rellilance jio
-
ఆర్‌కామ్–జియో డీల్ బ్యాంకులకు మంచిదే
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో మధ్య కుదిరిన డీల్ ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ‘ఆర్‌కామ్–జియో డీల్ బ్యాంకులకు ప్రయోజనకరమైనది. పూర్తి రక్షణ లభిస్తుంది. టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ వీటికి దాదాపు ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఇతర కంపెనీల ప్రమోటర్లకు ఈ డీల్ ఒక మంచి ఉదాహరణలాంటిదని పేర్కొన్నారు. కాగా ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.24,000– 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆర్‌కామ్‌కు రూ.45,000 కోట్లమేర రుణాలున్నాయి. ఎస్బీఐ సహా పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి డజనుకుపైగా బ్యాంకులు ఆర్‌కామ్‌కు రుణాలిచ్చాయి. -
జియో రేట్ల పెంపు పరిశ్రమకు మంచిదే..
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో టారిఫ్ రేట్ల పెరుగుదల టెలికం పరిశ్రమకు మంచిదని ఫిలిప్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది. టారిఫ్‌ల పెంపు వల్ల జియోకి ఒక యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 20 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది టెలికం రంగానికి శుభపరిణామమని పేర్కొంది. ‘జియో రూ.399 ప్లాన్ వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది. దీంతో ఏఆర్పీయూ 20 శాతంమేర పెరగొచ్చు. ఇక 84 రోజుల వాలిడిటీతో కూడిన ఇదివరకటి రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.459 అయ్యింది. ఇక్కడ ఏఆర్పీయూ 15 శాతంమేర పెరుగుతుంది. అంటే జియో సబ్స్క్రైబర్లపై ఏఆర్పీయూ 15–20 శాతంమేర పెరుగుతుంది’ అని వివరించింది. ఇక ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జీల తగ్గుదల కూడా జియోకి కలిసొచ్చే అంశమని తెలిపింది. కాగా మరొకవైపు జియో టారిఫ్ ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నట్లు క్రెడిట్ సూసీ అభిప్రాయపడింది. -
జియోతో ఢీ అంటూ ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో పోటీ పడేందుకు ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. ఇంతకుముందు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు రకాల ప్యాక్‌లు తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుంది. హేపీ న్యూఇయర్ ఆఫర్ అని దీన్ని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న వెల్కం ఆఫర్‌ను మరింత అప్డేట్ చేస్తూ ఈ ప్యాకేజి తెచ్చింది. ఎయిర్టెల్ అందిస్తున్న రెండు ఇన్ఫినిటీ ప్లాన్లలో ఒకటి రూ. 549, మరోటి రూ. 799 చొప్పున ఉన్నాయి. ఇది నెలకు చెల్లించాల్సిన మొత్తం. ఈ రెండింటిలోనూ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 4జీ డేటా కూడా అందిస్తోంది. రెండు ప్లాన్లలోనూ నేషనల్ రోమింగ్‌లో ఉచిత ఉన్కమింగ్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు ప్రకటించింది. 549 ప్లాన్‌లో ఉచితంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ అందుతాయి. దాంతోపాటు 4జీ హ్యాండ్సెట్లు లేనివారికి 1 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 2జీబీ డేటా ఇస్తున్నారు. దీంతోపాటు వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ అందిస్తోంది. ఇక 799 ప్లాన్‌లో అయితే ఉచితంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చు. దాంతోపాటు 4జీ హ్యాండ్సెట్లు లేనివారికి 2 జీబీ వరకు 3జీ డేటా, 4జీ సపోర్ట్ ఫోన్లు ఉన్నవారికి 4 జీబీ డేటా ఇస్తున్నారు. ఇందులో కూడా వింక్ మ్యూజిక్, వింక్ మూవీ సర్వీసులకు ప్రీమియం యాక్సెస్ ఉంటుంది.