happy new year offer
-
జియో యూజర్లకు న్యూయర్ గిఫ్ట్..!
Jio Happy New Year Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన యూజర్లకు న్యూయర్ గిఫ్ట్‌ను అందించింది. రూ. 2545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై హ్యపీ న్యూయర్ ఆఫర్‌ను యూజర్లకు జియో ప్రకటించింది. సాధారణంగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545 యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. హ్యాపీ న్యూయర్ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చును. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ప్లాన్ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది. రూ. 2545 ప్లాన్ మరిన్ని వివరాలు..! జియో రూ. 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 సందేశాలు, రోజువారీ ప్రాతిపదికన 1.5GB హై-స్పీడ్ డేటా రానుంది. దాంతో పాటుగా జియో టీవీ. జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను పొందవచ్చును. చదవండి: ఈ ఏడాదిలో ఎగబడి సందర్శించిన వెబ్సైట్ ఇదే..! గూగుల్ మాత్రం కాదండోయ్..! -
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అదిరింది
సాక్షి, ముంబై: దేశీయ నెంబరు వన్ టెలికాం సంస్థ రిలయన్స్జియో తన వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను సోమవారం ప్రకటించింది. రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లు అందిస్తోంది. దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉంది. 2020 ఆఫర్ ప్లాన్ కొనుగోలు చేసిన చందారులకు జియో ఫోన్ ఉచితం అంతేకాదు. 12 నెలల సర్వీసులు కూడా ఉచితం. ఈ జియో ఫోన్లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలను అందివ్వనుంది. రేపటి (డిసెంబరు 24) నుంచి ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందనీ ఈ ప్లాన్‌వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత డాటా భారీ ఆఫర్లతో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్‌తో యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. జియో తాజాగా ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ద్వారా రూ. 399 రీచార్జ్‌పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని జియో ప్రకటించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కూపన్లు రూపంలో లభిస్తుందని తెలిపింది. జియో న్యూ ఇయర్ ఆఫర్ కోసం ఆన్లైన్ రీటైలర్ అజియో.కాంతో జత కట్టింది. రూ.399 రీచార్జ్‌పై 100శాతం అంటే రూ.399 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీనికి సంబంధిచిన కూపన్ మై జియో కూపన్లో యాడ్ అవుతుంది. దీని ద్వారా అజియోలో షాపింగ్‌కు వాడవచ్చు. అయితే ఈ క్యాష్ బ్యాక్‌ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ జనవరి 31,2019తో ముగుస్తుంది. ఇలా వచ్చిన కూపన్లను మార్చి 15, 2019 లోపు రిడీమ్ చేసుకోవాలి. -
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లు అదుర్స్
టెలికాం మార్కెట్ సంచలనం జియో న్యూఇయర్ సందర్భంగా కొత్త ప్లాన్లను అందుబాటులో తీసుకొచ్చింది. ప్రత్యర్థి ఆపరేటర్లకు దడ పుట్టిస్తూ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని ఆఫర్లపై అదనపు డేటా ప్రయోజలను అందివ్వనుంది. 2018 సంవత్సరంలో జియో వినియోగదారులకు అధిక డేటా, అపురూపమైన ప్రయోజనాలను అందివ్వనునున్నామని తెలిపింది. అధిక డేటా వినియోగానికి మద్దతు ఇవ్వడానికి, జియో ప్రత్యేకంగా రోజుకి 1.5జీబీ డేటా ప్లాన్‌ను కూడా పరిచయం చేస్తోంది. అంతేకాదు నూతన సంవత్సరంలో తాము ఇవ్వబోతున్న ఆఫర్లలో ఇది మొదటిదని మున్ముందు మరిన్ని ఆఫర్లతో కస్టమర్లకు మరిన్ని డేటా ఆ ఫర్లను అందించనుందట. మంగళవారం, జనవరి 9, 2018 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రూ. 149 ప్యాక్‌పై రోజుకు 1 జీబీ డేటా అందిస్తోంది. ఇది మంత్లీ ప్లాన్. దీంతోపాటు ఇపుడున్న 1 జీబీ ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను అందివ్వనున్నట్టు శుక్రవారం జియో జ్రకటించింది. 1 జీబీ డేటా అందిస్తున్న అన్ని పధకాలపై 2 అదనపు ప్రయోజనాల ఎంపిక. 50శాతం ఎక్కువ డేటా లేదా ప్లాన్ విలువలో రూ.50 డిస్కౌంట్ అందివ్వనుంది. అలాగే రూ. 369ల ప్లాన్‌లో 20శాతం అదనపు డేటాతో , వాలిడిటీనీ కూడా రెండు వారాలను అదనంగా పెంచింది. అంటే 70రోజుల వాలిడిటీ ఈ ప్లాన్ 84రోజులపాలు చెల్లుబాటవుతుంది. రోజుకు1.5 జీబీ డేటా ప్లాన్నుకూడా ప్రకటించింది. రూ.4 లకే ఒక జీబీ అందిస్తోంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభించనున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తాయి. రూ. 50 తగ్గింపు ప్లాన్: ప్రయోజనాలు రూ. 349 ప్యాక్ (రూ. 399 ) 70 రోజుల వాలిడిటీ, 70జీబీడేటా రూ.399 ప్యాక్ (రూ 459 )84 రోజుల చెల్లుబాటు84జీబీ డేటా రూ. 449 ప్లాన్ (రూ 499 )91 రోజుల చెల్లుబాటు 91 జీబీ డేటా 50శాతం అదనపు డేటాప్లాన్లు రూ. 198 ప్యాక్: 28 రోజుల చెల్లుబాటు, 42జీబీ డేటా రూ. 398 ప్యాక్: 70 రోజుల చెల్లుబాటు, 105 జీబీ డేటా రూ. 448 ప్యాక్: 84 రోజుల చెల్లుబాటు,126జీబీ డేటా రూ.498 ప్యాక్: 91 రోజుల చెల్లుబాటు, 136జీబీ డేటా -
క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీ జియో ఆఫర్లపై వివరణ ఇచ్చారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తాజా ఫ్రీ వాయిస్ డేటా ఆఫర్ లో ఎలాంటిని నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని చెప్పింది. ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను ఉల్లఘించలేదని స్పష్టం చేసింది. ప్రారంభ ఆఫర్, తమ తాజా హ్యాపీ న్యూ ఇయర్ రెండూ వేరు వేరని పేర్కొంది. జియో ఉచిత ఆఫర్ ను 2017 మార్చి వరకు పొడిగించడంపై ఇతర టెలికం కంపెనీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వివరణ కోరడంతో జియో ఇలా సమాధానం ఇచ్చింది. తమ ఆఫర్ కొనసాగుతుందని పేర్కొంది. డిసెంబర్ 20న ట్రాయ్ రాసిన లేఖపై స్పందించిన జియో ప్రమోషనల్ ఆఫర్ కు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ భిన్నమైందని పేర్కొంది. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను దోపిడీగా లెక్కించడం తగదని తన వివరణాత్మక సమాధానంలో ట్రాయ్ కు వివరించింది. కాగా సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 4 తో ముగిసిన 90 రోజుల ప్రమోషనల్ ఆఫర్ ముగిసింది. అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో మార్చి 31, 2017వరకు పొడిగించింది. దీన్ని తీవ్రంగా విభేదించిన ప్రధాన టెలికం కంపెనీలు ట్రాయ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?
న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్‌లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. స్నాప్‌డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్‌ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్‌ను, ఆధార్ నెంబర్‌ను స్నాప్‌డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్‌డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట. సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు. -
జియోతో ఢీ అంటూ ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో పోటీ పడేందుకు ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. ఇంతకుముందు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు రకాల ప్యాక్‌లు తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుంది. హేపీ న్యూఇయర్ ఆఫర్ అని దీన్ని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న వెల్కం ఆఫర్‌ను మరింత అప్డేట్ చేస్తూ ఈ ప్యాకేజి తెచ్చింది. ఎయిర్టెల్ అందిస్తున్న రెండు ఇన్ఫినిటీ ప్లాన్లలో ఒకటి రూ. 549, మరోటి రూ. 799 చొప్పున ఉన్నాయి. ఇది నెలకు చెల్లించాల్సిన మొత్తం. ఈ రెండింటిలోనూ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 4జీ డేటా కూడా అందిస్తోంది. రెండు ప్లాన్లలోనూ నేషనల్ రోమింగ్‌లో ఉచిత ఉన్కమింగ్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు ప్రకటించింది. 549 ప్లాన్‌లో ఉచితంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ అందుతాయి. దాంతోపాటు 4జీ హ్యాండ్సెట్లు లేనివారికి 1 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 2జీబీ డేటా ఇస్తున్నారు. దీంతోపాటు వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ అందిస్తోంది. ఇక 799 ప్లాన్‌లో అయితే ఉచితంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చు. దాంతోపాటు 4జీ హ్యాండ్సెట్లు లేనివారికి 2 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 4 జీబీ డేటా ఇస్తున్నారు. ఇందులో కూడా వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ ఉంటుంది.