెక్షన్ ఉందన్నారు. ఒక్కో సెక్షన్లో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఆయా తరగతిలో 48 మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. మరో 72 సీట్ల ఖాళీగా ఉన్నందున వీటిని కూడా భర్తీ చేస్తామన్నారు. ఆయా తరగతిలో చేరడానికి ఉత్సాహం ఉన్న జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినులు అడ్మిషన్ పొందవచ్చన్నారు. పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించి ప్రవేశం కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. -
మండలి ఖాళీ స్థానాలపై వివాదం
ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని ఖాళీ స్థానాల అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మండలికి మధ్య వివాదంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చూపిన మేరకు 50 స్థానాలకు మించకుండా.. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీ స్థానాలను సర్దుబాటు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తుండగా శాసనమండలి మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఎన్నికల సంఘానికి శాసనమండలి ప్రత్యేక లేఖ పం పింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ మండలికి కేటాయించిన స్థానాలు 50. మండలి వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం 40 మం ది సభ్యులుండగా 13 ఖాళీ స్థానాలున్నాయి. ఈ రెండూ కలిపితే 53 అవుతాయి. చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా మూడు స్థానాలు అదనంగా ఉన్నట్టు అవుతోంది. స్థానాలను తగ్గించాలంటే వాటి పూర్తి పదవీకాలం ముగిశాకే సాధ్యమవుతుందని మండలి వర్గాలు వివరిస్తున్నాయి. శాసనమండలిలో ఖాళీగా ఉన్న 13 స్థానాల్లో 11 స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటా ఒకటి, మరొకటి గవర్నర్ నామినేటెడ్ కోటాగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల కోటా స్థానాల్లో తొమ్మిది స్థానాలు గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం అవ్వడం వల్ల భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. పోతుల రామారావు, తిప్పారెడ్డి, షేక్ హుస్సేన్‌లు మధ్యలో రాజీనామాలు చేసినందున, ఆ స్థానాల పదవీకాలం ఇంకా ఉన్నందున.. అప్పటివరకు అవి ఏపీ మండలి కోటాగానే ఉంటాయని, అందువల్ల వాటిని ఖాళీస్థానాలుగానే పరిగణిస్తాం తప్ప తగ్గినట్లుగా చూపలేమని మండలి వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 17 స్థానాలకుగాను విభజన చట్టంలో 16 పేర్లను ఇదివరకు సూచించారు. అందులో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఈనెల 24న ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మరో స్థానాన్ని అక్కడ భర్తీచేయాల్సి ఉంది. గవర్నర్ నామినేటెడ్ కోటాలోని షేక్ హుస్సేన్ రాజీనామా చేసినందున అది పూర్తిగా రద్దయినట్లుగా భావించి ఎమ్మెల్యే కోటాలో భర్తీచేయాల్సిన 17వ స్థానాన్ని నోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.