
ఎయిర్‌ఏషియా 20 శాతం డిస్కౌంట్
చెన్నై: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా విమాన టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 18 నుంచి నవంబర్ 24 మధ్య జరిగే ప్రయాణాలకు అన్ని రకాల కేటగిరీ టికెట్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌ఏషియా తెలిపింది. భారత్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ దేశాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌ఏషియా ఇండియా సీఈఓ అమర్ అబ్రోల్ తెలిపారు. ఈ టికెట్ల బుకిం గ్‌లు ఆదివారమే ప్రారంభమయ్యాయని, ఈ నెల 17 వరకూ ఉంటాయని వివరించారు.