
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్లలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. 2017 మార్చి 19న యూపీ ముఖ్యమంత్రిగా యోగి పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి 16 నెలల్లో, అంటే 2018 జూలై వరకు రాష్ట్రంలో మూడు వేల 26 ఎన్‌కౌంటర్లు జరిగాయి. అందులో 78 మంది నేరస్తులు చనిపోయారు. 838 మంది గాయపడ్డాడు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11వేల 981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు తెలియజేసేందుకు మొత్తం రికార్డులను పరిశీలించగా.. ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. గణాంకాల ప్రకారం 16 నెలల కాలంలో రోజుకు ఆరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. సగటున వారానికి ఒక క్రిమినల్ పోలీసుల బుల్లెట్లకు బలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment