జియోతో ఢీ అంటూ ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్లు
రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో పోటీ పడేందుకు ఎయిర్‌టెల్ రెండు కొత్త ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. ఇంతకుముందు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు రకాల ప్యాక్‌లు తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుంది. హేపీ న్యూఇయర్ ఆఫర్ అని దీన్ని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న వెల్‌కం ఆఫర్‌ను మరింత అప్‌డేట్ చేస్తూ ఈ ప్యాకేజి తెచ్చింది. ఎయిర్‌టెల్ అందిస్తున్న రెండు ఇన్ఫినిటీ ప్లాన్‌లలో ఒకటి రూ. 549, మరోటి రూ. 799 చొప్పున ఉన్నాయి. ఇది నెలకు చెల్లించాల్సిన మొత్తం. ఈ రెండింటిలోనూ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 4జీ డేటా కూడా అందిస్తోంది. రెండు ప్లాన్లలోనూ నేషనల్ రోమింగ్‌లో ఉచిత ఉన్‌కమింగ్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్‌లు ప్రకటించింది.
549 ప్లాన్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ అందుతాయి. దాంతోపాటు 4జీ హ్యాండ్‌సెట్లు లేనివారికి 1 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 2జీబీ డేటా ఇస్తున్నారు. దీంతోపాటు వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ అందిస్తోంది. ఇక 799 ప్లాన్‌లో అయితే ఉచితంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చు. దాంతోపాటు 4జీ హ్యాండ్‌సెట్లు లేనివారికి 2 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 4 జీబీ డేటా ఇస్తున్నారు. ఇందులో కూడా వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ ఉంటుంది.