Big Sale
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్
సాక్షి, ముంబై : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్పెషల్ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌లు తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్పి 2,64,900 రూపాయలు). హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర 62,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. వివో జెడ్ 1 ఎక్స్ వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) 16,990 రూపాయలు (ఎంఆర్పి 24,990 రూపాయలు) పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్‌గా 13,950 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 3 ఏ ధర : 29,999 రూపాయలు. (ఎంఆర్పి రూ .39,999) శాంసంగ్ గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్) రూ.30వేల తగ్గింపు ధరతో 21,999 రూపాయలకు లభ్యం సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్ఇడి స్మార్ట్ టీవీ ధర 42,999 రూపాయలు. (ఎంఆర్పి 72,590 రూపాయలు). పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు డిస్కౌంట్ కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్ఎల్ఆర్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999 రూపాయలు. (ఎంఆర్పి 29,495 రూపాయలు) -
ఎయిర్ ఏసియా బిగ్ సేల్: రూ.999కే సింగపూర్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంభించింది. అదీ అంతర్జాతీయ మార్గంలో ‘బిగ్సేల్’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అదీ అంతర్జాతీయంగా 999 రూపాయలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. మే21- 27తేదీల మధ్య ఈ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సౌకర్యం లభ్యం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా నవంబర్ 1, 2018నుంచి ఆగస్టు13, 2019 వరకు ప్రయాణించే అవకాశం. అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రబీ, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి లాంటి అన్ని ప్రాంతాల నుంచి రూ. 999 (వన్ వే) ప్రారంభ ధరకే టికెట్లను అందిస్తోంది. బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, న్యూఢిల్లీ, గువహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచి, కోలకతా, నాగ్‌పూర్ ఇండోర్, చెన్నై, సూరత్ , భువనేశ్వర్ నుంచి ఈ విదేశీ టికెట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్ కింద ఎయిర్ ఆసియా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విమానాల్లో డిస్కౌంట్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీ ధరల టిక్కెట్లు www.airasia.com, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్‌కు మాత్రమే లభిస్తాయి. ఎయిర్ ఏసియా గ్రూప్ నెట్‌వర్క్‌లోని ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాడ్, థాయ్ ఎయిర్ ఏసియా తదితర ఆపరేటింగ్ సర్వీసుల ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతుంది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం గోవా నుండి కౌలాలంపూర్ టికెట్ 1999నుంచి ప్రారంభం. కోచి నుండి కౌలాలంపూర్‌కు 3,399 రూపాయలు, విశాఖపట్నం-కౌలాలంపూర్ , గోవా-కౌలాలంపూర్ రూ.5514 , హైదరాబాద్- కౌలాలంపూర్ 4,999 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ 3,590 రూపాయలు న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్ రూ.4,290 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. భారతదేశం నుండి కౌలాలంపూర్ ద్వారా పయనించే విమానాల్లో కూడా తక్కువ ధరలను ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్-జకార్తా రూ .2,255, భువనేశ్వర్-కౌలాలంపూర్-యోగ్యకార్తా రూ.3,341, కొచ్చి-కౌలాలంపూర్-బ్రూనే 4,649 రూపాయలు, కోలకతా-బ్యాంకాక్ - డాన్ మెయంగ్-ఫుకెట్ రూ .5405, హైదరాబాద్-కౌలాలంపూర్-పెనాంగ్ 6,613 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ -క్రిబి 5,701 రూపాయలు ప్రారంభ ధరలుగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఎయిర్ ఏసియా అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
రూ.999కే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్
ముంబై : ఎయిర్ఏషియా అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ''బిగ్ సేల్'' ఆఫర్ కింద ఎంపిక చేసిన మార్గాలలో రూ.999కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ టిక్కెట్లు 2018 మార్చి 11 వరకు అందించనున్నామని ఈ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ట్రావెల్ పిరియడ్ 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమై, 2019 మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్ల ధరలు రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. ''బిగ్ సేల్కు ఇది సరియైన సమయం. బీట్దిబడ్జెట్పై తమ అంతర్జాతీయ నెట్వర్క్ రూ.999 నుంచి ప్రారంభమవుతుంది'' అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ వరకు వన్-వే విమానాలకు రూ.999కి విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేల్ కింద ఇతర రూట్లు కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.2,999కు, చెన్నై నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,399కు, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.1,399కు, జైపూర్ నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,690కు ఎయిర్ఏషియా ఆఫర్ చేస్తోంది. www.airasia.comలో ఆన్‌లైన్‌గా మాత్రమే ఈ డిస్కౌంట్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా జరిపే పేమెంట్లకు నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తోంది. పరిమిత సంఖ్యలో సీట్లు, అన్ని విమానాలకు ఇది వర్తించదు వన్-వే జర్నీకే ఈ ఆఫర్ అందుబాటు -
ఎయిర్ ఏసియా ‘బిగ్ సేల్’ చెక్ చేశారా?
న్యూఢిల్లీ: దేశీయ విమాన యాన సంస్థ ఎయిర్ ఆసియా ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే తగ్గింపు ధరల్లో దేశీయ, అంతర్జాతీయంగా టికెట్లను ఆఫర్ చేసిన సంస్థ గురువారం మరో తగ్గింపు ధరలను వెల్లడించింది. ‘బిగ్ సేల్’ పథకం కింద అన్ని ఖర్చులుక లుపుకొని రూ. 899నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. దేశీయ రూట్లలో ఈరేట్లను అమలు చేయనుంది. మార్చి 19 లోపు బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1, 2017 నుంచి జూన్ 5, 2018 మధ్య ప్రయాణించే వెలుసులు బాటు కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ ప్రకారం బెంగళూరు-హైదరాబాద్ మధ్య అతి తక్కువ ధర రూ. 899గా ఉండనుంది. బెంగళూరు, కొచీ, గోవా, పూనే, న్యూ ఢిల్లీ, గౌహతి వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి. తక్కువ ధరల్లో హైదరాబాద్ నుంచి గోవా ఎగిరిపొమ్మని...సర్ఫింగ్, డైవింగ్, స్నోర్కలింగ్ను ఎంజాయ్ చేయమంటూ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. మరిన్ని వివరాలకోసం సంస్థ అధికారిక వెబ్సైట్ http://www.airasia.com ను సందర్శించగలరు. Enjoy surfing, diving, and snorkeling at the beaches of #Goa! Fly from #Hyderabad with the Big Sale for low fares on https://t.co/2XVP2iSTNR pic.twitter.com/ykXBBGJf3V — AirAsia India (@airasiain) March 16, 2017 -
లెనొవొ ‘కే6 పవర్’ బంఫర్ సేల్
బెంగళూరు: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ‘కే6 పవర్’ స్మార్ట్‌ఫోన్ సంచనాలు సృష్టిస్తోంది. ఓపెనింగ్ సెకండ్ సేల్ లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. 15 నిమిషాల్లోనే 35 వేల ఫోన్లు అమ్ముడుపోయినట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఏడు రోజుల్లో 17 లక్షల మంది ఈ ఫోన్లను కొనేందుకు ప్రయత్నించారని వెల్లడించింది. ‘కే6 పవర్’ స్మార్ట్ఫోన్ల విక్రయాల కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో లెనొవొ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నెల 18 నుంచి 21 వరకు ‘కే6 పవర్’ స్మార్ట్ఫోన్లను మూడోసారి ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకానికి పెట్టనున్నారు. ‘కే6 పవర్’ ఫీచర్లు మెటల్ బాడీ డిజైన్ 5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ డాల్బే అట్మాస్ సౌండ్ 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 3 జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 32 జీబీ ఇంటర్నల్ మెమరీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 9,999 -
ఎయిర్ ఏషియా బిగ్ సేల్
హైదరాబాద్: విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్‌సేల్‌లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెక్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్‌కు డెరైక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు. -
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
బెంగళూరు: ఎయిర్ ఏషియా ఇండియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని చార్జీలతో సహా విమాన టిక్కెట్‌ను 799 రూపాయలకే విక్రయిస్తోంది. ఈ 'బిగ్ సేల్' ఆఫర్ ఈ నెల 28 వరకు మాత్రమే ఉంటుంది. కాగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 2016 ఫిబ్రవరి 15, 2016 ఆగస్టు 31 మధ్య ప్రయాణించాలి. బెంగళూరు నుంచి కోచికి విమాన టిక్కెట్ ధర 799 రూపాయలు. ఇక బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖపట్నం టిక్కెట్ ధరలను 999 రూపాయలుగా నిర్ణయించారు. బెంగళూరు-ఢిల్లీ విమాన టిక్కెట్ ధర 1999 రూపాయలు. పలు విమానయాన సంస్థలు ప్రయాణకులను ఆకర్షించేందుకు కోసం ఆఫర్లను ప్రకటించాయి. ఇటీవల ఎయిరిండియా ప్రమోషనల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 1777 రూపాయల నుంచి టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచింది. ఇతర విమానయాన సంస్థుల ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి.