
శ్రవణ్, చరణ్ రామ్
ఓ నలభై ఏళ్ల మధ్యతరగతి తండ్రికి తన కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కొడుకు కోరినది ఏదీ కాదనకుండా ఇస్తాడు. కానీ ఆ తండ్రి అతి ప్రేమ కొన్ని ఇబ్బందులకు కారణమైంది. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు ఏంటి? అనే అంశాల ఆధారంగా ‘ఎదురీత’ అనే చిత్రం తెరకెక్కింది. శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోయ్ హీరో హీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేశారు బాలమురుగన్. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కుమారుడి కోసం కన్నతండ్రి సాగించిన ‘ఎదురీత’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు లక్ష్మీ నారాయణ. కాశీ విశ్వనాథ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ‘రంగస్థలం’ మహేశ్, రవిప్రకాష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రకాష్ మనోహరన్ లైన్ ప్రొడ్యూసర్.
Comments
Please login to add a commentAdd a comment