సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదని, కొత్త ప్రభుత్వం చేసే పనికి స్పష్టత ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోందన్నారు.
గతంలో తమ ప్రభుత్వం ఎన్నో అవార్డులు అందుకొని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవమని, 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు. తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు. కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన విషయాన్ని గవర్నర్ చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు.. అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలన్నారు.
ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డామని, ప్రభుత్వ పాలసీలు ఏ ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం గవర్నర్ నుంచి అసత్యాలు చెప్పించిందని, దళిత బంధు ప్రస్తావన లేదన్నారు. పండిన పంట ఇప్పుడే అమ్మకండి అంటూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 500 బోనస్ ఇచ్చి కొంటామని అన్నారని తెలిపారు. ఎందుకు ఇప్పటి వరకు కొనలేదని సూటీగా ప్రశ్నించారు.
చదవండి: Tamilisai Soundararajan: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment