ముంబై: భారత్‌లో ఈ కామర్స్ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైయిన్ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన రూ.1,800 కోట్ల బడ్జెట్‌కు సమానమని వివరించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,
♦ పేటీఎమ్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్‌తో ప్రత్యేక ఈ కామర్స్ కంపెనీని ఏర్పాటు చేసింది.
♦ ఇప్పటివరకూ ఈ రంగంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలకు భారీ నష్టాలు వచ్చేవి.
♦ తాజాగా ఈ జాబితాలో పేటీఎమ్ కూడా చేరింది.
♦ గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్‌కు రూ.744 కోట్ల ఆదాయం రాగా, రూ.1,806 కోట్ల నష్టాలు వచ్చాయి.
♦ పేటీఎమ్ మాల్‌కు 2016–18 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1,971 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇది, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ సమీకరించిన మొత్తం నిధుల్లో (రూ..4,508 కోట్లు) 44 శాతానికి సమానం.
♦ భారత ఈ కామర్స్ రంగంలో నష్టాలు భారీగా వస్తున్నా, వాల్‌మార్ట్, అమెజాన్ కంపెనీలు తమ భారత సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాయి. పేటీఎమ్‌కు దన్నుగా ఉన్న ఆలీబాబా కూడా ఇదే రీతిగా ఆలోచిస్తోంది.
♦ భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ రిటైల్ సంస్థల్లో పేటీఎమ్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ఉన్నాయి.
♦ సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్, అలీబాబాడాట్‌కామ్‌ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో పేటీఎమ్ మాల్ రూ.2,900 కోట్లు సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment