సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో హిందూవులకు రక్షణ కల్పిచడంలో అధికార బీజేపీ ఘోరంగా విఫలమైంది ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యూపీలో లక్నోలో యాపిల్ సంస్థ మేనేజర్‌ను శనివారం యూపీ పోలీసులు కాల్పిచంపిన విషయం తెలిసిందే. యూపీ పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. హిందూవుల రక్షణే ద్వేయంగా ఏర్పడిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ నేతలు ఓ వైపు గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు బూటకపు ఎన్‌కౌంటర్లలతో హిందూవులను చంపేస్తున్నారని విమర్శించారు.
‘‘ హిందూవైన వివేక్ తివారిని యూపీ పోలీసులు దారుణంగా కాల్చిచంపారు. దేశంలోని హిందూవులకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు. వివేక్ ఎన్‌కౌంటర్‌పై యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ అధినేత అఖిలేస యాదవ్ తీవ్రంగా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ వైఫల్లాల వల్లనే ఇలాంటి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నామని మండిపడ్డారు. యూపీ సర్కార్ జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్ల వల్ల ఎంతో మంది అమయాకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి విచారణ జరపకుండా చట్టాని చేతుల్లోకి తీసుకుని అక్రమంగా ఎన్‌కౌంటర్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని యాదవ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment