governer speech
-
‘ప్రభుత్వం గవర్నర్‌తో అసత్యాలు చెప్పించింది’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదని, కొత్త ప్రభుత్వం చేసే పనికి స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోందన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎన్నో అవార్డులు అందుకొని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవమని, 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు. తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు. కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన విషయాన్ని గవర్నర్ చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు.. అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డామని, ప్రభుత్వ పాలసీలు ఏ ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం గవర్నర్ నుంచి అసత్యాలు చెప్పించిందని, దళిత బంధు ప్రస్తావన లేదన్నారు. పండిన పంట ఇప్పుడే అమ్మకండి అంటూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 500 బోనస్ ఇచ్చి కొంటామని అన్నారని తెలిపారు. ఎందుకు ఇప్పటి వరకు కొనలేదని సూటీగా ప్రశ్నించారు. చదవండి: Tamilisai Soundararajan: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
..మన ప్రసంగ పాఠం సార్!
.. మన ప్రసంగ పాఠం సార్! -
‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్
‘గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.’ - గవర్నర్ తమిళిసై సందరరాజన్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించడం లేదు. స్పందించడం లేదు. అన్నీ అవమానాలే. నేనెక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ వచ్చి పలకరించడం లేదు. తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం రాకపోతే ఆ సమాచారం ఇవ్వడం లేదు. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎన్నో అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటున్నా. ఒక మహిళా గవర్నర్‌ను ఎలా వివక్షకు గురి చేశారన్నది గత మూడేళ్ల రాష్ట్ర చరిత్రలో నమోదైంది..’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పాలనా విధానాలపై ఆమె ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడూ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని.. ఇవి తననేమీ చేయలేవని తమిళిసై స్పష్టం చేశారు. గౌరవించక పోయినంత మాత్రాన తక్కువైపోనని.. తాను చాలా శక్తివంతురాలినని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గవర్నర్ చెప్పిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. రాజ్‌భవన్ అంటరాని ప్రాంతమా? ‘‘సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కావాలని అడిగితే చివరిక్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చేదీ, లేనిదీ కనీసం సమాచారం ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి జాతరకు వెళ్లాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరలేదు. ఎక్కడికైనా కారు, రైలు ద్వారా వెళ్తున్నాను. అయినా అసెంబ్లీలో నా ప్రసంగాన్ని నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం నాడు నేను జాతీయ జెండా ఎగురవేయకుండా నిరాకరించారు. ప్రసంగం కాపీ కోరితే ప్రభుత్వం పంపలేదు. నేను నోరు మూసుకుని ఉండాలా? సాధారణ పౌరురాలిగానే ఆ రోజు మాట్లాడాను. గణతంత్ర దినోత్సవానికి సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇది అంటరాని ప్రాంతమా? వివక్ష చూపుతారా? గణతంత్ర వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని మంత్రివర్గం ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? పరేడ్ ఎందుకు ఉండకూడదు? అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరేడ్ నిర్వహించాయి. కోవిడ్ మహమ్మారి కేవలం తెలంగాణలోనే ఉందా? రాజకీయ సభలు జరగలేదా? హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు గవర్నర్ ఆమోదించాలని లేదు. నేనేమీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని తిరస్కరించడం లేదు. హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నాను. గవర్నర్ కోటాలోని సర్వీసు కేటగిరీలోకి రాడనే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి నియామకాన్ని అంగీకరించలేదు. గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. తాము ఎన్నుకున్నవారు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు తమ సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మహిళా దర్బార్‌కు వచ్చిన అర్జీలు, బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గుర్తుంచుకోవాలి. విద్య, వైద్యం, మహిళా భద్రతే.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళల భద్రత అతిపెద్ద సమస్యలు. గతంలో నన్ను కలవడానికి సీఎం కేసీఆర్ వచ్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ పాత్ర అంతకే పరిమితం! రుణాలపై ఆంక్షలు, హామీల అమలు విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను కేవలం రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాను. పలు పరిమితులున్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం కచ్చితంగా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వేదిక, వ్యవస్థలు ఉన్నాయి. గవర్నర్ పాత్ర ప్రేరణ కల్పించడానికే పరిమితం’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. విమోచన దినమే కరెక్టు..! రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తెలంగాణ విమోచన దినం పేరును మార్చిందని. విమోచన దినమే సరైనదని తాను భావిస్తున్నానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ చరిత్రపై తాను అధ్యయనం చేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పాలనా యంత్రాంగం చూసుకుంటుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం గవర్నర్ జగ్దీప్ ధన్కర్ బీజేపీ సభ్యుల నిరసనల మధ్య తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. కొత్తగాఎన్నికైనఅసెంబ్లీలో గవర్నర్ ధన్కర్ ప్రసంగం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ప్రసంగంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రస్తావన లేదంటూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని, నినాదాలకు దిగారు. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరటంతో ఆయన 2.04 గంటలకు ప్రసంగాన్ని ఆపేసి, బయటకు వెళ్లిపో యారు. అనంతరం ప్రతిపక్ష నేత సువేందు అధికా రి మీడియాతో మాట్లాడుతూ..మరో మార్గం లేకనే ఆందోళనకు తాము దిగాల్సి వచ్చిందంటూ గవర్నర్ ప్రసంగ పాఠం ఉన్న ప్రతులను చూపారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై ఎలాం టి హింస, అత్యాచారం, దాడి జరగలేదంటూ అధికార టీఎంసీ చెప్పుకుంటోంది. నిజాలను దాచిపెడుతోంది. అందుకే, నిరసన తెలిపాం’అని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోసువేందు అధికారితో భేటీ అయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం ప్రధానిమోదీకి లేఖ రాసింది. -
ఖాళీ గ్రౌండ్లో గవర్నర్ ప్రసంగం
ఐజ్వాల్: మిజోరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ కుమ్మనామ్ రాజశేఖరన్‌కు వింత పరిస్థితి ఎదురైంది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పలు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రజలెవరూ పాల్గొనలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మాత్రమే వచ్చారు. ప్రజలెవరూ రాకపోవడంతో మైదానమంతా ఖాళీగా ఉంది. అదేసమయంలో గవర్నర్ ప్రసంగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. -
‘తెలంగాణ రాష్ట్రంలో తెలుగే మాట్లాడతా’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు బాగా నేర్చుకోవాలని టీఆర్ఎస్ ఎమెల్యేలు ఆయనకు సూచించారు. గవర్నర్ ప్రసంగం బాగుందని, కొన్ని అంశాల్లో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాల గురించి మాట్లాడాలేకానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. ఏ పార్టీ సీఎం ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే ప్రజాప్రతినిధులు కొందరు ఉంటారని, చంద్రబాబు మొదలుకొని వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇప్పుడు కూడా అలా కాళ్లు పట్టుకొని తిరుగుతున్న నేతలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సీఎంలు జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడమే కాకుండా కాళ్లు పట్టి గుంజే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. కేసీఆర్ కిట్ పథకం బాగుందని, అందులో రాష్ట్ర వాటా ఎంత? కేంద్ర వాటా ఎంత? అనే వివరాలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే పరిస్థితి నెలకొందని, హెరిటేజ్ అధికారులతో మాట్లాడి త్వరలో కొత్త భవనం కట్టించాలన్నారు. కంటివెలుగులో ఎంతమందికి ఆపరేషన్లు అవసరం అనేది చెప్పలేదని, అనేక మంది అద్దాల కోసం తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలు, కేజీ టూ పీజీ, ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆసరా పెన్షన్లు కొంతమందికి రావడం లేదని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లో పెళ్లయిన తరువాత ఒకటి రెండేళ్లకు చెక్‌లు వస్తున్నాయన్నారు. డ్రగ్స్ కేసులో ఎంతమంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు? ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధూల్‌పేట్ వాసులకు పునరావాసం విషయంలో పక్కా చర్యలు లేకుండాపోయాయన్నారు. సీఎం కూడా వస్తానని రాలేదని, ఆ కుటుంబాలకు పిల్లల ఫీజుల చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. -
అధ్యక్షా.. మీకిది తగునా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభాధిపతి ఎస్.మధుసూదనాచారి తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బహి రంగ ఆక్షేపణలు చేస్తోంది. సోమ, మంగళవారాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో స్పీకర్ బాధ్యతలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత లు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమను ఉద్దేశిస్తూ స్పీకర్ ‘దుర్మార్గం’అనే పదాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు హక్కులే లేవా..? గవర్నర్ ప్రసంగం సందర్భంగా తమ సభ్యుల వ్యవహారశైలిపై అధికార పక్షం స్పందించిన తీరును అమలు చేసే విషయంలో స్పీకర్ మధుసూదనాచారి తమ హక్కులను కాపాడలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సభలోకి వస్తూనే కాంగ్రెస్ సభ్యులు దుర్మారంగా వ్యవహరించారనడంలో స్పీకర్ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సభ్యులందరూ స్పీకర్‌కు ఒకటేనన్న విషయాన్ని విస్మరించారన్నారు. ‘సస్పెన్షన్ ప్రతిపాదనలో నా పేరు చదివినప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారని స్పీకర్‌ను అడిగా. కనీసం నా అరుపులను పట్టించుకోలేదు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను పట్టించుకోలేదు. మేం వెళ్లిపోయిన తర్వాత సీఎం చేత మమ్మల్ని తిట్టించి మరోసారి అవమానపరిచారు. స్పీకర్‌గా ఇది మీకు తగునా?’ అని ప్రశ్నించారు. జరిగిందేంటో ప్రజలకు చూపండి అసలేం జరిగిందో ప్రజలకు, సభకు వీడియో లు చూపించాలని అడిగినా చూపించలేదని ఉత్తమ్ ఆరోపించారు. కనీస విచారణ జరపకుండా తమను సభ నుంచి గెంటివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని తామిచ్చిన పిటిషన్లను నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టుకున్న స్పీక ర్.. సోమవారం ఘటన జరగ్గానే మంగళవా రం చర్యలకు ఎలా ఉపక్రమించారని ప్రశ్నించా రు. స్పీకర్‌కు లేని అధికారాలను ఆయన సంక్రమింపజేసుకుంటున్నారని, హరీశ్ మూవ్ చేస్తే స్పీకర్ పాస్ చేసేలా వ్యవహరిస్తూ ఆ పదవిని అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
29 వరకు అసెంబ్లీ
► 16 రోజులపాటు సభ నిర్వహణకు బీఏసీ నిర్ణయం ► శని, ఆదివారాల్లోనూ శాసనసభ సమావేశాలు ► అవసరమైతే మరో రెండు రోజులు పొడిగింపు ► నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ ► 14న ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటల ► 15, 23, 24, 25 తేదీల్లో సెలవులు ► బీఏసీ భేటీకి టీటీడీఎల్పీ నేత రేవంత్ గైర్హాజరు ► మార్చి 31 వరకు జరగనున్న మండలి సమావేశాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నెల 29వ తేదీ వరకు (16 పని దినాలు) సమావేశాలు నిర్వహించాలని శాసనసభ సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 14న మంత్రి ఈటల రాజేందర్ సభలో ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభ ఎజెండా, పనిదినాలు ఖరారు చేసేందుకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ శాసనసభా పక్షం నేత డాక్టర్ లక్ష్మణ్ ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని లక్ష్మణ్ కోరగా.. మరోమారు బీఏసీ నిర్వహించి ఈ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 14న బడ్జెట్ అనంతరం 15న ఒకరోజు, హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్చి 23, 24, 25 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ నాలుగు రోజులు మినహా.. శని, ఆదివారాలతో సంబంధం లేకుండా వరుసగా మార్చి 12 నుంచి 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంపై నేడు, రేపు చర్చ గవర్నర్ ప్రసంగంపై శని, ఆదివారాల్లో ధన్యవాద తీర్మానాలపై సభ్యులు ప్రసంగిస్తారు. 14న బడ్జెట్ తర్వాత 16, 17, 18, 19 తేదీల్లో సాధారణ చర్చ నిర్వహిస్తారు. 19న ఆర్థిక మంత్రి సమాధానంతో బడ్జెట్‌పై చర్చను ముగిస్తారు. తర్వాత 20 నుంచి 28వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రెండు విడతల్లో బడ్జెట్ పద్దులపై చర్చ నిర్వహించి, ఓటింగ్ జరుపుతారు. సమావేశాల చివరి రోజు మార్చి 29న ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు, ఇతర ప్రభుత్వ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ మరో రెండు రోజుల పాటు.. అంటే మార్చి 30, 31 తేదీల్లో సభను నిర్వహించాల్సి వస్తే సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు చర్చను ప్రారంభిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు శాసనమండలి సభ్యులను కూడా ఆహ్వానించాలని కొందరు ఎమ్మెల్సీలు మంత్రి హరీశ్‌రావును కోరినట్లు సమాచారం. బీఏసీ సమావేశానికి రేవంత్ స్థానంలో సండ్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బీఏసీ సమావేశంలో పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఇటీవల నియమితులైన రేవంత్‌రెడ్డి.. తనకు బదులుగా ఎమ్మెల్యే సండ్ర బీఏసీ సమావేశానికి హాజరవుతారని సీఎంకు లేఖ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నా రేవంత్‌రెడ్డి బీఏసీ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ సీఎం చేసిన విజ్ఞప్తికి.. విపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడంపై సభ బయట అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ, కాంగ్రెస్.. బీఏసీ సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిసింది. మార్చి 31 వరకు మండలి రాష్ట్ర శాసన మండలి సమావేశాలను మార్చి 31 వరకు నిర్వహించాలని చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయించారు. శాసనమండలి ఆవరణలో శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో మండలి సమావేశ తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు మండలి సమావేశాలు నిరవధికంగా జరుగుతాయి. 20న ఆదివారం సెలవుదినంగా పాటించి తిరిగి 21, 22 తేదీల్లో సమావేశం నిర్వహిస్తారు. 23 నుంచి 26వ తేదీ వరకు హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించారు. తిరిగి 27న ప్రారంభమయ్యే మండలి సమావేశాలు 31తో ముగియనున్నాయి. మండలి సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలను కూడా 29 నుంచి 31వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. -
'ఏపీ అగ్రభాగాన ఉండాలని కోరుకుంటున్నా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేలా కోరుకుంటున్నట్టు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మహాసంకల్పం సభలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తెలుగులో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర, వారసత్వం ఉందని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధాని అమరావతి కోసం సీఎం పునాది వేశారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించాలని ప్రార్థిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు.