
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత డాటా భారీ ఆఫర్లతో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్‌తో యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. జియో తాజాగా ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ద్వారా రూ. 399 రీచార్జ్‌పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని జియో ప్రకటించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కూపన్లు రూపంలో లభిస్తుందని తెలిపింది.
జియో న్యూ ఇయర్ ఆఫర్ కోసం ఆన్‌లైన్ రీటైలర్ అజియో.కాంతో జత కట్టింది. రూ.399 రీచార్జ్‌పై 100శాతం అంటే రూ.399 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీనికి సంబంధిచిన కూపన్ మై జియో కూపన్‌లో యాడ్ అవుతుంది. దీని ద్వారా అజియోలో షాపింగ్‌కు వాడవచ్చు. అయితే ఈ క్యాష్ బ్యాక్‌ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ జనవరి 31,2019తో ముగుస్తుంది. ఇలా వచ్చిన కూపన్లను మార్చి 15, 2019 లోపు రిడీమ్ చేసుకోవాలి.