హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేలా కోరుకుంటున్నట్టు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మహాసంకల్పం సభలో గవర్నర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ తెలుగులో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర, వారసత్వం ఉందని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధాని అమరావతి కోసం సీఎం పునాది వేశారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించాలని ప్రార్థిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు.
'ఏపీ అగ్రభాగాన ఉండాలని కోరుకుంటున్నా'
Published Mon, Jun 8 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement