లెనొవొ ‘కే6 పవర్’ బంఫర్‌ సేల్‌ | 35,000 Lenovo K6 Power devices sold in 15 minutes | Sakshi
Sakshi News home page

లెనొవొ ‘కే6 పవర్’ బంఫర్‌ సేల్‌

Published Tue, Dec 13 2016 7:03 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

లెనొవొ ‘కే6 పవర్’ బంఫర్‌ సేల్‌ - Sakshi

లెనొవొ ‘కే6 పవర్’ బంఫర్‌ సేల్‌

బెంగళూరు: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ‘కే6 పవర్’  స్మార్ట్‌ఫోన్‌ సంచనాలు సృష్టిస్తోంది. ఓపెనింగ్‌ సెకండ్‌ సేల్‌ లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. 15 నిమిషాల్లోనే 35 వేల ఫోన్లు అమ్ముడుపోయినట్టు ఫ్లిప్‌ కార్ట్‌ తెలిపింది. ఏడు రోజుల్లో 17 లక్షల మంది ఈ ఫోన్లను కొనేందుకు ప్రయత్నించారని వెల్లడించింది. ‘కే6 పవర్’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో లెనొవొ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నెల 18 నుంచి 21 వరకు ‘కే6 పవర్’ స్మార్ట్‌ఫోన్లను మూడోసారి ఫ్లిప్‌కార్ట్‌ లో అమ్మకానికి పెట్టనున్నారు.

‘కే6 పవర్’  ఫీచర్లు
మెటల్ బాడీ డిజైన్
5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్
డాల్బే అట్మాస్ సౌండ్
1.4 గిగాహెర్ట్జ్‌ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఫింగర్ ప్రింట్ స్కానర్
3 జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
32 జీబీ ఇంటర్నల్ మెమరీ
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 9,999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement