
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
బెంగళూరు: ఎయిర్ ఏషియా ఇండియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని చార్జీలతో సహా విమాన టిక్కెట్ను 799 రూపాయలకే విక్రయిస్తోంది. ఈ 'బిగ్ సేల్' ఆఫర్ ఈ నెల 28 వరకు మాత్రమే ఉంటుంది. కాగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 2016 ఫిబ్రవరి 15, 2016 ఆగస్టు 31 మధ్య ప్రయాణించాలి.
బెంగళూరు నుంచి కోచికి విమాన టిక్కెట్ ధర 799 రూపాయలు. ఇక బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖపట్నం టిక్కెట్ ధరలను 999 రూపాయలుగా నిర్ణయించారు. బెంగళూరు-ఢిల్లీ విమాన టిక్కెట్ ధర 1999 రూపాయలు. పలు విమానయాన సంస్థలు ప్రయాణకులను ఆకర్షించేందుకు కోసం ఆఫర్లను ప్రకటించాయి. ఇటీవల ఎయిరిండియా ప్రమోషనల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. 1777 రూపాయల నుంచి టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచింది. ఇతర విమానయాన సంస్థుల ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి.