సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించి.. రాష్ట్రపోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.
- తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
- బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడకల్లో ఉత్తమ్‌తో పాటు శాసనసభపక్షనేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment